(Source: ECI/ABP News/ABP Majha)
Seethe Ramudi Katnam Serial Today June 20th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి బతికే ఉందని ఇంట్లో వాళ్లకి చెప్పిన విద్యాదేవి.. వర్ధంతి ఇక లేనట్లే!
Seethe Ramudi Katnam Serial Today Episode సుమతి వర్ధంతిని మహాలక్ష్మి జరిపిస్తుంటే విద్యాదేవిగా ఉన్న సుమతే తన వర్ధంతి అడ్డుకొని సుమతి బతికే ఉందని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode ప్రీతి మహాలక్ష్మి వాళ్ల దగ్గరకు వచ్చి చనిపోయిన తన తల్లి మాట్లాడిందని పిన్ని బ్యాడ్ అని చెప్పిందని ప్రీతి చెప్తుంది. రామ్, తను పిన్ని మాటలు వినకూడదని, ఇంట్లో అందరి గురించి తనకు తెలుసని చెప్పిందని అంటుంది. మహాలక్ష్మి గురించి బ్యాడ్‌గా చెప్పడం ఏంటి. వెళ్లి చూద్దాం అని జనార్థన్, అర్చన బయల్దేరుతారు. మహాలక్ష్మి ఆపి ఫోటోలో సుమతి మాట్లాడటం కాదు సుమతిలా ఆ సీత మాట్లాడుంటుందని చెప్తుంది.
మహాలక్ష్మి: అవును అదే ఇలాంటి అతి తెలివి చూపిస్తుంది. నా గురించి సీతే బ్యాడ్‌గా చెప్తుంది. దాని సంగతి నేను తేల్చుతాను మీరు వదిలేయండి.
విద్యాదేవి: ఫొటో వెనక సీతని పిలిచి.. నేను నిన్ను చూశాను బయటకురా. నువ్వు నాలా భలే మాట్లాడావ్ సీత.
సీత: మీలా మాట్లాడానా టీచర్.
విద్యాదేవి: అదే మీ అత్తయ్యలా మాట్లాడావు. నువ్వు ఎలా ఊహించుకొని మీ అత్తమ్మ మాటలు మాట్లాడావో నేను అలాగే ఊహించుకున్నా.
సీత: మన ఇద్దరి ఆలోచనలు ఒక్కటే టీచర్.
విద్యాదేవి: మన రక్తం ఒకటే కదా సీత. అదే నాట్య రక్తం. నా నరనరాల్లో నాట్యం ఉంది. అలాగే నీ రక్తంలో నాట్యం ఉంది. అయినా నువ్వు ఎందుకు మీ సుమతి అత్తయ్యలా మాట్లాడావ్. ఎందుకు ఈ ఇంటి కోసం అంత తాపత్రయ పడుతున్నావు.
సీత: ఇది నా ఇళ్లు కదా టీచర్. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాది అందుకే ఇలా చేస్తున్నా టీచర్. ప్రీతిని మార్చాలనే సుమతి అత్తమ్మలా మాట్లాడాను టీచర్. నేను తప్పు చేశానా..
విద్యాదేవి: లేదు సీత నువ్వు మంచి పనే చేశావ్. మహాలక్ష్మీ వచ్చి సీత, విద్యాదేవిల మాటలు వింటుంది.
మహాలక్ష్మి: సమస్య సీత తన వల్లే ఈ సమస్యలు అన్నీ.
విద్యాదేవి: సీత వల్ల మీకు ఏం సమస్యలు అండీ.
మహాలక్ష్మి: అది మీకు అనవసరం. ఇది మా కుటుంబ సమస్య. ఏంటి సీత నువ్వు చేసిన పని. సుమతిలా మాట్లాడి ప్రీతిని భయపెడతావా.
విద్యాదేవి: కన్నతల్లి మాట్లాడితే కూతురికి ఎందుకు భయం.
మహాలక్ష్మి: మధ్యలో మీరు మాట్లాడకండి. చనిపోయిన వాళ్లు మాట్లాడితే భయపడతారు కదా. నా పిల్లల దృష్టిలో నన్ను విలన్‌ని చేయాలి అనుకున్నావా.
సీత: వాళ్లు సుమతి అత్తమ్మ పిల్లలు నీ పిల్లలు కాదు.
మహాలక్ష్మి: నువ్వు ఎన్ని చేసినా వాళ్లని నా నుంచి దూరం చేయలేవు.
సీత: నేను వాళ్లని సుమతి అత్తమ్మకి దగ్గర చేస్తాను. ఏదో ఒకరోజు అత్తమ్మ ఈ ఇంటికి ఎలా దూరం అయిందో అందరికీ తెలిసేలా చేస్తాను. అత్తమ్మకి జరిగింది ప్రమాదమో కుట్ర కనిపెడతాను.
విద్యాదేవి: సీత సుమతి వెనక జరిగిన మిస్టరీ బయట పెడుతుంది.
మహాలక్ష్మి: సీతకు ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం.
విద్యాదేవి: నేను సీతకు అండగా ఉంటాను.
మహాలక్ష్మి: నాలుగు రోజులు ఉండి పోయే వారు మీకు ఎందుకు.
విద్యాదేవి: నాలుగు రోజులు ఉంటానో నాలుగు కాలాల పాటు ఉంటానో ఎవరికి తెలుసు. గెస్ట్‌గా వచ్చి తిష్ట వేసేవారు ఈ ఇంటికి కొత్త కాదు కదా. రా సీత..
మహాలక్ష్మి: ఏంటి ఆ విద్యాదేవి ఉద్దేశం. ఏయ్ సుమతి ఎవరే ఈ విద్యాదేవి. నా గురించి అంతా తెలిసినట్లు మాట్లాడుతుంది. నీకు దీనికి ఏమైనా సంబంధం ఉందా. నువ్వు చనిపోయావ్ అనుకున్నా కానీ బతికే ఉన్నావ్ అయినా సరే నీ ఫొటోకి దండం వేసి వర్ధంతి చేస్తాను.
ఉదయం సుమతి ఫొటో దగ్గర దండ, పువ్వులు అన్నీ పెట్టి అన్నీ సరిపోయా లేవా జనా లేదంటే మళ్లీ సుమతి ఆత్మ శాంతించదని అంటుంది. విద్యాదేవి మనసులో.. నాకు మనస్శాంతి లేకుండా చేసి నా ఆత్మకు శాంతి చేయాలని చూస్తావా మహాలక్ష్మి. జనార్థన్, రామ్‌తో పాటు అందరూ మహాలక్ష్మిని పొగుడుతారు. విద్యాదేవి మాత్రం కన్నీళ్లు పెట్టుకొని మహాలక్ష్మి మనకు ద్రోహం చేసిందని అనుకుంటుంది. ఇక సుమతి ఫొటో దగ్గర దీపం వెలిగించి హారతి ఇవ్వమని మహాలక్ష్మి జనార్ధన్, రామ్ వాళ్లకి చెప్తుంది. ఇంతలో విద్యాదేవి అడ్డుకొని చనిపోయిన సుమతి గారి డెడ్ బాడీని మీరు కళ్లారా చూశారా అని అడుగుతుంది. చూడలేదు అని జనార్థన్ అంటే మరి ఆవిడ చనిపోయిందని ఎలా నిర్ధారించుకున్నారని అడుగుతుంది. బాడీని తీసుకురాలేదా అని అడుగుతుంది. ఆవిడ ఎక్కడో ఓ చోట బతికే ఉంటుందని, బతికున్న మనిషికి వర్ధంతి చేయడం తప్పు కదా అని విద్యాదేవి అంటుంది. చలపతి, రేవతిలు కూడా విద్యాదేవికి వత్తాసు పలుకుతాడు. సుమతి బతికే ఉంటుందని గతం మర్చిపోతుందని అంటారు మహాలక్ష్మి , విద్యాదేవిలు మాటలు అనుకుంటారు. ఇంతలో సీత.. చుట్ట పట్టుకుని, నల్ల కోటు వేసుకొని జస్టీస్ చౌదరిలో ఎన్టీఆర్‌లా బిల్డప్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.