అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today March 12th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తన భార్య మహాలక్ష్మితో వెళ్లిందని రగిలిపోయిన సూర్య.. మధుమిత మీద ఇష్టంతో సీతని దూరం పెడుతున్న రామ్!

Seethe Ramudi Katnam Serial Today Episode మధుమిత తన ఇష్టంతో మహాలక్ష్మి ఇంటికి వెళ్లిపోయింది అని జలజ సూర్యతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode సీత తన అక్క మధుమితకు కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. మధుమిత కాఫీ తీసుకోదు. ఇక సీత మనం అక్కాచెల్లెళ్లం మనకు ఒకరి అంటే ఒకరికి ఇష్టం అని మనం ఇద్దరు వేరు అయినా కలిసే ఉంటామని అంటుంది. ఇక తన చిన్న నాటి విషయాలు చెప్పి తనకు అక్క అంటే ఎంత ఇష్టమో చెప్తుంది.

సీత: అక్క నేను నీకు వెళ్లిపోమన్నాను అని కోపంగా ఉన్నావు కానీ నేను ఎందుకు వెళ్లిపోమన్నానో చెప్పినా నువ్వు నమ్మలేదు. నా భర్తే నమ్మనప్పుడు నువ్వు మాత్రం ఎలా నమ్ముతావు. ఈ ఇంట్లో నువ్వు ఉన్నంత వరకు నేను నీకు విరోధినే అయినా నువ్వు మాత్ర నా అక్కవే. నీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాదే. తల నొప్పిగా ఉండుంటుంది కాఫీ తాగు అక్క. మధు తీసుకొని తాగుతుంది.
మధు: మనసులో.. సూర్య త్వరగా రిలీజ్ అయితే బాగున్ను తనతో చెప్పకుండా వచ్చేశాను. జలజ అక్క బాలాజీ బావ సూర్యతో చెప్పారో లేదో. 
బాలాజీ: సూర్య.. 
సూర్య: మధు ఎలా ఉంది అన్నయ్య. పాపం నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది కదా.. ఏంటి అన్నయ్య సైలెంట్‌గా ఉన్నావు మధు గురించి చెప్పు.
జలజ: ఇంట్లో లేని మనిషి గురించి చెప్పు అంటే మీ అన్నయ్య ఏం చెప్తాడు సూర్య.
సూర్య: ఏంటి మధు ఇంట్లో లేదా. వాళ్ల నాన్న ఇంటికి వెళ్లిందా..
జలజ: కాదు ఆ మహాలక్ష్మి గారి ఇంటికి వెళ్లింది. 
బాలాజీ: అవునురా అప్పుడు నేను ఇంట్లో లేను మహాలక్ష్మి గారు వచ్చి మధుని తీసుకెళ్లిపోయింది. మన ఇంట్లో మధుకి ఇబ్బందిగా ఉంది అని ఆవిడ వచ్చి తీసుకెళ్లింది.
సూర్య: మధుని ఆవిడ ఎందుకు తీసుకెళ్లింది. అయినా మధు ఎలా వెళ్లింది. రాను అని చెప్పలేదా..
జలజ: ఎందుకు చెప్తుంది. మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి మన ఇంటికి పిలిచిందే మధు. నేను ఇక్కడ ఉండలేను తీసుకెళ్లిపోండి అని ఏడ్చింది. నేను మొదటి నుంచే చెప్తున్నా మీ అన్నాదమ్ములు నా మాట వినలేదు. రామ్‌ని కాదు అని నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని మధు మనిషిలో ఎప్పుడూ ఉంది. ఆ ఇంటికి వెళ్లొచ్చాక ఆ స్వర్గాన్ని చూసి మన దరిద్రం మీద విరక్తి వచ్చింది. నువ్వు అరెస్ట్ అవ్వడం మధుకి కలిసొచ్చింది. మంచి జీవితం వెతుక్కొని వెళ్లిపోయింది. 
సూర్య: మీరు చెప్పేది నిజమా వదిన
బాలాజీ: పరిస్థితి చూస్తే నాకు నమ్మాలి అనే అనిపిస్తుందిరా. మధు నిన్ను కావాలనే వదిలేసి వెళ్లిపోయింది. 
సూర్య: అయినా నాతో చెప్పకుండా ఎలా వెళ్లిపోయింది. నేను బయటకు వచ్చి మధు సంగతి చూస్తాను. అప్పుడు తన అంతు చూస్తాను. 

సీత, రామ్‌లు లాయర్‌తో మాట్లాడుతాడు. డ్రగ్స్ కేసు కదా సూర్య బయటకు రావడం కష్టం అని లాయర్ చెప్తాడు. ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తామని సీత అంటుంది. లాయర్‌ని బతిమాలు తుంది. దీంతో లాయర్ తన ప్రయత్నం తాను చేస్తాను అని అంటాడు. ఇక రామ్ మా పిన్ని సూర్యని విడిపిస్తుంది కదా మళ్లీ మన ప్రయత్నం ఎందుకు అని రామ్ సీతని అంటాడు. ఇక లాయర్‌తో మహాలక్ష్మి మాట్లాడుతుంది. సూర్య కేసులో ఎవర్నీ కోపరేట్ చేయొద్దని చెప్తుంది. 

మహాలక్ష్మి: ఒసేయ్ సీత నాతో ధర్మ యుద్ధం చేసి గెలుస్తావా.. నా గురించి ఏమనుకుంటున్నావే.. నా ముందు నీ వయసు ఎంత. నీ అనుభవం ఎంత. నాతోనే ఛాలెంజ్‌ చేస్తావా.. అడుగడుగునా నీకు అడ్డం పడుతూ నిన్ను ఓడిపోయేలా చేస్తాను. నిన్ను ఇంట్లో నుంచి తరిమికొట్టి మధుమితని నా కోడల్ని చేసుకుంటాను. 
సీత: రామ్ భుజం మీద వాలుతూ.. మామ నువ్వు అన్యాయం చేయవు కదా.. నాకు భయంగా ఉంది మామ ఎక్కడ నువ్వు నన్ను వదిలేస్తావో అని. 
రామ్: అలాంటి పిచ్చి ఆలోచినలు మానేయ్..
సీత: ఎలాంటి పరిస్థితిలోనూ నన్ను వదిలేయకు మామ.. 
రామ్: నేను నీ పక్కనే ఉన్నాను కదా.. ఎప్పటికీ ఉంటాను. నీ మీద ఒట్టు. అని తల మీద ముద్దు పెట్టుకుంటాడు. 

మధు సీత మాటలు తలచుకుంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి, అర్చన, ప్రీతి బట్టలు, నగల బ్యాగులు పట్టుకొని వస్తారు. వాటిని మధుకి ఇస్తారు. సీత చాటుగా చూస్తుంది. మహా మనిషివి తనకు తగ్గట్టుగా ఉండాలని సొంత మనిషివి అని తనను మచ్చిక చేసుకుంటారు. ఇక మధు సూర్యను విడిపించమని చెప్తుంది. ఇక సీత గురించి చెప్పుడు మాటలు చెప్తారు. ఇక మధు మహాలక్ష్మితో తాను ఇక్కడ ఉండటం వల్ల సీతకు, రామ్‌కు మధ్య అపార్థాలు వస్తాయని అంటుంది. దీంతో మహాలక్ష్మి రామ్‌కి సీత అంటే ఇష్టం లేదు అని వాళ్లు కలిసి లేరు అని గదిలో కూడా వాళ్ల పక్కలు వేరేవేరు అని మధుతో చెప్తుంది. మధు షాక్ అవుతుంది. ఇక రామ్‌ మనసులో ఇప్పటికీ నువ్వే ఉన్నావేమో అందుకే సీతని దూరం పెడుతున్నాడేమో అని అంటుంది ప్రీతి. దీంతో మహాలక్ష్మి ప్రీతిని కావాలనే తిడుతుంది. ఇక సీత మాటలన్నీ విని నీ  సంగతి చెప్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: అనుష్క: మలయాళీ పాన్ వరల్డ్ మూవీలో అనుష్క - అబ్బో, ఎంత మారిపోయిందో చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget