Seethe Ramudi Katnam Serial Today November 12th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రేవతికి ఆస్తి ఇప్పించిన సీత.. చంపేస్తానని సుమతితో చెప్పిన మహాలక్ష్మీ!
Seethe Ramudi Katnam Today Episode సుమతిని అడ్డుపెట్టుకొని సీత ఆస్తిని రేవతికి మహాలక్ష్మీ చేతనే పంచి ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ సీఐ త్రిలోక్‌ని కలవడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. విద్యాదేవితో మాట్లాడేలా ఏర్పాటు చేయమని చెప్తుంది. కానిస్టేబుల్ విద్యాదేవిని ఓ గదికి తీసుకొస్తుంది. మహాలక్ష్మీ విద్యాదేవిని కలుస్తుంది. నువ్వు సుమతి అని తెలిసే నిన్ను అరెస్ట్ చేయించానని నువ్వు ఎవరో తెలిస్తే నాకు ఇంట్లో విలువ ఉండదు.. నా మాట ఎవరూ వినరు కాబట్టే నిన్ను అరెస్ట్ చేయించానని చెప్తుంది.
మహాలక్ష్మీ: ఈ సారి నిన్ను శాశ్వతంగా జైలులోనే ఉంచబోతున్నా. నీకు నువ్వు చంపుకున్నావనే నిందతో నిన్ను శిక్షించనున్నా. చరిత్రలో ఇలాంటి శిక్ష ఎవరికీ పడదు.
విద్యాదేవి: ఫ్రెండ్‌వని నిన్ను చేరదీస్తే నా స్థానం లాక్కొని నన్నే చంపాలని చూస్తావా. నన్ను చంపాలి అని చూసినప్పుడే నువ్వు నా దృష్టిలో చనిపోయావు. నువ్వు నా ముందు అస్తిపంజరానివి. కుళ్లు కంపు కొడుతున్న కళేబరానివి.
మహాలక్ష్మీ: సుమతి.. ఇంత జరిగినా నీ పొగరు తగ్గలేదా. విద్యాదేవి లానే నువ్వు చనిపోతావు. సీఐ గారు దీన్ని లోపల వేయండి. ముందు జైలు లోకి అటునుంచి అటే చావుకి దగ్గర చేస్తా.
విద్యాదేవి: నువ్వు నన్ను చంపినా ఆత్మలా వస్తా నా పిల్లల్ని కాపాడుకుంటా. అయినా నీ అంతు చూడకుండా నేను చావను నీ చావు నా చేతిలోనే ఉంది మహాలక్ష్మీ..
మహాలక్ష్మీ: దాన్ని కోర్టుకు తీసేకెళ్లే ముందు నాకు కాల్ చేయండి సీఐ గారు.
అర్చన: మొత్తానికి విద్యాదేవిని భలే ఇరికించావు మహా. విద్యాదేవిలా ఉన్న సుమతి అక్కని విద్యాదేవినే చంపిందని భలే ఇరికించావు.
మహాలక్ష్మీ: పోలీస్ స్టేషన్‌లో జరిగింది చెప్పి ఇద్దరూ గట్టిగా నవ్వుతారు. రేవతి, కిరణ్ వస్తారు. అసలు మిమల్ని ఎవరు రమ్మన్నారు.
సీత: నేనే రమ్మన్నాను. ఆ రోజు మీరు ఏం చెప్పారు అత్తయ్య ఆస్తి మొత్తం సుమతి అత్తయ్యదే ఆస్తి పంచాలి అంటే సుమతి అత్తయ్య రావాలి అన్నారు కదా. ఇప్పుడేమో సుమతి అత్తమ్మ చనిపోయిందని సాక్ష్యాలతో నిరూపించారు. అంటే ఇప్పుడు ఆస్తికి మీరు హక్కుదారులు కాబట్టి అన్నావదినలుగా మీరే రేవతి పిన్నికి ఆస్తి పంచి ఇవ్వండి. మీరు సంతకం పెడితే పిన్నికి ఆస్తి వస్తుంది.
చలపతి: నువ్వు సూపర్ సీత వాళ్ల వేలుతో వాళ్లనే పొడిచేశావ్.
రేవతి డాక్యుమెంట్స్ తీసుకొస్తే ఇద్దరు మామయ్యలు, అత్తల్ని సంతకాలు చేయమని సీత అంటుంది. ఓ వైపు సుమతి చనిపోయిన బాధలో ఉంటే ఇప్పుడు ఇదంతా ఎందుకని మహాలక్ష్మీ అంటుంది. మనుషుల కంటే ఆస్తులే ముఖ్యమా అని జనార్థన్ అంటాడు. సంతకాలు పెట్టమని అర్చన వాళ్లు అంటే సీత తప్పదు ఆస్తి ఇవ్వాల్సిందే అంటుంది. దాంతో మహాలక్ష్మీ అందరితో సంతకాలు పెట్టిస్తుంది. రేవతి, కిరణ్‌లకు ఆస్తి ఇచ్చి సీత పంపేస్తుంది. సుమతి చావుని సీత ఇలా వాడుకుంటుందని అనుకోలేదని మహాలక్ష్మీ అర్చనతో చెప్తుంది. ఇంతలో సీత అటువైపు వస్తుంటుంది. సీతని చూసి అర్చన, మహాలక్ష్మీ ఇద్దరూ షాక్ అయిపోతారు. ఆస్తి వాటా పోయిందని బాధ పడుతున్నారా మీ ఆస్తి కాదు కదా ఎందుకు బాధ అని అంటుంది. ఈ ఆస్తి ఐడియా నాదే అని సీత మహాలక్ష్మీ వాళ్లతో చెప్తుంది. ఇద్దరూ సీతని తిట్టుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.