Seethe Ramudi Katnam Serial Today January 8th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీ దెయ్యమని పరుగులు పెట్టించిన సీత.. భార్యాభర్తలు విడిపోవడం ఖాయమా!
Seethe Ramudi Katnam Today Episode సీత రామ్లను శాశ్వతంగా విడదీయడానికి మహా ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత వెలిగించిన దీపం ఆరిపోయిందని విద్యాదేవి పంతులకు చెప్తుంది. దీపం ఆరిపోవడంతో సీత, రామ్‌ల మధ్య గొడవలు రావొచ్చు విడిపోవచ్చని అంటాడు. ఇక దీనికి పరిహారంగా శుక్రవారం వరకు సీత రోజూ దీపం పెట్టాలని శుక్రవారం ఇద్దరూ భార్యాభర్తలు రాత్రి గుడిలో నిద్ర చేయాలని ఒక్క రోజు పూజ చేయకపోయినా ఆపద ముంచుకొస్తుందని ఇలా చేయడం వల్ల కాస్త అయినా దోషం పోతుందని అంటారు.
పంతులు మాటలు సీత, రామ్, జనార్థన్ వినేస్తారు. ఇంకెందుకు పూజలు అంటారు. ఇక విద్యాదేవి మాత్రం ఆ పూజలు సీతతో రోజూ చేయిస్తాను అని అంటుంది. మనసులో సీతకి ఎవరి వల్ల కీడు వస్తుంది. సీతారాముల్ని విడదీసేది ఎవరు అని అనుకుంటుంది. ఇంట్లో మహాలక్ష్మీ సీత, రామ్‌ల పెళ్లి ఫొటో పట్టుకొని సీత మాటలు గుర్తు చేసుకొని ఆ ఫొటోని రెండు ముక్కలు చేసేస్తుంది. అది చూసి నవ్వుకుంటుంది. ఇంతలో అర్చన వచ్చి ఎందుకు ఫోటో చింపానవి అడుగుతుంది. దానికి మహాలక్ష్మీ ఫొటో చింపలేదని వాళ్లని విడదీస్తానని చెప్తుంది. ఇద్దరినీ విడదీయాలి అని లేదంటే సీత తనని ఇంట్లో లేకుండా చేస్తుందని అంటుంది. సీత కోడలిగా వచ్చినప్పుడు నుంచి మనస్శాంతి లేకుండా చేసిందని సీత, సుమతులు కలిసి తనని ఇంటి నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్తుంది. ఈ సారి తన ప్లాన్‌కి సీత కాలిపోతుందని చెప్పి సీత ఫొటోని కాల్చేస్తుంది.
ఉదయం కొంత మంది ఆఫీస్ నుంచి వచ్చి జనార్థన్, విద్యాదేవి గారు పెళ్లి చేసుకున్నారని వాళ్లకి విష్ చేస్తామని బొకేలతో వస్తారు. ఇక అర్చన పిలుస్తాను అని చెప్పి అర్చన మహాలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. అదంతా చూసిన సీత అర్చన ఏదో ప్లాన్ చేస్తుందని తన పని చెప్తా అని అనుకొని వాళ్ల దగ్గరకు వెళ్తుంది. ఇక అర్చన మహాలక్ష్మీతో విషయం చెప్తుంది. మహాలక్ష్మీ కిందకి వచ్చి తానే కంపెనీకి ఎప్పటికీ యజమాని అని చెప్తానని వాళ్లకి కనిపించి షాక్ ఇస్తానని అంటుంది. సీత వాళ్లతో మహాలక్ష్మీ ఆత్మ ఇంట్లో తిరుగుతుందని ఇంట్లో అందరికీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని బయట వాళ్లని మాత్రం గోళ్లతో రక్కి చాలా ఇబ్బంది పెడుతుందని వాళ్లతో చెప్పి బయపెడుతుంది. ఇంతలో మహాలక్ష్మీ కిందకి రావడంతో వాళ్లు చూసి దెయ్యం అని భయపడి పరుగులు తీస్తారు. బయట విద్యాదేవి, జనార్థన్‌లు వాళ్లని ఆపుతారు. వాళ్లు భయంతో అక్కడే విష్ చేస్తారు.
ఇక వాళ్లు మహాలక్ష్మీ దెయ్యం అని చెప్పబోతే సీత వచ్చి అత్తయ్యని చూశారని అంటుంది. వాళ్లు మహా దెయ్యం అని అనుకొని మాట్లాడి భయంతో వెళ్లిపోతారు. సీత మాత్రం విద్యాదేవి వాళ్లకి అనుమానం రాకుండా కవర్ చేస్తుంది. మహాలక్ష్మీ అర్చనతో వాళ్లు నన్ను చూసి పారిపోయారు అంటే అర్చన దానికి ఆఫీస్‌లో నువ్వు అంటే వాళ్లకి భయం అందుకే అలా వెళ్లిపోయారు అంటుంది. ఇంతలో సీత వచ్చి అంత సీన్ లేదని వాళ్లు పారిపోయింది మహాలక్ష్మీ అత్తయ్య చనిపోయి దెయ్యం అయి ఇంట్లో తిరుగుతుందని భయంతో పారిపోయిందని చెప్తుంది. మీరు దెయ్యం అయి తిరుగుతున్నారని నేనే చెప్పాను అని సీత అంటుంది. మహాలక్ష్మీ కోపంతో రగిలిపోతుంది. ఇక మహాలక్ష్మీ వంటలన్నీ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















