అన్వేషించండి

Satyabhama Serial Today July 26th: సత్యభామ సీరియల్: సంధ్య వల్ల కేసు టేకప్ చేసిన ధనుంజయ్.. సత్య, క్రిష్‌లు ఇంట్లో లేరని మహదేవయ్యకు తెలిస్తే!

Satyabhama Serial Today Episode లాయర్ ధనుంజయ్‌ని కలవడానికి సత్య వాళ్లు వెళ్తే క్రిష్‌ని చూసి ధనుంజయ్ కోప్పడి కేసు తీసుకోనని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today July 2nd Episode సత్యని అడ్డుకోవడమే కాదు మీ మామ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావని మహదేవయ్య క్రిష్‌ని ప్రశ్నిస్తాడు. మీ మామ కోసం కోర్టు చుట్టు ఎందుకు తిరుగుతున్నావని అడుగుతాడు. తాను కోర్టుకు వెళ్లడం వల్ల మీ పరువు పోదు అని క్రిష్‌ అంటే మర్డర్ చేశాడు మీ మామ ఆ మట్టి మనకు అంటుతుందని అంటాడు. మీ మామ నుంచి సత్యని దూరం ఉంచడం కాదు నువ్వు కూడా దూరంగా ఉండాలని మాట అడుగుతాడు. సత్య దూరం నుంచి తండ్రీ కొడుకుల మాటలు వింటుంది.

క్రిష్: ఏంటి బాపు ఇంత చిన్న దానికి మాట ఇవ్వడం ఒట్టు వేయడం ఏంటి. నేను నీ కొడుకుని బాపు నీ పరువు పోయే పనులు నేను ఎందుకు చేస్తా. చిన్న చిన్న విషయాలు చూసి చూడనట్లు వదిలేయాలి. నువ్వు రెస్ట్ తీసుకో బాపు. 

హర్ష, సంధ్యలు కోర్టుకు వస్తారు. తన తండ్రి నిజాయితీ పరుడని ఇంత అన్యాయమా అని అనుకుంటారు. ఇంతలో సత్య అక్కడికి వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్లకి తెలిస్తే అని హర్ష అడిగితే తెలిస్తే తెలియని గొడవ జరిగితే జరగని అంటుంది. క్రిష్‌ మీద కూడా నమ్మకం పోయిందని అందుకే డైరెక్ట్‌గా వచ్చానని అంటుంది.

హర్ష: ఇప్పుడు మీ మామగారే మన ప్రధాన శత్రువు. ఆయనే మనల్ని పరోక్షంగా ఆపుతున్నారు. 
సత్య: తెలుసు. 
సంధ్య: తెలిసే వచ్చావు అంటే మామయ్యని ఎదురించాలనా..
సత్య: ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నా కాపురం గురించి కాదు.
హర్ష: నువ్వు మాతో ఉంటేనే ధైర్యం కానీ నేను ఇప్పుడు నాన్న స్థానంలో ఉన్నాను. అందుకే మీ కాపురం గురించి ఆలోచిస్తున్నాను.

నందిని చెప్పిన లాయర్‌ని సత్య వాళ్లు కలుస్తారు. ఆయన మహదేవయ్యని చంపేస్తారని భయపడతారు. ఇక అతను లాయర్ ధనుంజయ్‌ని కలిస్తే మీ సమస్య తీరుతుందని ఆయన న్యాయం వైపు నిల్చొంటారని న్యాయం ఉంటేనే కేసు టేకప్ చేస్తారని అంటారు. సత్య వాళ్లు ఆయన దగ్గరకు వెళ్తారు. మరో వైపు మహదేవయ్య ఫ్యామిలీ పార్టీ ప్రెసిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక క్రిష్‌ సత్య వాళ్ల దగ్గరకు వస్తాడు. నా మాట వినకుండా ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. హర్ష గొడవ పడొద్దని అంటే నేనే మీ చెల్లితో గొడవ పడను అడుగుతున్నానని అంటాడు. నిన్ను బాధ పెట్టాలి అని లేక చెప్పలేదు అని అంటుంది. ఇక మీ బాపు నీతో మాట్లాడింది నేను విన్నానని సత్య చెప్తుంది.

క్రిష్: నా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కదా సత్య. నేను ముఖం మీద బాపుతో గొడవ పడలేను కదా. అలా చేస్తే బాపునకి ఇంకా కోపం వస్తుంది. రెచ్చి పోతాడు నష్టం ఎవరికి. నీకు నా మీద నమ్మకం కలిగేలా చేసుకోవడానికే నా జీవితం మొత్తం సరిపోతుంది. నా ఓపిక అంతా అయిపోతుంది. ఎంత కాలం ఇలా సత్య మా బాపు మాటలకే లొంగిపోయే వాడిని అయితే ఎందుకు ఇలా లాయర్లు చూట్టూ తిరుగుతాను చెప్పు.
సత్య: సారీ నా కంగారులో నేను ఉండిపోయాను. నీ గురించి ఆలోచించలేకపోయాను. ఒక్క మాట చెప్తాను ఏం అనుకోకు. నా గురించి నువ్వు మీ ఇంటిలో వాళ్లకి ఎందుకు శత్రువులా మారుతున్నావ్.
క్రిష్: సమాధానం నేను చెప్పడం కాదు నువ్వే ఆలోచించు. అర్థమవుతుంది. నేను ఇదే లాయర్‌ని కలుద్దామని వచ్చా ఈ లోపు మీరు ఇక్కడ కనిపించారు. పదండి లాయర్ని కలుద్దాం.

మహదేవయ్య ఇంటికి పార్టీ ప్రెసిడెంట్ వస్తాడు. ఆయనకు స్వాగతం పలికి ఫొటోలు తీసుకుంటారు. ఇక తాను ఓ కార్యకర్త అని మహదేవయ్య అంటే పార్టీ ప్రెసిడెంట్ నువ్వు కాబోయే ఎమ్మెల్యేవని అంటాడు. మహదేవయ్య ఫ్యామిలీ చాలా సంతోషిస్తారు. ఇక పార్టీ ప్రెసిడెంట్ భోజనానికి కూర్చొంటాడు. వంటలు బాగున్నాయని అని అంటే తన చిన్న కోడలు చేసిందని అంటుంది. ఇక భైరవి చిన్న కోడల్ని పిలవడానికి వెళ్తుంది. కోడలు లేకపోవడంతో ముఖం మాడ్చుకొని వస్తుంది. ఇద్దరూ లేరు చెప్తే ఏమవుతుందా అని అనుకుంటుంది. 

సత్య వాళ్లు లాయర్ ధనుంజయ్ దగ్గరకు వస్తారు. హర్ష అందర్ని లాయర్‌ని పరిచయం చేస్తాడు. ఇక క్రిష్‌ని చూసి లాయర్ ధనుంజయ్ మహదేవయ్యని అవమానించి క్రిష్‌ని కూడా చులకనగా మాట్లాడుతాడు. క్రిష్‌ ఫైర్ అవ్వబోతే సత్య ఆపుతుంది. ఇక లాయర్ హర్షతో మీ కేసు టేకప్ చేయను అనేస్తాడు. బయటకు వెళ్లిపోమని అంటాడు. క్రిష్, సత్య, హర్ష బయటకు వెళ్లిపోతే సంధ్య లాయర్ ధనుంజయ్‌తో మాట్లాడుతుంది.

సంధ్య లాయర్‌తో తాను చెప్పింది వినమని మా నాన్న చేసినది తప్పు అనిపిస్తే  మెడపట్టి గెంటేయండని అంటుంది. తన తండ్రి చేయని తప్పునకు పోలీసులకు లొంగిపోయాడని ఇక మొత్తం సంధ్య లాయర్కి చెప్తుంది.  మహదేవయ్య తన అక్క మామ అని ఆయనే ఈ కేసు గెలవకుండా ఆపుతున్నారని చెప్తుంది. దీంతో లాయర్ కేసు టేకప్ చేయడానికి ఒప్పుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఇంట్లో సంయుక్త, జాను.. తల్లికి టెస్ట్ పెట్టాలనుకున్న లక్కీ, జున్నులు!  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget