Seethe Ramudi Katnam Serial Today February 24th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత అరెస్ట్ ఆపి మహాకి షాక్ ఇచ్చిన రామ్.. నేరుగా ఇంటికి వచ్చి ట్విస్ట్ ఇచ్చిన గౌతమ్!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీకి దగ్గర బంధువు అని గౌతమ్ ఇంట్లోకి వచ్చి అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత రామ్ దగ్గరకు వెళ్లి ఓ వైపు కన్న తల్లి మరొవైపు కట్టుకున్న భార్య ఇద్దరి మధ్య నువ్వు నలిగిపోతున్నావని నాకు తెలుసు మామ.. రేపు నన్ను అరెస్ట్ చేయకుండా చూడు అని అడగటానికి రాలేదు.. ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది. కానీ ఈ రాత్రితో నీతో ఉండాలని వచ్చాను మామ నన్ను నీ దగ్గర ఉండనిస్తావా అని సీత రామ్‌తో చెప్తుంది. సీత రామ్ పక్కన కూర్చొని రామ్ ఒడిలో పడుకుంటుంది.
సీత: ఎప్పటికీ మనం విడిపోమని అనుకున్నాను మామ కానీ విధి ఇలా మనల్ని విడదీస్తుందని అనుకోలేదు. అది కూడా మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునే అత్తమ్మ చావు కారణంగా విడిపోతామని అనుకోలేదు. నిజంగా విధి చాలా భయంకరమైంది మామ చాలా క్రూరమైంది మామ.
త్రిలోక్: ఉదయం బేడీలతో వచ్చి.. సీత సీత.. సుమతి గారు మీ ఆత్మకు శాంతి కలగాలి. జనార్థన్ గారు, మహాలక్ష్మీ గారు మీకు మా పోలీసుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఇక విషయానికి వస్తే ఈ సీతే సుమతిని చంపిన హంతకురాలు.
చలపతి: ఏ ఆధారాలతో చెప్తున్నారు.
త్రిలోక్: సీత పొడవడం మీరు అందరూ చూశారు. సాక్ష్యం నెంబరు 1 కత్తి మీద సీత వేలి ముద్రలు ఉన్నాయి. సాక్ష్యం నెంబరు 2 చనిపోయే ముందు సుమతి సీత పేరు చెప్పింది. సాక్ష్యం 3 సీత, సుమతికి గొడవలు.. ఇవి చాలా.. మిసెస్ సీత యూఆర్ అండర్ అరెస్ట్.
రామ్: ఆగండి. సీత మా అమ్మని చంపలేదు అని నేను నమ్ముతున్నాను.
మహాలక్ష్మీ: ఇప్పుడు మన నమ్మకాలతో పని లేదు రామ్. సీత నిర్దోషి అనడానికి సాక్ష్యాలు కావాలి.
రామ్: అవన్నీ ఆరోపణలు మనందరి కంటే ముందు సీతకి మా అమ్మ తెలుసు. పైగా మేనత్త. సొంత అత్తని సీత ఎందుకు చంపుతుంది.
త్రిలోక్: మేం ఇప్పుడు ఆధారాల ప్రకారం సీతని అరెస్ట్ చేయాలి కావాలి అంటే మీరు కోర్టుకి వెళ్లి బెయిల్ తీసుకురండి.
లాయర్: కోర్టుకి అవసరం లేదు సీఐ గారు. ఆల్రెడీ సీతకి ముందస్తు బెయిల్ తీసుకున్నాం.
రామ్: సీత ఏం తప్పు చేయలేదు అని నేను నమ్మాను. సీతకి మీరు విచారణ పేరుతో ఇబ్బంది పెడతారు అని నాకు తెలుసు అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. అందుకే ముందస్తు బెయిల్ తీసుకున్నా. సీత నా భార్య ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతా.
చలపతి: శభాష్ అల్లుడు నిజాయితీ ఉన్న భర్త అనిపించుకున్నావ్.
త్రిలోక్: ఈ సారి పక్కా ఆధారాలతో వస్తా నేరస్తులు నా నుంచి తప్పించుకోలేరు.
మహాలక్ష్మీ: రామ్ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. పోలీసులని ఎంక్వైరీ చేయనివ్వాల్సింది కదా.
రామ్: సీత నిజంగా ఆ హత్య చేసుంటే నేనే సీతని పోలీసులకు పట్టిస్తా.
సీత రామ్‌కి కాఫీ ఇచ్చి తల నొప్పి తగ్గుతుందని అంటే నొప్పి మనసుకి సీత.. కళ్ల ముందే తల్లి ఉన్న గుర్తించలేకపోయా.. మీరు చెప్పినా వినలేదు .. అమ్మ పోయిన తర్వాత విలువ తెలుస్తుందని అంటాడు. అమ్మని ఎందుకు ఇలా జరిగిందని రామ్ బాధపడతాడు. అమ్మని ఎందుకు అంత దారుణంగా చంపారని ఇద్దరూ అనుకుంటారు. అమ్మని చంపింది ఎవరైనా ఎంతటి వారైనా నేను వదిలిపెట్టను అని అమ్మ ఆత్మకి శాంతి కలిగించాలని అంటాడు. మరోవైపు గౌతమ్ మహాలక్ష్మీ ఇంటికి వస్తాడు. మహాలక్ష్మీ తప్ప అందరూ హాల్‌లోనే ఉంటారు. సాంబ ఆపినా ఆగకుండా గౌతమ్ ఇంటిలోపలికి వస్తాడు. అందరినీ పేరు పేరునా పలకరిస్తాడు. రామ్ బ్రో.. హాయ్ సీత అని అందరినీ తెలిసిన వాడిలా పలకరిస్తాడు. నువ్వు ఎవరు అని రామ్ గౌతమ్ అడుగుతాడు. దాంతో గౌతమ్ మీ అందరికీ నేను బంధువు అవుతానని అంటాడు. నాకు ఈ ఇంటికి చాలా పెద్ద కనెక్షన్ ఉంది.. ఈ ఇంట్లో మహాలక్ష్మీకి నాకు చాలా దగ్గర బంధం ఉందని అంటాడు. మహాలక్ష్మీని పిలిచి నేను ఎవరో అడగండి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!





















