అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today July 25th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కిరణ్ మీద సీరియస్ అయిన రామ్.. సుమతికి కంప్లైంట్ చేసిన సీత!

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మి చేసిన తప్పులను కిరణ్ రామ్‌కి చెప్పడం రామ్ కిరణ్ మీద సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode అచ్చం తన తల్లి వచ్చి సీత గురించి ఏం చెప్తుందో మీరు అదే ఎలా చెప్పారని రామ్ విద్యాదేవిని ప్రశ్నిస్తాడు. దాంతో విద్యాదేవి తాను కూడా అమ్మనే కదా అందుకే ఇలా చెప్పానని అంటుంది. ఒక అమ్మ ఎలా మాట్లాడుతుందో నాకు తెలీదా.. మీ అమ్మ వచ్చినా సీత గురించి ఇలాగే చెప్తుందని అంటుంది. సీతని ఏం అనొద్దని విద్యాదేవి రామ్‌ని అంటే తాను సీతని జోక్ చేశానని  అంటే సీత జోకా అని బుంగమూతి పెట్టుకుంటుంది. విద్యాదేవి నవ్వు కొని సరే అని వెళ్లిపోతుంది. సీత అలిగి రామ్‌ని కొడుతుంది. ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు.  మరోవైపు మధు సీత, రామ్‌లు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. సీత మేనకోడలు అని తెలిసి మహాలక్ష్మీ సీతని అంగీకరించిందో లేదో తెలుసుకోవాలని సీతకి కాల్ చేయాలని చేస్తుంది. సీతా రామ్‌లు ఏకాంతంలో ఉండగా ఫోన్ రావడంతో రామ్ డిస్పాయింట్ అయి నువ్వు మాట్లాడు నేను కిందకి వెళ్లి వస్తానని వెళ్లిపోతాడు.

మధు: పడుకున్నావా సీత.
సీత: ఇంకా లేదు అక్క. ఈ టైంలో కాల్ చేశావ్ ఏమైనా గొడవ అయిందా.
మధు: గొడవలు జరగని రోజు ఉండదు కదా. నువ్వు ఎలా ఉన్నావ్. నువ్వు సుమతి అత్తయ్య మేనకోడలివి అని తెలిశాక మహాలక్ష్మీ గారి రియాక్షన్ ఎలా ఉంది. నిన్ను బాగానే చూసుకుంటున్నారా.
సీత: అభిమానంతో అడుగుతున్నావా.. అనుమానంతో అడుగుతున్నావా..
మధు: మీ అక్కగా అడుగుతున్నాను చెప్పు.
సీత: నేను కోడలిని అయినా మేనకోడలిని అయినా మహాలక్ష్మి అత్తయ్యలో ఎలాంటి మార్పు ఉండదు. మా గొడవలు ఎప్పుడూ ఉంటాయిలే. మా పరిస్థతి వదిలేయ్. బావ నీతో సరిగా ఉన్నాడా.
మధు: నేను ఎంత దగ్గర అవ్వాలి అనుకున్నా సూర్య నన్ను దూరం పెడుతున్నాడు.
సీత: నువ్వు నిజంగా మారిపోయావా అక్క. ఇక్కడ ఉన్నప్పుడు ఒకలా ఉన్నావ్ కదా.
మధు: అది అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత దగ్గర అవుదాం అన్నా సూర్య మారడం లేదు.
సీత: అక్క నిన్ను బావని దూరం చేయడానికి మహాలక్ష్మి ప్రయత్నిస్తుంది. దానికి మీ అక్క జలజ సపోర్ట్ చేస్తుంది.
మధు: ఏంటి సీత నువ్వు మాట్లాడేది. జలజ అక్క చాలా మంచిది.
సీత: చూడు అక్క లేకపోతే అక్కడ జరిగేవన్నీ ఇక్కడకి ఎలా తెలుస్తాయి. నీతో మంచిగా ఉంటున్నట్లే జలజ అక్క అన్నీ చేరవేస్తుంది. గమనించు అక్క నీకే అర్థమవుతుంది. అని సీత ఫోన్ పెట్టేస్తుంది. మధు ఆలోచనలో పడుతుంది.

ఉదయం కిరణ్, రేవతి, సీత, రామ్‌లు హొటల్‌కి వస్తారు. ట్రీట్ ఇస్తానని కిరణ్ అంటే తన అత్త ఇన్నాళ్లకు సంతోషంగా ఉందని రామ్ ట్రీట్ ఇస్తానని అర్డర్ చేస్తాడు. ఇక మాటల్లో రామ్ కిరణ్‌ని తన అత్తకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని అడుగుతాడు. కిరణ్ తాను మహాలక్ష్మి దగ్గర మ్యానేజర్‌గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన చెప్తాడు. మహాలక్ష్మి మంచిది కాదు అని కిరణ్ చెప్పడంతో రామ్ సీరియస్ అవుతాడు. రేవతి కిరణ్‌తో రామ్‌కి సారీ చెప్పిస్తుంది. సీత, రేవతి ఎంత ఆపినా ఇద్దరూ మహాలక్ష్మి గురించి మాట్లాడుకుంటారు. రామ్ కోపంతో వెళ్లిపోతాడు. సీత రేవతి, కిరణ్‌లకు సర్దిచెప్పి రామ్ దగ్గరకు వెళ్తుంది. రామ్‌ని కూల్ చేయాలని ప్రయత్నిస్తుంది కానీ రామ్ కూల్ అవ్వడు. ఇక సీత సుమతి ఫొటో తీసి ఆ ఫొటోతో రామ్ మీద కంప్లైంట్ ఇస్తుంది. ఇలాగా కొడుకుని పెంచేదని అంటుంది. రామ్ కూడా తన తల్లి ఫొటోతో మాట్లాడుతాడు. సీత, రామ్‌ల మాటలు విన్ని ఓ వ్యక్తి అక్కడికి వచ్చి ఇలా కూడా మాట్లాడుకుంటారా అని కామెడీ చేస్తాడు. దాంతో సీత, రామ్‌లు నవ్వేస్తారు. సీత రామ్‌ని కిరణ్‌ వాళ్ల దగ్గరకి వెళ్దామంటే రామ్ వద్దని ఇంటికి వెళ్లిపోదామని అంటాడు. 

మహాలక్ష్మి సీత, విద్యాదేవి, కిరణ్‌లు తనకు మనస్శాంతి లేకుండా చేస్తున్నారని అనుకుంటుంది. ఇంతలో జనార్థన్ వచ్చి రామ్, సీత, రేవతిలు ఎక్కడికి వెళ్లారని అడిగితే రెస్టారెంట్‌కి వెళ్లారని కిరణ్ ట్రీట్ ఇస్తానని చెప్పాడని అంటుంది. ఇక మహాలక్ష్మి డబ్బు సంపాదించాడని కిరణ్‌ మన స్థాయికి సరిపోడని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: గంటలమ్మ గుండె ఆగినంత పని చేసిన గాయత్రీ పాప.. సుమనను శపించిన పెద్దబొట్టమ్మ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
Kothagudem News: సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
Embed widget