Seethe Ramudi Katnam Serial Today February 8th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహా హైడ్రామా.. సీతకు ప్లంబర్ మీద అనుమానం.. పది లక్షల గొడవ!
Seethe Ramudi Katnam Today Episode సాంబ నాగుని పట్టుకొని సీతని పిలవడం మహా వాళ్లు నాగు పంపేయడంతో సీతకు అనుమానం వచ్చి విద్యాదేవికి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ నాగుకి డబ్బు ఇచ్చి ఎవరూ చూడకుండా వెళ్లమని చెప్తుంది. అర్చన ముందు హాల్‌లో చూసి ఎవరూ లేరని చెప్పడంతో నాగు బయటకు వెళ్తాడు. నాగు కిందకి వెళ్లే సరికి అక్కడ పని మనిషి ఉంటుంది. శబ్ధం చేయకుండా నాగు వెళ్తాడు. మహాలక్ష్మీ, అర్చన కూడా ఫాలో అవుతారు. బయట నాగు దగ్గర సూట్ కేస్ చూసి సాంబ ఆపుతాడు. సూట్ కేస్ తెరచి చూపించమని అంటాడు.
నాగు, సాంబ ఇద్దరూ గొడవ పడతారు. సాంబ సీతని పిలుస్తాడు. మహాలక్ష్మీ, అర్చనలు చూసి బయటకు వస్తారు. సీత కూడా సాంబ కేకలు విని బయటకు వస్తుంటుంది. మహాలక్ష్మీ వాళ్లు వచ్చి నాగుని పంపేస్తారు. ఇక సీత రావడంతో సాంబ విషయం చెప్తారు. ప్లంబర్ వచ్చాడని ఒట్టి చేతులతో వచ్చి సూట్ కేస్ తీసుకెళ్లాడని చెప్తాడు. నేను వచ్చినప్పుడు ఎవరూ కనిపించలేదని సీత ప్రశ్నిస్తుంది. ప్లంబర్ వచ్చినట్లు రామ్‌కి కూడా తెలుసు అని మహాలక్ష్మీ వాళ్లు అని వెళ్లిపోతారు. దాంతో సీత నేను చూడని మనిషి ఎవరో వచ్చారని ఆలోచిస్తుంది.
అర్చన అన్నీ ఆలోచిస్తూ ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు నేను విషం తాగి చచ్చిపోతా అని విషం తీస్తుంది. ఇంతలో మహాలక్ష్మీ వచ్చి చేతులు కట్టుకొని నిల్చొంటుంది. నువ్వు చస్తే నా ప్రాబ్లమ్స్ ఎవరి మీద నెట్టాలి అర్చన నువ్వు బతకాలి అని అంటుంది. సీత చావు చూడకుండా నువ్వు చావకూడదని అంటుంది. ఆ నాగు నా గదిలో దూరాడా నా భర్త చూసుంటే నా గతి ఏంటి అని అంటుంది అర్చన. దాంతో మహాలక్ష్మీ అర్చన చేతిలో విషం పెట్టి చచ్చిపో గిరికీ మళ్లీ పెళ్లి చేసి వచ్చిన దాన్ని నా చెప్పు చేతల్లో పెట్టుకుంటా అంటుంది. దాంతో అర్చన చచ్చిపోయే ప్రోగ్రాం మరోసారి పెట్టుకుంటా అంటుంది. మహాలక్ష్మీ అర్చనతో నాకు నువ్వు నేను నీకు తోడు అంతే అని అంటుంది.
జనార్థన్ వాళ్లు ఇంటికి వచ్చి మహాలక్ష్మీని పిలుస్తారు. పదిలక్షలు ఎందుకు తీసుకున్నావ్ అని జనార్థన్ అడుగుతాడు. ఎందుకు తీసుకున్నావ్ అని విద్యాదేవి అడుగుతుంది. దాంతో నన్ను అడగటానికి నువ్వు ఎవరు అని మహాలక్ష్మీ అంటుంది. నన్ను అడిగే రైట్ తనకు ఉందా అని అడుగుతుంది. సీత వాళ్లు అడిగే హక్కు ఉందని అంటుంది. పర్సనల్‌గా వాడుకున్నారా అని అంటుంది. దాంతో జనార్థన్ కూడా లెక్కలు అడుగుతాడు. ఇంటిళ్లపాది మహాలక్ష్మీని ప్రశ్నిస్తారు. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్లు నాకు ప్రశ్నించడం ఏంటి అని రామ్‌కి మహాలక్ష్మీ చెప్తుంది. రామ్ కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తాడు. దాంతో అర్చన అందరూ కలిసి నిన్ను దొంగని చేస్తున్నారు మహా అని అంటుంది.
మహాలక్ష్మీ: ఒక్క నాలుగు నెలలు లేకపోయే సరికి అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారన్నమాట. నేను చేసినదంతా పోయిందన్నమాట. పావలాని వేల టన్నుల చేశా. అలాంటి నేను ఆఫ్ట్రాల్ పది లక్షలు వాడుకుంటే ఇన్ని ప్రశ్నలు ఇన్ని నిందలా ఇదేనా మీరు నాకు ఇచ్చిన గౌరవం.. ఇదేనా నాకు మీరు వచ్చే విలువ ఇదా. నా కష్టానికి మీరు ఇచ్చిన కూలీ ఇదా. ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ ఇంట్లో నేను ఉండటం అనవసరం. ఇప్పుడే నేను వెళ్లిపోతాను. విలువ లేని చోట ఉండటం ఎందుకు. పిల్లలు పెద్దోళ్లు అయి పెళ్లిళ్లు చేసుకున్నారు. మీరు మరో పెళ్లి చేసుకున్నారు ఇక మీకు నేను ఎందుకు. నేను ఎవరికీ ముఖ్యం కాదు. నాకు ఏ విలువా గౌరవం లేదు. ఈ మహాలక్ష్మీ ఆకలి అయినా చంపుకుంటుంది కానీ ఆత్మాభిమానం చంపుకోదు. ఎక్కడికైనా వెళ్లి చావనైనా చస్తాను కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ ఉండను. ఈ విద్యాదేవి మీకు ఉద్దరిస్తుంది. అర్చన వెళ్లి బ్యాగ్ తీసుకురా లేదంటే కట్టు బట్టలతో ఇలాగే వెళ్లిపోవాలా.
జనార్థన్: ఆగు మహా నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు. జరిగిన దానికి సారీ మహా.
రామ్: అవును పిన్ని నేను సారీ చెప్తున్నా.
అందరూ సారీ చెప్తారు. అందరూ బతిమాలారు కాబట్టి ఉంటున్నా మరోసారి ఇది రిపీట్ అయితే చెప్పకుండా వెళ్లిపోతా. జనార్థన్ అందరితో ఆ డబ్బు గురించి ప్రశ్నించొద్దని అంటాడు. సీత సాంబ చెప్పిన విషయం విద్యాదేవితో చెప్తుంది. తనకు డౌట్ వచ్చి అర్చన అత్తయ్య బాత్ రూమ్ చెక్ చేస్తే రిపేర్ లేదని కావాలనే ప్లంబర్ అని చెప్పారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

