Seethe Ramudi Katnam Serial Today February 12th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఆఫీస్‌లో అందరిముందు సీతని తిట్టిన విద్యా.. మహాలక్ష్మీ ఇంట్లో గౌతమ్..!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ కొడుకు గౌతమ్ ఇంటికి రావడం మహా వెళ్లిపోమని బతిమాలడం సీత, టీచర్‌లకు అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode కంపెనీలో ఓ వ్యక్తి కొడుకు హాస్పిటల్‌లో ఉన్నాడని అంటే సీత కంపెనీ డబ్బులు రెండు లక్షలు తీసి ఇచ్చేస్తుంది. ఆ వ్యక్తి డబ్బు తీసుకెళ్లి మహాలక్ష్మీకి ఇచ్చి మీరు చెప్పినట్లే చేశానని అంటాడు. దాంతో మహాలక్ష్మీ ఆ డబ్బు అతనికే ఉంచుకోమని సీత పని అయిపోయిందని లోపలికి వెళ్తుంది.
ఆఫీస్ లోపల రామ్, జనార్థన్, విద్యాదేవిలు సెలబ్రేట్ చేసుకుంటారు. అందరికీ ఇంక్రిమెంట్స్ ఇస్తామని చెప్పడంతో సీత సూపర్ అని ఎంట్రీ ఇస్తుంది. అందరూ కలిసి కేక్ కట్ చేయాలి అనుకుంటారు. ఇంతలో మహాలక్ష్మీ వచ్చి మీరంతా ఒకటై నన్ను పరాయి దాన్ని చేశారా అంటుంది.
జనార్థన్: అదేం లేదు మహా. సడెన్‌గా రామ్ చెప్పాడు. అందుకే ఏర్పాట్లు చేశాం.
మహాలక్ష్మీ: విద్యాదేవి గారికి ముందే తెలిసినట్లుంది అందుకే సీతని పిలిచినట్లున్నారు.
విద్యాదేవి: సీత మీరు ఇద్దరు రావడం నాకు సర్‌ఫ్రైజింగ్‌గా ఉంది మహాలక్ష్మీ గారు.
మహాలక్ష్మీ: మీకు తెలీకుండా ఈ ఆఫీస్‌లో ఏం జరుగుతుంది విద్యాదేవి గారు. అన్నీ మీకు తెలిసే జరుగుతాయి కదా. నేను చెప్తుంది ఈ పార్టీ గురించి కాదు. ఒక సారి నేను ఆఫీస్ నుంచి 10 లక్షలు తీసి వాడితే విద్యాదేవి గారు నాకు వంద ప్రశ్నలు వేశారు. కానీ ఇంతకు ముందే సీత ఒకరికి ఈ ఆఫీస్ మనీ 2 లక్షలు ఇచ్చారు కానీ విద్యాదేవి గారు ఒక్క మాట అడగలేదు.
విద్యాదేవి: అవునా సీత.
సీత: అవును అత్తమ్మ ఇందాక ఏం జరిగింది అంటే ఇదే ఆఫీస్‌కి చెందిన వ్యక్తి కొడుకుకి యాక్సిడెంట్ అవ్వడంతో మీరు మీటింగ్‌లో ఉన్నారని నేను క్యాసియర్‌కి అడిగి ఇచ్చాను.
మహాలక్ష్మీ: అంటే వీళ్ల పర్మిషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఆఫీస్ డబ్బు వాడుతావా సీత. ఆ రోజు నేను ఇలాగే ముఖ్యమైన పని కోసం వాడితే అన్ని అడిగారు ఈ రోజు సీతకి ఏం అడగలేదు అంటే నాకో రూల్ సీతకి ఓ రూలా.
రామ్: ఇక్కడ గొడవలు వద్దు పిన్ని ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం.
మహాలక్ష్మీ: ఇది ఆఫీస్ విషయం రామ్. ఇక్కడే మాట్లాడాలి. నేను ఆఫీస్ కోసం ఎంతో కష్టపడ్డాను అలాంటి నేను 10 లక్షలు తీసుకుంటే అనరాని మాటలు అన్నారు. మరి సీత ఈ ఆఫీస్‌లో పని చేయదు. మరి తను తీసుకుందిగా. అయినా ఆ బాలాజీ అంత సిన్సియర్ ఏం కాదు. స్టాఫ్ కూడా బాలాజీ ఇలాగే డబ్బు కోసం చేస్తాడని అంటారు. రామ్ మహాలక్ష్మీని బతిమాలుతాడు. జనాని మాట్లాడమని మహాలక్ష్మీ అంటుంది.
జనార్థన్: విద్యా సీత నీతో కూడా చెప్పకుండా తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. మీ చనువు ఇంట్లో చూసుకోవాలి కానీ ఆఫీస్‌లో ఏంటి.
విద్యాదేవి: ఎందుకిలా చేశావ్ సీత. ఈ మధ్య నువ్వు చేసే పనులు బాలేవు. హద్దు మీరు ప్రవర్తిస్తున్నావ్. నీకు ఏం హక్కు ఉందని ఆఫీస్ విషయాల్లో తల దూర్చుతున్నావ్. ఏ అధికారంతో ఆఫీస్ డబ్బు పంచుతున్నావ్. నీ పద్ధతి ఏం బాలేదు. నీ హద్దుల్లో నువ్వు ఉండటం మంచిది. ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో కానీ ఇక్కడ నువ్వేం చేయాలి అన్నా నన్నో ఆయన్నో పర్మిషన్ అడగాలి. అర్థమైందా.
రామ్: జరిగిందేదో జరిగిపోయింది వదిలేయండి.
మహాలక్ష్మీ వెళ్లిపోతుంది. సీత ఫీలవుతుంది. రామ్, జనార్థన్‌లు కేక్ కట్ చేస్తారు. సీత హర్ట్ అయి అక్కడ ఉంటుంది. మహాలక్ష్మీ ఇంటికి వెళ్లే సరికి గౌతమ్ తన సీట్‌లో కూర్చొని దర్జాగా సిగరెట్ తాగుతాడు. మహాలక్ష్మీ అతన్ని చూసి ఎవడ్రా నువ్వు నా ఇంట్లో నా కుర్చీలో దర్జాగా కూర్చొన్నావ్ నాకు తిక్క రేగితే గన్ తీసుకొచ్చి కాల్చేస్తా అంటుంది. గౌతమ్‌ని చూసి షాక్ అయిపోతుంది. షూట్ మీ మామ్ అని గౌతమ్ అంటాడు. డాక్టర్ నిర్మల నిజం చెప్పేసిందని అంటాడు. కన్న కొడుకుని గాలికి వదిలేసి నువ్వు ఇంత ఆస్తి అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నావా అని అరుస్తాడు. నీకు నాన్నకి గొడవ అయితే నేనేం చేశానని అడుగుతాడు. నేను మిమల్ని వదిలేయలేదని నెలనెలా డబ్బు ఇస్తున్నానని అంటుంది. నాకు వేరే భర్త, పిల్లలు ఉన్నారు నాది వేరే జీవితం అని అంటుంది. దానికి గౌతమ్ ఇక నుంచి నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని అంటాడు.
అది జరగదు నువ్వు వెళ్లిపో అని అంటుంది. కానీ గౌతమ్ వినడు. నా గురించి ఈ ఇంట్లో చెప్పేయ్ అంటే నువ్వు ఒకడివి ఉన్నావనే ఈ ఇంట్లో తెలీదు నేను ఇప్పుడు చెప్పలేను అంటుంది. ఇంతలో విద్యాదేవి, జనార్థన్, సీత వాళ్లు వస్తారు. మహాలక్ష్మీ చాలా కంగారు పడతుంది. నిన్ను చూస్తే ప్రమాదం అని త్వరగా పైకి వెళ్లి దాక్కోమని బతిమాలుతుంది. దాంతో గౌతమ్ మీదకు వెళ్తాడు. మహాలక్ష్మీ పేపర్ చదువుతున్నట్లు నటిస్తే సీత వచ్చి ఏంటి అత్తయ్య ఏందో కంగారులో ఉన్నారు పేపర్ తిరగేసి మరీ చదివేస్తున్నావ్ అని అంటుంది. విద్యాదేవి సిగరెట్ వాసన వస్తుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: కోడలికి విషం ఇస్తే కొడుకు నొప్పులు పడుతున్నాడేంటి? విజయాంబికకు ఇది షాకే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

