అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today November 14th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న విద్యాదేవి.. మహాలక్ష్మీ  అంతు చూడటానికి చేతులు కలిపిన అత్తాకోడళ్లు!

Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవి ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకోవడం సుమతినే విద్యాదేవి అని సీతకు తెలిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ సీఐకి కాల్ చేసి విద్యాదేవి అలియాస్ సుమతిని ఎన్‌కౌంటర్ చేయమని చెప్తుంది. దాంతో సీఐ త్రిలోక్ విద్యాదేవిని పిలిచి వేరే స్టేషన్‌కి తీసుకెళ్లాలని అంటాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పమని విద్యాదేవి అడుగుతుంది. పోలీసులు విద్యాదేవిని తీసుకొని ఎన్‌కౌంటర్ చేయడానికి రాత్రి బయటకు వెళ్తారు. సీన్ కట్ చేస్తే ఉదయం పోలీసులు మహాలక్ష్మీ ఇంటికి వస్తారు. 

మహాలక్ష్మీ: అర్చనతో.. విద్యాదేవిని ఎన్‌కౌంటర్ చేశామని చెప్పడానికి వచ్చారు.
జనార్థన్: ఏంటి సీఐ గారు ఇలా వచ్చారు. 
సీఐ: మీకు ఒక విషయం చెప్పాలి. 
మహాలక్ష్మీ: నాకు తెలుసు సీఐ గారు విద్యాదేవి పారిపోవడానికి ప్రయత్నించి ఉంటుంది. దాంతో ఎన్‌కౌంటర్ చేసుకుంటారు. తను స్పాట్‌లోనే చనిపోయి ఉంటుంది. అంతే కదా. 
రామ్: టీచర్ పారిపోవడానికి ప్రయత్నించారా. ఏదో ఒక మూల ఆవిడ అలాంటిది కాదు అని ఒక నమ్మకం ఉండేది ఇప్పుడు అది కూడా పోయింది.
మహాలక్ష్మీ: ఏంటి సీఐ గారు విద్యాదేవి డెడ్ బాడీ గుర్తించడానికి మమల్ని రమ్మంటారా.
సీఐ: ఆవిడ చనిపోలేదు మేడం. పారిపోయింది. వేరే స్టేషన్‌కి  షిఫ్ట్ చేయాలని ఆర్డర్స్ వచ్చాయి షిఫ్ట్ చేస్తుంటే తను పారిపోయింది.

ఫ్లాష్ బ్యాక్..

విద్యాదేవిని రాత్రి పోలీసులు తీసుకెళ్తుంటే విద్యాదేవికి అనుమానం వస్తుంది. ఇదంతా మహాలక్ష్మీ ప్లాన్ అని గ్రహించి తప్పించుకోవాలి అనుకుంటుంది. ఇక ఓ చోట పోలీసుల్ని ఆపించి టాయిలెట్‌కి వెళ్లాలి అని చెప్పి ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్‌తో కలిసి బయటకు వస్తుంది. అక్కడ వాళ్ల ముఖంలో మట్టి విసిరేసి పారిపోతుంది విద్యాదేవి. లేడీ కానిస్టేబుల్స్ విషయం సీఐకి చెప్తే వెతకమని అంటారు. 

ఇక ఈ విషయం అంతా సీఐ మహాలక్ష్మీ వాళ్లకి చెప్తారు. అలా ఎలా వదిలేశారని మహాలక్ష్మీ అడిగితే తన మీద కనిపిస్తే కాల్చేయమని ఆర్డర్స్ వచ్చాయని సీఐ త్రిలోక్ చెప్తాడు. తర్వాత మహాలక్ష్మీ సీఐతో మాట్లాడుతుంది. ఈ సారి తప్పించుకుంది కానీ నేనేంటో పని పూర్తి చేసి చూపిస్తానని చెప్తుంది. సాఫ్ట్‌గా ఉండే టీచర్ అంత వైలెంట్‌గా ఎలా ఉందో అర్థం కావడం లేదని రామ్ అంటాడు.

ఇక సీత ఓ చోట తన వ్యాన్ డిక్కీ ఓపెన్ చేస్తుంది. దానిలో విద్యాదేవి ఉంటుంది. రాత్రి విద్యాదేవి పోలీసుల నుంచి తప్పించుకుంటుంటే అదే టైంకి అక్కడికి సీత చీరల వ్యాన్‌తో వస్తుంది. విద్యాదేవిని చూసి తన వ్యాన్ ఎక్కించి పోలీసుల నుంచి తప్పిస్తుంది. 

విద్యాదేవి: థ్యాంక్యూ సీత నన్ను కాపాడావు.
సీత: నా మేనత్తని కాపాడుకోవడానికి ఆ మాత్రం చేయలేనా అత్తమ్మ. ( విద్యాదేవి షాక్ అయిపోతుంది) అవును మీరే నా మేనత్త మా సుమతి అత్తమ్మ. 
విద్యాదేవి: ఇదంతా నీకు ఎలా.
సీత: నాకు అంతా తెలుసు అత్తమ్మ నాన్నతో నువ్వు ఫోన్లో మాట్లాడటం. ప్రీతి పెళ్లి కోసం ఆరాటపడటం. మొన్న అంజనం వాడితో మాట్లాడటం అంతా విన్నాను. నాకు మొదటి నుంచి మీరే నా మేనత్త అని అనుమానంగా ఉండేది అదే నిజం అయింది.
విద్యాదేవి: సీత అని ఇద్దరూ హగ్ చేసుకుంటారు. చాలా సార్లు మాట నోటి వరకు వచ్చి ఆగాను. నువ్వు చాలా తెలివైన దానివి నన్ను ఇట్టే పసిగట్టేశావు. ఆ మహాలక్ష్మీ తెలివిగా నన్ను ఇరికించింది.
సీత: అవును అత్తమ్మ ఇప్పుడు మీరే సుమతి అత్తమ్మ అని నిరూపించాలి అంటే నాకు బలమైన సాక్ష్యాలు కావాలి ప్రీతి పెళ్లిలోపు అవి సంపాదిస్తా. అప్పటి వరకు మీకు అజ్ఞాతం తప్పదు. నేను సాక్ష్యాలు సంపాదిస్తా అప్పుడు ఆ మహాలక్ష్మీ అంతు చూద్దాం. అప్పటి వరకు మీరు ఈ వ్యాన్‌లోనే ఉండాలి. ఇందులో అయితే ఎవరికీ అనుమానం రాదు. ఇందులోనే మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. 

సీత ఇంటికి వస్తుంది. సుమతిని వ్యాన్లోనే ఉండమని తాను లోపలికి వెళ్తుంది. సీత ఇంటికి రాగానే రామ్ రాత్రి ఇంటికి రాలేదు ఎందుకు అని సీరియస్ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర, మనీషా మధ్య మల్లెపూల చిచ్చు పెట్టిన లక్ష్మీ.. ఇరువురి భామల మధ్య ఇరుక్కుపోయిన మిత్ర!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget