Seethe Ramudi Katnam Serial Today May 8th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: భార్య బతికుండగా భర్తకు రెండో పెళ్లి ఎలా చేస్తారు.. గన్‌తో సీత రచ్చ రచ్చ!
Seethe Ramudi Katnam Today Episode రామ్ రెండో పెళ్లి గురించి తెలిసిందని సీత మహా దగ్గరకు వచ్చి మహాని గన్‌తో కాల్చేస్తా అని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత తనని పొడిచేసినట్లు మహాలక్ష్మీ కల కంటుంది. అది నిజం కాదు కదా అని జనార్థన్‌ని అడిగితే సీత నిజం తెలిస్తే ఏమైనా చేయొచ్చు.. సీతకి రామ్ అంటే ప్రాణం నువ్వు మిథునని కోడల్ని చేయాలని రామ్‌తో పెళ్లి చేసేశావ్. ఆడది ఏమైనా భరిస్తుంది కానీ తన పసుపుకుంకుమల్ని వేరే వారికి పంచితే ఊరుకోదు అంటాడు. సీత ఏ క్షణంలో అయినా ఈ ఇంటికి రావొచ్చు అంటాడు. వస్తే రాని ఏం చేసినా నేను చూసుకుంటా అంటుంది మహాలక్ష్మీ.
ఉదయం మహాలక్ష్మీ సీత తనకు వచ్చిన కల గుర్తు చేసుకొని టెన్షన్‌గా అటూఇటూ తిరుగుతుంటుంది. ఇంతలో అర్చన వచ్చి ఎదురుగా నిల్చొంటే మహా చాలా టెన్షన్ పడుతుంది. సీతకు విషయం తెలిసి కత్తితో పొడిచినట్లు కల వచ్చిందని అంటుంది. తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయి మహా సీత నిజంగా వచ్చి నిన్ను ఏమైనా చేస్తుందేమో అని అర్చన మహాని ఇంకా భయపెడుతుంది. మహాలక్ష్మీ సీత ఎప్పుడు వస్తుందో అని భయంగా ఉందని అంటుంది. ఇంతలో సీత కోపంగా మహా ఇంటికి వస్తుంటుంది. ఇక అర్చన సీత, మిథునల ఫొటో తీసుకొచ్చి మహాకి ఇచ్చి ఇక నుంచి మిథున నీ కోడలు అంటుంది. మహాలక్ష్మీ ఆ పొటో పట్టుకొని సీత ఫొటో ఇక ఇంట్లో ఎందుకు అని విసిరేస్తుంది.
సీత ఆ ఫొటో పట్టుకొని పూల కుండీ పట్టుకొని తన్నేసి ఎంత ధైర్యం ఉంటే నేను మామ ఉన్న ఫొటో విసిరేస్తారు. ప్రాణం మీద తీపి లేదా అని అడుగుతుంది. రామ్ రావడంతో విషయం చెప్తుంది. దానికి చలపతి ఫొటో ఏంటి సీత మహా నిన్నే విసిరేసింది రామ్ పక్కన మిథునని పెట్టేసిందని అంటాడు. ఆవిషయం తెలిసే తేల్చుకుందామని వచ్చానని అంటుంది. ఏంటి అత్తా నువ్వు చేసిన పని నాతో చెప్పకుండా నా భర్తకి రెండో పెళ్లి చేస్తావా అని అడుగుతుంది. దానికి మహాలక్ష్మీ నువ్వు కూడా గతంలో నేను లేని టైంలో నా భర్తకి విద్యాదేవితో పెళ్లి చేశావు కదా అంటుంది. మీరు చనిపోయారు అని అలా చేశానని అంటుంది.
భార్య బతికి ఉన్న వాడికి రెండో పెళ్లి ఎలా చేస్తారు నేను చనిపోయాను అనుకున్నారా అని అడుగుతుంది. దానికి మహా రామ్ నిన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు కదా మా దృష్టిలో నువ్వు చనిపోయినట్లే అని అంటుంది. నేను చినిపోయానా ఇప్పుడు ఎవరు చనిపోతారో చూద్దాం అని గన్ తీసుకొని వచ్చి మహాలక్ష్మీని చంపేస్తానని సీత హడావుడి చేస్తుంది. మహాలక్ష్మీ తనని కాపాడమని జనార్థన్ వెనక దాక్కుంటుంది. రామ్ సీతని ఆపాలని ప్రయత్నిస్తాడు. రామ్ గన్ లాక్కొని పిన్ని తప్పు లేదు సీత నేను మిథునతో తప్పు చేశానని అంటాడు. మిథునతో నువ్వు ఎలా తప్పు చేస్తావ్ మామ మనది సీతారాముల బంధం అనుకున్నా నా నమ్మకం భగ్నం చేశావు కదా అంటుంది. రామ్ సీతని అంతా వివరంగా చెప్తాను అని బయటకు తీసుకెళ్తాడు. నేను రాకుండా మన మధ్య అడ్డుగోడ కట్టేశావు.. నువ్వు రాముడివి కాదు అని బాధ పడుతుంది.
రామ్ జరిగింది సీతతో చెప్తాడు. మిథున ఇచ్చిన పాలు తాగిన తర్వాత మైకం వచ్చిందని బెడ్ మీద నువ్వు కనిపించావని అంటాడు. నువ్వు అనుకొని పక్కన పడుకున్నా లేచి చూస్తే మిథున ఉందని నేను తప్పు చేశానని గోల చేసి పెళ్లి చేసేశారని అంటాడు. నాకు ఆ మిథునకు తేడా లేదా అని సీత గోల చేస్తుంది. సీత చేతులు పట్టుకొని నరకం అనుభవిస్తున్నా సీత అని బతికున్న శవంలా ఉన్నానని ఏడుస్తాడు. అలా అనకు మామ అని సీత ఏడుస్తుంది. నాకు మిథున కాదు నువ్వే కావాలి అని అంటాడు. ఈ మాట మీదే ఉండు ఇక మిథునకు దగ్గరైతే ఊరుకోను అని అంటుంది. అవసరం అయిన రోజు నేను ఏం అడిగితే అది ఇవ్వాలని ఒట్టు వేయించుకుంటుంది. నీ మీద నమ్మకంతో వెళ్తున్నా అని చెప్పి వెళ్తుంది. మహాలక్ష్మీ సీత కోటింగ్‌కి తెగ ఆయాస పడిపోతుంది. జనార్థన్ ఇన్ హెలర్ఇస్తే సెట్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!





















