అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today March 16th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: పొలాల్లో రామ్, మధుల రొమాన్స్.. చూసేసిన సీత, అత్తతో ఛాలెంజ్!

Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ కన్న తల్లి సుమతి చావు వెనకు ఎవరు ఉన్నారో తేల్చుతాను అని సీత మహాలక్ష్మికి సవాలు విసరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode మధుమితని తమ ఇంటి దగ్గరే ఉంచమని శివకృష్ణ ఇంట్లో అందరూ ఎంత చెప్పినా వినకుండా రామ్ మధుమితని తనతో తీసుకొని వెళ్లిపోతాడు. శివ మధు ఎంత పని చేసింది అని తిడతాడు. మధుని చూడగానే రెండు చెంపలు వాయించాలి అనేంత కోపం వచ్చిందని శివ తిడతాడు. ఇక లలిత సూర్యని చూడటానికి అల్లుడు తీసుకొచ్చాను అన్నాడు కదండి అని సర్ది చెబుతుంది.

శివకృష్ణ: వీళ్లు సీతకు తెలిసి వచ్చినా తెలీకుండా వచ్చినా ఇలా రావడం తప్పే. వాళ్ల పిన్ని మాటలు విని రామ్ ఇలా చేయడం ఏం బాలేదు. ఇలా అయితే సీత జీవితం ఏమవుతుంది. 
సీత: హలో నాన్న ఏంటి ఫోన్ చేశారు.
శివకృష్ణ: అమ్మ సీత ఎక్కడున్నావు. అల్లుడు గారు మీ అక్క మన ఊరు వచ్చారమ్మా.. 
సీత: మనసులో.. అయ్యో వాళ్లని నాన్న చూసేశారేమో ఏం జరిగుంటుందో ఏంటో.. వాళ్లు సూర్య బావని కలిశారా నాన్న.. మాట్లాడారా..
లలిత: అల్లుడు గారు మధు మన ఊరు వస్తున్నట్లు నీకు తెలుసా సీత.
సీత: తెలీదు అని చెప్తే అమ్మానాన్న కంగారు పడతారు.. ఎందుకు తెలీదమ్మ.. వాళ్లని సూర్యబావని కలిసి రమ్మని చెప్పిందే నేను.
బామ్మ: ఎంత తెలివి తక్కువ దానివే నువ్వు అలా ఎవరైనా పంపిస్తారా.. వాళ్లతో నువ్వు రావాల్సింది.
శివకృష్ణ: అది కాదు అమ్మ.. ఒక తండ్రిగా నేను ఇలా మాట్లాడకూడదు. ఇప్పటికే ఇక్కడ అందరూ తప్పుగా అనుకుంటున్నారు. అలాంటిది వాళ్లతో నువ్వు రాకుండా ఇద్దరే రావడం సరికాదు. అందులోనూ ఊరి వాళ్ల ఎదుట మాకు ఎలా ఉంటుంది. 
సీత: మనసులో.. మనల్ని ఇబ్బంది పెట్టాలి అనే మహాలక్ష్మి అత్తయ్య ఇలా చేస్తుంది అది మీకు ఎలా చెప్పాలి నాన్న.  
లలిత: సీత నువ్వు అయినా కొంచెం ఆలోచించాల్సింది. 
శివకృష్ణ: మేము వచ్చేశాక మీ అత్తగారు నిన్ను ఏమైనా అన్నారా సీత.
సీత: ఏం అనలేదు నాన్న. అక్కని అయితే చాలా బాగా చూసుకుంటున్నారు. అక్క మీద నాకు నమ్మకం ఉంది అమ్మ. నేను చూసుకుంటాను. 
శివకృష్ణ: అక్కడేం జరిగినా మాతో చెప్పు సీత..
సీత: సారీ నాన్న ఇక్కడ జరిగేవి అన్నీ మీతో చెప్పి మిమల్ని కంగారు పెట్టలేను. నా సమస్యను నేనే సరిదిద్దుకుంటాను. ఈపాటికి అక్క మామ బయల్దేరే ఉంటారు.

మధు: కరెక్ట్‌గా కారు మా ఇంటి ముందే ఆగిపోవాలా.. చాలా థ్యాంక్స్ రామ్ గారు. నన్ను మా ఇంట్లో వదిలేస్తారు ఏమో అని భయపడ్డాను.
రామ్: మిమల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురమ్మని మా పిన్ని చెప్పారు. నేను మా పిన్ని మాట తప్ప ఇంకెరి మాట వినను.
మధు: సీత మాట కూడా వినరా..
రామ్: మా పిన్ని తర్వాతే ఎవరైనా..
మధు: మీరు గ్రేట్ రామ్ గారు మహాలక్ష్మి గారు మీ సొంత మదర్ కాకపోయినా ఆవిడకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు..
రామ్: నాకు మా సొంత మదర్ కంటే పిన్నే ఎక్కువ. నన్ను మా చెల్లిని బాగా చూసుకుంటారు. ఇంటిని ఆఫీస్‌ను చూసుకుంటుంది. అందుకే మా పిన్ని అంటే నాకు అంత ఇష్టం. చూశారా మా పిన్ని గురించి మాట్లాడానో లేదు ఫోన్ చేశారు. చెప్పు పిన్ని.
మహాలక్ష్మి: నీతో మాట్లాడాలి అని చాలా ట్రై చేశాను రామ్. ఇప్పుడు సిగ్నల్ దొరికింది. అక్కడ  ఏం ప్రాబ్లమ్ లేదు కదా..
రామ్: సూర్యని కలిశాం పిన్ని. రిటర్న్‌లో వస్తుంటే శివకృష్ణ గారి ఇంటి ముందు కారు ఆగిపోయింది. అంకుల్ వాళ్లు మమల్ని చూశారు. తొరగా వెళ్లాలి అని చెప్పి వచ్చేశాం. త్వరగా వచ్చేస్తాం పిన్ని.
మహాలక్ష్మి: అంత తొందర ఏం లేదులే రామ్. అన్‌ ది వేలో మన పొలాలు మధుకి చూపించి తీసుకురా.. ఫోన్ మధుకి ఇవ్వు. అంతా ఓకేనా మధు.
మధు: ఓకే అండి ఏ ప్రాబ్లమ్ లేదు.
మహాలక్ష్మి:  రామ్ నీతో ఉంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ట్రిప్‌ని ఎంజాయ్ చేయ్ అన్నీ మర్చిపోయి రిలాక్స్ గా ఉండు. రామ్‌ దగ్గర మొహమాట పడకు. ఏం కావాలి అన్నా అడుగు. రామ్‌కి నువ్వు నచ్చిన మనిషివి. అండీ ఏంటి అత్తయ్య అను మధు. ఓకే అందుకు కాస్త టైం పడుతుంది కదా. నేను వెయిట్ చేస్తాను. 
మధు: రామ్‌ గారు మీకు మీ పిన్నికి మంచి బాండింగ్ ఉందండి..
మహాలక్ష్మి: రేవతి, గిరిధర్‌లతో.. అదే బాండింగ్ మధుమితకు, రామ్‌కు రావాలి అందుకే అలా మాట్లాడాను.
గిరిధర్: మెల్లగా మధుమిత మనసు రామ్‌ వైపు మళ్లుతుంది. సూర్యని మర్చిపోతుంది.
అర్చన: ఈలోపు రామ్ కూడా సీతని పక్కన పెడితే మన పని మరింత ఈజీ అయిపోతుంది. 
మహాలక్ష్మి: ఆ రెండు అతి త్వరలో జరుగుతాయి. ఇంతకీ మన సూర్పణక ఏం చేస్తుంది. 
గిరిధర్: రామ్‌తో మధుమిత బయటకు వెళ్లినందుకే సీత ఇంత భయపడితే రేపు మధు, రామ్‌ల పెళ్లి అయితే సీత సూసైడ్ చేసుకుంటుంది వదినా. 
మహాలక్ష్మి: ఆ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఈరోజు సీతకు ఇంకో జలక్ ఇవ్వబోతున్నాను.

రామ్ మధుమితని పొలాల దగ్గరకు తీసుకొస్తాడు. అక్కడ పనిచేస్తున్న వాళ్ల రామ్ మధులను జంట అనుకుంటాడు. రామ్‌ మధు మాట్లాడుకుంటూ పొలాల్లో తిరుగుతారు. ఇక మధు మీకు చాలా ఆస్తి ఉంది అని రామ్‌ని అంటే నౌకరు మధుతో ఇవే కాదు అమ్మా ఇంకా చాలా ఉన్నాయి అంటాడు. నా లాంటి ఇంకో వంద మంది పని చేస్తుంటారు.

మధు: మీకు బిజినెస్‌ మాత్రమే ఉంది అనుకున్నా. వ్యవసాయం కూడా ఉందా.  
రామ్: మా ఇంట్లో వాడే రైస్, పప్పులు, కూరగాయలు అన్నీ ఈ పొలాల నుంచే వస్తాయి. మా పిన్నికి అన్నీ తెలుసు. తెలియకపోయినా తెలుసుకుంటుంది.
రాజు: అలాంటి అమ్మగారికి మీరు కోడలు అవ్వడం ఇలాంటి బాబుగారికి మీరు భార్య అవ్వడం మీ అదృష్టం అమ్మ. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మీకు ఇలాంటి అదృష్టం రాదు.
రామ్: రాజు నువ్వు వెళ్లి పని చూసుకో. సారీ తను మిమల్ని సీత అనుకుంటున్నాడు. పైగా మన రిషెప్షన్ ఫొటోలు పేపర్‌లో వచ్చాయి కదా చాలా మంది ఇలానే అనుకుంటున్నారు అని రామ్ చెప్తాడు. 

ఇక మధు పర్లేదు అని కింద పడిపోబోతుంటే రామ్ పట్టుకుంటాడు. ఇద్దరు ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇక రాజు ఆ సీన్‌ను ఫొటో తీస్తాడు. మధుకి రామ్ జాగ్రత్తలు చెప్తాడు. ఇక మధుకి నడవడం సరిగా రాకపోతే భుజం మీద చేయి వేసి పట్టుకొని తీసుకెళ్తాడు. రాజు వాటిని ఫోటోలు తీసి మహాలక్ష్మికి పంపిస్తాడు.

మహాలక్ష్మి: జంట చూడముచ్చటగా ఉంది. ఈ కనుల విందు అయిన ఫొటోలతో ఆ సీత కడుపు మండిస్తా అని ఫొటోలను సీతకు పంపిస్తుంది. సీత చూసి షాక్ అయిపోతుంది. ఏడుస్తుంది. ఏంటి సీత నీ ఫోన్‌కు ఏదో వచ్చినట్లు ఉంది. గుండె ఆగిపోయేలా ఉందా.. కాలి కింద భూమి కంపించినట్లు ఉందా.. నువ్వు ఇప్పుడు ఫీలవుతున్నావే అలాంటి ఫీలింగ్ నువ్వు రామ్‌తో కలిసి ఒక రోజు అంతా తిరిగి నాకు ఫొటోలు పంపించినప్పుడు నేనే సేమ్ ఫీల్ అయ్యా. కాకపోతే అప్పుడు నా బాధ పంచుకోవడానికి జనా, అర్చన, గిరిధర్‌లు ఉన్నారు. కానీ నువ్వు ఇప్పుడు ఒంటరివి. నీలో నువ్వే కుమిలిపోవాలి.
సీత: అచ్చు తప్పు అత్త. నేను ఒంటరిగా లేను. నా ఎదురుగా మీరు ఉన్నారు కదా.  
మహాలక్ష్మి: నాతో నీ ఫీలింగ్స్ పంచుకోవడానికి నేను నీ ఫ్రెండ్‌ని కాదు శత్రువుని..
సీత: ఇలాంటివి చెప్తే నేను ఫీలవుతాను అనుకున్నారు. నా మామ పక్కన మా అక్క కాదు వందమంది ఉన్నా నేను ఫీలవను. కాసేపు అయినా మా అక్క తన కష్టాలు మర్చిపోయి హ్యాపీగా ఉందని అనుకున్నాను. మా ఆయన ఎంత మందిలో ఉన్నా హద్దుల్లో ఉంటాడు. మా అక్క ఎక్కడున్నా నీటిగా ఉంటుంది. మనుషుల మీద మీకు నమ్మకం లేకపోవచ్చు కానీ నేను నమ్ముతాను. మీ స్థానంలో మా సుమతి అత్త బతికి ఉంటే మీలా ప్రవర్తించేది కాదు. మీ ఆలోచనలు, కుట్రలు చూస్తుంటే మీరే మా అత్తమ్మని ఏదో చేసి మా మామయ్యని వలలో వేసుకొని  పెళ్లి చేసుకున్నారు అనిపిస్తుంది.
మహాలక్ష్మి:  ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్..
సీత: ఎందుకు అంత కంగారు. మా అత్తమ్మను ఏం చేశారు ఏంటి. 
మహాలక్ష్మి: నేనేం చేస్తానే అయినా ఇప్పుడు ఆ గొడవలు ఎందుకు..
సీత: అన్ని గొడవలు బయటకు తీస్తాను. నిజాల మీద మీరు కట్టిన గోడల్ని బద్దలగొడతాను. మీరు ఇలాంటి చెత్త పనులు చేసి అనవసరంగా నన్ను కెలికితే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. అసలు మా సూర్య బావ అరెస్ట్ వెనుక మీ హస్తం ఉందని అనుమానం వస్తుంది. ఒక్కొక్కటిగా అన్నీ బయటకు తీస్తా. టైం వచ్చినప్పుడు అన్ని గట్టులు బయటకు రప్పిస్తా.. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌ మార్చి 16th: శారదాదేవికి అజయ్‌ వార్నింగ్‌ - ఆర్య పవరేంటో అజయ్‌కి తెలిసేలా చేస్తానన్న కేశవ

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Embed widget