Seethe Ramudi Katnam Serial Today February 5th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తప్పించుకోవడానికి అర్చనని బుక్ చేసేసిన మహా.. చిన్నత్తని గజగజ వణికించిన సీత
Seethe Ramudi Katnam Today Episode సీత రౌడీ నాగుని గుర్తు పట్టకుండా ఉండాలని మహాలక్ష్మీ అర్చన చేయి కాల్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత రౌడీల ఫొటోలు చూస్తూ ఉంటుంది. రౌడీని సీత గుర్తు పట్టేస్తుందేమో అని మహాలక్ష్మీ, అర్చన చాలా టెన్షన్ పడతారు. ఈ గండం నుంచి తప్పించుకోవడానికి మహా ప్లాన్ వేస్తుంది. అర్చనను తీసుకెళ్లి కాఫీ పెడుతుంది. అర్చన చాలా టెన్షన్ పడుతుంది. మహాకి చాలా ప్రశ్నలు వేస్తుంది. మహాలక్ష్మీ అవేమీ పట్టించుకోకుండా అర్చనతో ఇలా చేస్తున్నందుకు సారీ అని చెప్పి అర్చన చేతిని వేడిగా మరుగుతున్న పాలలో పెట్టేస్తుంది. అర్చన నొప్పి తట్టుకోలేక ఇళ్లు పీకి పందిరేస్తుంది. ఏమైందా అని అందరూ పరుగులు తీస్తారు.
అర్చన కేకలకు అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. పాలలో ఏదో పడితే చేయి పెట్టేసిందని ఓదార్చుతూ ఉండండి నేను వెళ్లి ఆయింట్‌మెంట్ తీసుకొస్తానని మహాలక్ష్మీ హాల్‌లోకి వెళ్లి నాగు ఫొటో ఉన్న పేపర్ తీసేస్తుంది. తర్వాత బర్నాల్ తీసుకొచ్చి అర్చనకు రాస్తుంది. కిచెన్‌కి ఎప్పుడూ రాని వాళ్లు వస్తే ఇలాగే ఉంటుందని చలపతి సెటైర్లు వేస్తాడు. ఇక మహా అర్చనను పైకి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. మళ్లీ అందరూ హాల్‌లోకి వెళ్తారు. సీత మళ్లీ రౌడీల ఫటోలు చూస్తుంది. అందులో ఎవరూ కాదని చెప్తుంది. దాంతో ఎవరో బయటి వాళ్లే చేసుకుంటారని శివకృష్ణ చెప్తాడు. నేరస్తులు ఎప్పుడైనా దొరుకుతారని శిక్ష తప్పదు అని విద్యాదేవి అంటుంది. ఇక్కడి వాళ్లే తనని కిడ్నాప్ చేసినట్లు అనిపిస్తుందని మాటలు వింటే లోకల్ వాళ్లు అనిపిస్తున్నారని సీత చెప్తుంది.
అర్చన గదిలో బాధ పడుతూ ఉంటే మహాలక్ష్మీ వెళ్లి నొప్పిగా ఉందా అర్చన వెన్న రాస్తాను అని అంటుంది. అర్చన కోపంగా చేయి కాల్చి ఇప్పుడు ఓదార్చుతున్నావా అని అంటుంది. దాంతో మహాలక్ష్మీ సీత చూసిన ఫొటోల్లో నాగు ఫొటో చూడకుండా ఉండాలనే ఇలా చేశానని నీ అరుపులకు అందరూ రావడంతో తాను నాగు పేపర్ తీసేసినట్లు చెప్తుంది. అర్చనకు పేపర్ కూడా చూపిస్తుంది. శివకృష్ణ ఇంటి నుంచి వెళ్లే వరకు జాగ్రత్తగా ఉండాలని మహాలక్ష్మీ అనుకుంటుంది. ఇక పక్క ఊరిలో సీఎం ప్రోగ్రాం ఉందని శివకృష్ణ వెళ్లిపోతాడు. సీత, రామ్ కేసు గురించి ఎంక్వైరీ చేస్తామని అంటారు. తండ్రి వెళ్లిపోయిన తర్వాత సీత రామ్‌తో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లమని చెప్తుంది. రామ్ ఎత్తుకొని తీసుకెళ్తాడు.
మహాలక్ష్మీ అది చూసి నువ్వు రామ్‌కి దూరం అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని మహాలక్ష్మీ అనుకుంటుంది. మరోవైపు మహాలక్ష్మికి కారు యాక్సిడెంట్ అవడానికి కారణం అయిన మెకానిక్ కోసం త్రిలోక్ ఎంక్వైరీ చేశారని తెలిసి మళ్లీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతానని అంటాడు. ఇక హాల్‌లో అర్చన ఉంటే సీత విద్యాదేవికి కాల్ చేసి రేవతి అన్నట్లు మాట్లాడుతుంది. తనని కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసిందని రెండుమూడు రోజుల్లో కిడ్నాపర్లు వెనక ఉన్న వాళ్లు దొరికిపోతారని అంటుంది. అర్చన చాలా కంగారు పడుతుంది. సీత కావాలనే అర్చనను భయపెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి ప్రమాదం.. ప్రాణాలకు తెగించి కాపాడిన త్రిపుర.. గాయత్రీ మీద నింద!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

