Seethe Ramudi Katnam Serial Today January 21st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతని వదిలి వెళ్లలేకపోయిన రామ్.. మహా ప్లాన్ ప్రీతి, ఉషలు అమలు చేయగలరా!
Seethe Ramudi KatnamToday Episode సీతని చంపడానికి మహాలక్ష్మీ రౌడీలతో మాట్లాడటం అందుకు ప్రీతి ఉషలతో సీతని బయటకు పంపాలని ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ బయటకు తీసుకెళ్తానని చెప్పడంతో సీత రెడీ అయి వెయిట్ చేస్తుంది. మామ ఇంకా రాలేదు ఏంటా అనుకుంటుంది. ఇంతలో రామ్ వస్తాడు. సీతని చూసి ఏంటి మా ఆవిడ ఇంత అందంగా రెడీ అయిందని అంటాడు. బయటకు తీసుకెళ్తాను అన్న మాట మర్చిపోయాడని సీత బుంగ మూతి పెట్టుకుంటుంది. రామ్‌కి విషయం గుర్తొచ్చి సీతకి సారీ చెప్తాడు. ఇప్పుడే వెళ్దామని రామ్ అంటే వద్దని సీత అంటుంది. ఆఫీస్‌లో అలసి పోయి ఉంటావు కదా తర్వాత వెళ్దాం అంటుంది. ఇక సీత రామ్‌తో విద్యాదేవి టీచర్ చాలా కంగారు పడుతుందని ఏదో దాస్తుందని అంటుంది. మన మధ్య గొడవలు రాకూడదని అంటుంది. మనం మంచి అండర్ స్టాండింగ్‌తో ఉంటే ఏం గొడవలు రావని అంటాడు. ఇక రామ్ సీతని దగ్గరకు తీసుకుంటాడు.
జనార్థన్: ఈ రోజు నీ ప్లాన్ ఏంటి మహా.
అర్చన: చాలా పెద్ద ప్లానే ఉంది బావగారు.
గిరిధర్: పెద్ద ప్లానా ఏంటి అది.
మహాలక్ష్మీ: అర్చన కాంప్లికేంట్ చేయకు మీ బావగారు నన్ను ఆఫీస్‌కి రావొద్దని ఇంట్లో ఉండమన్నారు నాకేం ప్లాన్ ఉంటాయి.
జనార్థన్: కొద్ది రోజులు ఓపిక పట్టు మహా అన్నీ సెట్ అయిన తర్వాత నిన్ను ఆఫీస్‌కి తీసుకెళ్తా.
ఇంతలో ప్రీతి, ఉషలు లగేజ్ తీసుకొని వస్తారు. మహాని చూసి ఇద్దరూ హగ్ చేసుకొని పలకరిస్తారు. దేవుడు మా కోసమే మిమల్ని వెనక్కి పంపాడని చెప్తారు. అంతా ఓకేనా అని అడుగుతుంది అంతా బాగుందని హ్యాపీగా ఉన్నాం అని చెప్తారు. సీత, రామ్‌లు కూడా వస్తారు. రామ్ ఇద్దరు చెల్లెళ్లని తమ భర్తల గురించి అడిగితే టూర్స్ వెళ్లారని చెప్తారు.
చలపతి: ఎప్పుడూ టూర్సేనా ఇలా అయితే మీతో కాపురం చేసినట్లే.
జనార్థన్: ఊరుకో చలపతి చిన్న పిల్లలతో ఏం మాట్లాడుతున్నావ్.
గిరి: ఎంత మేనమామవి అయితే మాత్రం మరీ అంత వెటకారం పనికి రాదు బావ.
అర్చన: చలపతి అన్నయ్యకి ఈ మధ్య సెటైర్లు ఎక్కువ అయ్యాయి లెండీ.
విద్యాదేవి: ప్రీతి, ఉష బాగున్నారా.
ప్రీతి: మేం ఎలా ఉంటే మీకు ఎందుకు. ఆ రోజు మా అమ్మ స్థానంలో నాన్నతో కలిసి నాకు కన్యాదానం చేసినప్పుడే మా నాన్నకి భార్యవి అవుతావని అనుమానపడ్డాను.
ఉష: ఆ రోజు ఈవిడ సుమతి పెద్దమ్మ అని తెలిసినప్పుడే ఇంటి నుంచి గెంటేయాల్సింది ఇప్పుడు మహా పెద్దమ్మకి ఈ తలనొప్పి ఉండేది కాదు.
జనార్థన్: ఉష, ప్రీతి మీరు చిన్నపిల్లలు పెద్ద మాటలు వద్దు నా అంగీకారంతోనే తను నన్ను పెళ్లి చేసుకుంది ఈ విషయంలో మీరు తనని ఏం అనొద్దు మహా అర్చన వీళ్లని పైకి తీసుకెళ్లండి.
రామ్ ఆఫీస్‌కి వెళ్తాడు. రామ్ వెంట సీత వెళ్తుంది. ఇక జనార్థన్ టీచర్‌తో ఆ మాటలు పట్టించుకోవద్దని అంటాడు. పర్లేదు అని టీచర్ వెళ్లిపోతుంది. ఇక సీతకి రామ్ వెళ్లొస్తా అని చెప్పి సాయంత్రం తప్పకుండా వేగంగా వస్తానని చెప్పి ముద్దు పెట్టి వెళ్తాడు. కొంచెం ముందుకు వెళ్లి కారు ఆపి సీత నిన్ను వదిలి వెళ్లడం బాధగా ఉందని ఏదో తెలియని ఫీలింగ్ ఉందని దిగులుగా ఉందని బాధ పడతాడు. మహాలక్ష్మీ, అర్చన కూతుర్లిద్దరికీ థ్యాంక్స్ చెప్తుంది ఇద్దరూ అదరగొట్టారని అంటుంది. ఇక అర్చన పిల్లలతో సీతని ఇబ్బంది పెట్టమని అంటారు. సీటీకి దూరంగా ఉన్న చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి వెళ్లమని తోడుగా సీతని తీసుకెళ్లి మధ్యలో వాంతి వచ్చినట్లు నటించి సీతకి నీరు తెమ్మని తాను తెచ్చేలోపు తనని వదిలేసి వెళ్లమని చెప్తుంది మహాలక్ష్మీ. ప్రీతి, ఉషలు సరే అంటారు. ఇద్దరూ రెండు పళ్లాలు పట్టుకొని గుడికి వెళ్తున్నాం రండి అని తండ్రులను పిలుస్తారు. వాళ్లు బిజీ అంటారు. మహాలక్ష్మీ, అర్చనలకు పిలవమంటే వాళ్లు తమకు వేరే పని ఉందని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మరోసారి కన్నతండ్రిని చంపడానికి ప్రయత్నించిన జ్యోత్స్న.. ఉలిక్కిపాటు.. దీపకి అనుమానం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

