Seethe Ramudi Katnam Serial Today February 15th - సీతే రాముడి కట్నం సీరియల్: తన ప్లాన్‌తో రామ్‌ని రూంలో లాక్ చేసేసిన మహాలక్ష్మి, పార్క్‌లో సీత పరేషాన్!
Seethe Ramudi Katnam Serial Today Episode: సీత తన భర్తలో ఐలవ్‌యూ చెప్పించుకుంటానని మహాలక్ష్మికి ఛాలెంజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode రామ్ తనతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని.. వాలంటైన్స్ డే సందర్భంగా రామ్‌తో ఐలవ్‌యూ చెప్పించుకుంటానని.. రామ్‌ని బయటకు తీసుకెళ్లి సరదాగా తిరుగుకొని వస్తామని సీత మహాలక్ష్మితో ఛాలెంజ్ చేస్తుంది. అంతే కాకుండా మహాలక్ష్మినే సీతకు ఐలవ్‌యూ చెప్పమని అంటుంది అని సీత చెప్తుంది. అది జరిగే పని కాదని మహా కూడా డబుల్ ఛాలెంజ్ చేస్తుంది.
గిరిధర్: అత్త చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన కోడలు అనే సినిమా చూడబోతున్నాం.
రేవతి: కాదు. సిక్సర్ కొట్టిన కోడలు చేతులెత్తేసిన అత్త అనే సూపర్ హిట్ మూవీ చూడబోతున్నాం.
సీత: ఆగండి ఆగండి రేపు రిలీజ్ అవ్వబోతున్న సినిమాకు ఈ రోజు టైటిల్స్ ఎందుకో రేపటి వరకు ఆగండి.. బుల్లితెరపై చూడండి.. బొమ్మ దద్దరిల్లిపోతుంది.
గిరిధర్: రేపు రామ్ సీతకి ఐలవ్‌యూ చెప్పాడంటే మనం తలెత్తుకోలేం వదినా.
ప్రీతి: సీతని ఎలా అయినా ఓడించాలి పిన్ని.
మహాలక్ష్మి: అందుకు ఒకటే దారి రేపు తెల్లారగానే రామ్‌ని రోజంతా మన కస్టడీలో ఉంచుకోవాలి. సీతని కలిసే ఛాన్సే ఇవ్వకూడదు.
రామ్: (రెడీ అవుతుంటే అందరూ రామ్ చుట్టూ చేరి చాలా ఫైల్స్ టేబుల్ మీద పెడతారు.) ఏంటి ఈ రోజు ఆఫీసే ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో అందరూ నా ముందు ఉన్నారు.
మహాలక్ష్మి: ఇవి అర్జెంటుగా క్లియర్ చేయాల్సిన ఫైల్స రామ్.
రామ్‌తండ్రి: మనం ఈ రోజు ఎంత లైట్ అయినా సరే వీటిని క్లియర్ చేయాల్సిందే రామ్.
అర్చన: ఫైల్స్ అన్నీ చూడటం అయిన వరకు ఎవరూ ఎటూ కదలకూడదు రామ్.
రామ్: పిన్నీ అది..
మహాలక్ష్మి: ఏంటి రామ్ ఈరోజు నీకు ఏదైనా పర్సనల్ పని ఉందా.. ఉన్నా సరే పక్కన పెట్టు పోస్ట్‌పోన్ చేసుకో.
రామ్: ఆఫీస్ పని కాకుండా ఇంకా ఇంపార్టెంట్ అయిన పని ఇంకేం ఉంటుంది. పిన్ని ఎంత నైట్ అయినా ఈ పని అంత క్లియర్ చేద్దాం.
మహాలక్ష్మి: థ్యాంక్యూ రామ్.. ఓసేయ్ సీత ఇప్పుడు నువ్వు రామ్ చేత ఎలా ఐలవ్‌యూ చెప్పించుకుంటావో అదీ చూస్తా రామ్‌ని రూం నుంచి బయటకు రానివ్వకుండా చేస్తా..
చలపతి: మహాలక్ష్మి తెలివిగా రామ్‌ని రూంలో లాక్ చేసేసింది. మహాలక్ష్మి చెప్తే తప్ప రామ్ రూంలో నుంచి బయటకు రాడు.
మహాలక్ష్మి: నీకు ఐలవ్‌యూ చెప్పమని రామ్‌తో నేను చెప్తానా ఎంత ఓవర్ కాన్ఫిడెన్సే నీది.
చలపతి: సీత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఛాలెంజ్ చేసింది అనిపిస్తుంది. సీత ఓడిపోతుంది ఏమో.
మహాలక్ష్మి: కచ్చితంగా ఓడిపోతుంది. నేనే గెలుస్తా..
రేవతి: అడ్డదారిలో గెలవడానికి మహాలక్ష్మి ఇలా ప్లాన్ చేసింది. ఏదో ఒకటి చేసి రామ్‌ని బయటకు తీసుకురాకపోతే సీత గెలవలేదు.
మహాలక్ష్మి: సీత ఏం చేసినా రామ్ బయటకు వెళ్లడు. వెళ్లనివ్వను. ఒకసారి నిన్ను ఈ ఇంట్లో రానిచ్చి తప్పు చేశా. ఇప్పుడు నిన్ను ఈ గదిలోకి రానిచ్చి ఇంకో తప్పు చేయను.
రేవతి: అసలు సీత ఎక్కడ. ఇంత వరకు సీన్‌లోకి ఎంటర్ అవ్వలేదు.
సీత పార్క్‌కి వచ్చి లవర్స్ సరదాగా ఉండటం. ఐలవ్‌యూ చెప్పుకోవడం చూసి బాధపడుతుంది. తాను ప్రేమించిన రామ్‌కి తన ప్రేమ చెప్పుకొనే అదృష్టం ఉందో లేదో అని బాధపడుతుంది. ఇంతలో కొందరు భజరంగ్‌దళ్ వాళ్లు వచ్చి లవర్స్‌ని పట్టుకొని తాళి కట్టమని ఫోర్స్ చేస్తారు. దీంతో వాళ్లు వేరే దారి లేక లవర్స్‌కి తాళి కడతారు. సీత అది చూస్తుంది. వాళ్లని చూసి సీత యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. చేతిలో బెలూన్ పట్టుకొని మోసపోయినట్లు బిల్డప్ ఇస్తుంది.
మహాలక్ష్మి: సీత నా ప్లాన్‌ని గెస్ చేయలేదు.
రేవతి: సీత ఇంకా ఇక్కడికి రాలేదు ఏంటి.
ప్రీతి: అసలు సీత ఇంట్లో ఉంటే కదా పిన్ని ఎక్కడికి వెళ్లిందో ఏంటో తెలీదు.
మహాలక్ష్మి: పిచ్చి పట్టి రోడ్లమీద తిరుగుతుంటుంది. దానికి రామ్ ఐలవ్‌యూ చెప్పడు అది గెలవదు. ఇది సీత పాలిట బ్రేక్‌అప్ డే. అతి తర్వలో రామ్ దానికి డివోర్స్ ఇస్తాడు.
ఇంతలో సీత భజరంగ్‌దళ్ వాళ్లని వెంట తీసుకొని ఇంటికి వస్తుంది. వాళ్లు వచ్చి రామ్ ఎక్కడ అని అడుగుతారు. ఇక చలపతి, రేవతి వచ్చి సీత ఎక్కడికి వెళ్లావు. పైన వాళ్లు రామ్‌ని లాక్ చేశారని చెప్తారు. దీంతో మరోసారి వాళ్లు రామ్‌ని పిలవగానే అందరూ బయటకు వస్తారు.
మహాలక్ష్మి: ఎవరు మీరు ఎందుకు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు.
లవర్స్‌ని కలిపేవారు: ఇందులో రామ్ ఎవరు. నువ్వేనా రామ్ అంటే నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావ్. నీకు బుద్ధి చెప్పడానికే ఇలా వచ్చాం.
సీత: ఆయన తప్పు ఏం లేదు అన్న. ఆయన గొప్పవారు. మధ్యలో కొంత మంది ఆయన్ను పాడు చేస్తున్నారు. ఏం జరిగింది అని రామ్ తండ్రి అడిగితే పార్క్‌లో ఈ చెల్లి ఏడుస్తూ కనిపించింది అని చెప్తారు. సీత తనని ప్రేమించే భర్త ఉన్నా తనని తన భర్తని విడదీస్తున్నారు అని చెప్తుంది. దీంతో వాళ్లు సీతకు ఐలవ్‌యూ చెప్పిస్తామని అంటారు. రామ్ ఐలవ్‌యూ చెప్పాలని లేదంటే ఊరుకోమని వాళ్లు మహాలక్ష్మిని బెదిరిస్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.