Seethe Ramudi Katnam Serial Today February 14th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: వాలంటైన్స్‌డే పార్టీలో సీత, గౌతమ్‌ల గొడవ.. మహాని ప్రశ్నించిన భార్యభర్తలు!
Seethe Ramudi Katnam Today Episode సీత, రామ్ ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి రావడం అక్కడికి గౌతమ్ కోసం మహా రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode ప్రేమికుల దినోత్సవం వేడుకలకు రామ్ సీతని తీసుకొస్తాడు. ఇదో స్పెషల్ ప్లేస్ అని లవ్ బర్డ్స్ ఇక్కడికి వస్తారని ఈ రోజు వాలంటైన్స్ డే కదా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామని లోపల చాలా బాగుంటుందని రామ్ సీతతో చెప్తాడు. సీతని లోపలికి తీసుకెళ్లి అందరికీ పరిచయం చేస్తాడు. అందరూ సీతని చూసి ఏ పల్లెటూరి నుంచి తీసుకొచ్చావ్ అని సెటైర్లు వేస్తారు.
రామ్ వాళ్లతో సీత మోడ్రన్ డ్రస్ వేసుకుంటే మీ అందరి కంటే బాగుంటుందని అంటాడు. అందరూ రామ్‌తో సీతకి మోడ్రన్ డ్రస్ వేయించు అంటారు. రామ్ సీతని తీసుకొని వెళ్తాడు. మరోవైపు మహాలక్ష్మీ కొడుకు గౌతమ్ తన కొత్త లవర్‌ని తీసుకొని అక్కడికి వస్తాడు. గౌతమ్‌కి తన లవర్ డైమండ్ బ్రేస్‌లెట్ ఇవ్వమని అంటాడు. దాంతో గౌతమ్ తల్లికి కాల్ చేసి 4 లక్షలు అడుగుతాడు. అంత ఎందుకు అంటే నా లవర్ గిఫ్ట్ అడిగిందని అంటాడు. రెస్టారెంట్ అడ్రస్ చెప్పి నువ్వు డబ్బు ఇస్తావా నేనే రావాలా అని అడుగుతాడు. దాంతో మహాలక్ష్మీ నేనే వస్తానని డబ్బు హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని బయల్దేరుతుంది.
రామ్ సీతకి మోడ్రన్ డ్రస్ వేసుకోమని చెప్తాడు. బలవంతం చేస్తే వెళ్లిపోతానని సీత అంటుంది. అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక రామ్ సీతతో కొద్ది సేపు ఉండి వెళ్లిపోదాం అని చెప్తాడు. సీత, రామ్‌లు గౌతమ్ వాళ్లు పక్కపక్కనే ఉంటారు. ఇక యాంకర్ అందరు లవర్స్‌ని పిలిచి విష్ చేసి ఓ లవ్ కాంటెస్ట్ పెడుతున్నామని లవర్స్ అంతా వచ్చి తమ లవ్ గురించి గొప్పగా చెప్పాలని గెలిచిన వారికి గోల్డ్ రింగ్ కానుకగా ఇస్తామని అంటారు. అందరూ ప్రేమ గురించి చెప్తారు. ఇక సీత, రామ్‌లు వెళ్తారు. రామ్ తమ జంటని సీతారాములతో పోల్చుతాడు. ఇక సీత మా ప్రేమ ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉంటుందని నేను మామ కోసం ఇక్కడికి వచ్చా మామ ఫ్రెండ్స్ కోసం వచ్చారు అందరూ మాలా ఆనందంగా ఉండాలని అంటుంది.
గౌతమ్ సిగరెట్ తాగి లైటర్ అక్కడ పెట్టేస్తాడు. ఉదయ్, లక్షిత అనే ప్రేమ జంట కాంపిటేషన్‌లో గెలుస్తారు. రింగ్ ప్రజంటేషన్ చేస్తారు. ఇక సీత వాష్ రూమ్‌కి వెళ్లాలని వెళ్తుంది. అక్కడ గౌతమ్ లైటర్ చూస్తుంది. ఇంట్లో కనిపించిన లైటరే ఇది అనుకొని దాన్ని తీసుకొని దొంగ ఇక్కడున్నాడని అనుకుంటుంది. ఆ లైటర్ తీసుకెళ్లి ఎవరిదని మైక్‌లో అడుగుతుంది. గౌతమ్ లవర్ చూసి గౌతమ్‌కి చెప్తుంది. గౌతమ్ సీతని గుర్తించి ముఖానికి మాస్క్ పెట్టుకొని సీత దగ్గరకు వెళ్తాడు. లైటర్ నాదే అంటాడు. సీత గౌతమ్‌తో నీ ముఖం చూపించు అని మాస్క్ తీసే ప్రయత్నం చేస్తుంది. వాడే మన ఇంట్లో దూరిన దొంగ పట్టుకో మామ అంటుంది. దాంతో గౌతమ్ పరుగు పెడతాడు. ఇక సీత రామ్ మళ్లీ పార్టీ దగ్గరకు వెళ్లిపోతారు.
మహాలక్ష్మీ పార్టీ దగ్గరకు చేరుకుంటుంది. రామ్ మహాలక్ష్మీని చూస్తాడు. సీత, రామ్ ఇద్దరూ మహాలక్ష్మీని పిలుస్తారు. మహా షాక్ అయిపోతుంది. మీరేంటి ఇక్కడ అని అడుగుతారు. మహా కంగారు పడుతుంది. రామ్ సర్ఫైజ్ చేస్తాననడంతో ఫాలో అయ్యానని అంటుంది. దాంతో సీత ఫాలో అయి గిఫ్ట్ తీసుకొచ్చారా అనుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని డబ్బు చూసి అడుగుతుంది. దానికి రామ్ మనకి డబ్బు ఇచ్చి సర్ఫ్రైజ్ చేయాలని అనుకునుందని అంటాడు. దీంతో ఇవాళ్టి అయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రీ, మరదలు వచ్చిన ఫంక్షన్‌లోనే పనోడిగా కార్తీక్.. పరువు పాయే!!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

