అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today July 26th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: పసుపు తాడు తీసుకొచ్చి కిరణ్, రేవతిల పెళ్లి చేస్తానని సీత సవాల్, మహా ఒప్పుకుంటుందా!

Seethe Ramudi Katnam Serial Today Episode రేవతి కిరణ్‌లకు పెళ్లి చేయమని జనార్థన్, గిరిధర్‌లు చెప్పడంతో సీత పసుపు తాడు తీసుకొచ్చి పెళ్లి చేస్తానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today July 26th Episode కిరణ్ డబ్బు సంపాదించినంత మాత్రాన మన ఇంటి ఆడపిల్లకు ఎవరూ లేని అనాథ అయిన కిరణ్‌కి ఇచ్చి పెళ్లి చేయడం తనకు ఇష్టం లేదని మహాలక్ష్మి అంటుంది. కిరణ్‌ని మనతో సమానంగా చూడలేం అని అంటాడు. మహాలక్ష్మి మాటలకు గిరిధర్, అర్చనలు వత్తాసు పలుకుతారు. జనార్థన్‌ కూడా ఆలోచించి కిరణ్ కూడా తనకు ఇష్టం లేదని అంటాడు.

 అర్చన: ఆ డబ్బు అతను న్యాయంగా సంపాదించాడో అన్యాయంగా సంపాదించాడో ఎవరికి తెలుసు.
 మహాలక్ష్మి: వాడు రేవతి మీద ప్రేమతో డబ్బు సంపాదించలేదు మన మీద పగతో సంపాదించాడు. వాడు రేపు రేవతిని మన మీద పగతో హింసిస్తాడు. మీరు మగాలు ఎలాంటి బాధ అయినా భరిస్తారు. కానీ రేపు వాడు మన రేవతిని చిత్ర హింసలు పెడితే నేను అర్చన తట్టుకోలేము. మహాలక్ష్మి నటనకు అర్చన కనీళ్లు పెట్టి గిరిధర్ వద్దు అని చెప్పడంతో జనార్థన్ కూడా రేవతిని కిరణ్‌కి ఇచ్చి పెళ్లి చేయనని అనేస్తాడు. ఈ విషయం రేవతికి జనార్థన్‌కే చెప్పమని మహాలక్ష్మి అంటుంది.  ఈ పెళ్లి ఆపుతామని జనార్థన్ అంటాడు. కిరణ్ ఎదురు తిరిగితే వాడిని తన్ని తరిమేస్తానని గిరిధర్ అంటాడు. 

సీత రామ్‌లు కారులో వస్తుంటారు. సీత రామ్ని చూస్తూ ఉంటుంది. తనని అలా చూడటం వల్ల డిస్ట్రబ్ అవుతున్నా అని రామ్ సీతతో చెప్తాడు. సీత రామ్‌ని పొగుడుతుంది. రాముడికి ఉన్న రకరకాల పేర్లు పెట్టి పిలుస్తుంది. రామ్ కూడా సీతని అమాయకపు సీత, కోతి అని రకరకాలుగా పిలుస్తాడు. ఇద్దరూ రొమాంటిక్‌గా కారులో మాట్లాడుకుంటారు. ఇక పిన్ని, కిరణ్‌లకు త్వరగా పెళ్లి చేయమని సీత అంటుంది. మీ పిన్ని చేయనిస్తుందా అని అడుగుతుంది. తన పిన్ని తప్పకుండా ఒప్పుకుంటుందని రామ్ అంటాడు. ఇంతలో రామ్‌కి కాల్ రావడంతో ఆఫీస్‌కి వెళ్లిపోతాడు. సీతని ఆటోలో ఇంటికి వెళ్లమంటాడు. మరోవైపు రేవతి కిరణ్‌లు ఇంటికి వస్తారు. కిరణ్‌ని లోపలికి రమ్మని రేవతి పిలుస్తుంది. కిరణ్‌ వద్దు అన్నా రేవతి బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది. మహాలక్ష్మి వాళ్లు మాట్లాడుకుంటారు. అందరూ వాళ్ల దగ్గరికి వస్తారు. ఏదో తేడాగా ఉందని చలపతి అనుకుంటాడు. ఇంతలో రేవతి కిరణ్ చేయి పట్టుకొని లోపలికి వస్తుంది. రేవతి కిరణ్ కి కాఫీ ఇస్తాను అంటే ఏం అవసరం లేదని జనార్థన్ అంటాడు. 

జనార్థన్: అతను ఈ ఇంటికి ఎప్పటికీ అల్లుడు కాలేడు. మేం ఈ పెళ్లి చేయడం లేదు. 
రేవతి: మొన్న అలా చెప్పి ఈ రోజు ఇలా అంటారేంటి.
గిరిధర్: మేం ఆరోజు కూడా ఒకే చెప్పలేదు.
అర్చన: సీత మమల్ని బలవంతంగా ఒప్పించింది.
కిరణ్: ఎందుకు వద్దు అంటున్నారో కారణం తెలుసుకోవచ్చా.
మహాలక్ష్మి: నీకు కారణం చెప్పాల్సిన అవసరం మాకు లేదు.
విద్యాదేవి: కారణం చెప్పకుండా ఎలా పెళ్లి ఆపుతారు.
రేవతి: కారణం నాకు చెప్పండి వదినా. కావాల్సినంత డబ్బు సంపాదించాడు కదా.
జనార్థన్: అతను డబ్బు సంపాదిస్తే ఎవరికి గొప్ప రేవతి. అతను ఆ డబ్బు ఎలా సంపాదించాడో ఎవరికి తెలుసు. 
మహాలక్ష్మి: డబ్బు ఒక్కటి సంపాదిస్తే సరిపోతుందా. డబ్బు సంపాదిస్తే సరిపోతుందా.
జనార్థన్: నీ పుట్టు పూర్వొత్తరాలు ఏంటి. మీ అమ్మానాన్న ఎవరు. నీ అడ్రస్ ఏంటి. 

గిరిధర్: ఊరు పేరు లేని నీ లాంటి అనామకుడికి మా చెల్లిని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాం అనుకున్నావ్.  
మహాలక్ష్మి: ఎవరికీ పడితే వాళ్లకి ఈ ఇంటి అడ్రస్ ఎలా ఇస్తాం. అలా చేస్తే దారిన పోయిన ప్రతీ ఒక్కరికీ ఈ ఇళ్లు ధర్మసత్రం అవుతుంది.
రేవతి: నేను కిరణ్ ని ప్రేమిస్తున్నాను అన్నయ్య.
జనార్థన్: నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. 
మహాలక్ష్మి: ఈ పెళ్లి జరగదు.
సీత: జరుగుతుంది. ఇది నా మేనత్త సుమతి ఇళ్లు ఇది నా మేనత్త సుమతి కుటుంబం. నా మేనత్త ఇక్కడ ఉండి ఉంటే తన ఆడపడుచుకి ఏం కావాలో అది చేస్తుంది. తను లేదు కాబట్టే రేవతి వదినకు ఏం కావాలో అది చేస్తా.
మహాలక్ష్మి: ఏం చేస్తావే నువ్వు.
సీత: చూస్తారా ఇప్పుడే వస్తా ఆగండి.

సీత లోపలికి వెళ్లి దేవుడి దగ్గర దారానికి పసుపు రాసి పసుపు కొమ్ము కట్టి తాళి బొట్టులా రెడీ చేస్తుంది. దేవుడికి దండం పెట్టుకొని దాన్ని తీసుకెళ్లి అందరికీ చూపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. మీ కళ్ల ముందే కిరణ్ గారు రేవతి పిన్నికి  తాళి కడతారు ఏం చేస్తారని అందరికీ సవాలు విసురుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: సంధ్య వల్ల కేసు టేకప్ చేసిన ధనుంజయ్.. సత్య, క్రిష్‌లు ఇంట్లో లేరని మహదేవయ్యకు తెలిస్తే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Embed widget