Ammayi garu Serial Today February 11th: అమ్మాయి గారు సీరియల్: కోడలికి విషం ఇస్తే కొడుకు నొప్పులు పడుతున్నాడేంటి? విజయాంబికకు ఇది షాకే!
Ammayi garu Today Episode మందారానికి తీర్థం ఇచ్చిన విజయాంబిక అందులో విషం కలపడం రూపకి అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజుని రూప గెటప్ మార్చేయమని చెప్తుంది. బంటీతో మీ నాన్న గొప్ప బిజినెస్ మెన్ సూటూ బూటూ ఆ కథే వేరు అని చెప్తుంది. మళ్లీ రాజుకి బిజినెస్ చేయమని చెప్తుంది. కనీసం ఓ మంచి జాబ్ అయినా చేయమని నేను అండగా ఉంటానని చెప్తుంది.
బంటీ: అమ్మ నాన్నకి మీరు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కథ చెప్పమన్నా రాజు రాణి కథ చెప్పేవారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది రాణి అంటే మీరే అని.
రాజు: సారీ అమ్మాయిగారి చిన్న మిస్ అండర్ స్టాండ్ వల్ల బంటీని నిన్ను 5 ఏళ్లు దూరం పెట్టాను.
బంటీ: ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా అది చాలు నాన్న. ఇద్దరూ బంటీకి కిస్ చేస్తే బంటీ వెనక్కి జరగడంతో రాజు రూప బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు. ఇక ఇద్దరూ బంటీకి ముద్దు పెడతారు. అమ్మానాన్న రోజూ ఉదయం, సాయంత్రం ఇలాగే ఇద్దరూ ముద్దు పెట్టాలి.
రాజు: సరే బంటి టైం అయింది అమ్మని వెళ్లనివ్వు.
సూర్యప్రతాప్: ఉదయం.. సుమ కాఫీ తీసుకురావా.
మౌనిక: పెళ్లి అనగానే ఎన్నో ఊహించుకున్నా కానీ ఈ ఇంట్లో ఎవరో చచ్చినట్లు తలా ఓ మూల కూర్చొన్నారు. పెళ్లి తర్వాత ఎవరైనా ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేస్తారు కానీ ఇక్కడ నన్ను ఓ గదిలో మిమల్ని ఓ గదిలో ఉంచడానికి పెళ్లి చేయడం ఎందుకు అండీ.
దీపక్: మౌనిక మందారం రాకపోయి ఉంటే నువ్వు అనుకున్నట్లు అన్నీ జరిగేవి. ఎలాగూ మందారాన్ని చంపేయాలి అనుకున్నాం కదా అప్పటి వరకు అన్నీ తప్పదు.
రూప: పిన్ని నాన్నకి నేను కాఫీ ఇస్తా.
సుమ: వద్దురూప నీ మీద కోపంగా ఉన్నారు కదా.
రూప: కోసం ఉంటే దూరమే అవుతాం పిన్ని ప్రయత్నస్తే కదా దగ్గర అయ్యేది.
సూర్యప్రతాప్: సుమ.. సుమ.. నా గౌరవాన్ని కాలితో తన్ని కాఫీ కప్పుతో దగ్గర అవ్వాలని చూస్తే దగ్గర అయిపోవడానికి నేను రాజుని కాదు సూర్యప్రతాప్‌ని.
రూప: నాన్న సారీ నాన్న.
సూర్యప్రతాప్: వద్దు నువ్వు సారీ చెప్పకు నన్ను నాన్న అని పిలవకు.
రూప: పింకీ విషయంలో నేను ఎందుకు అలా చేశానో అర్థం చేసుకోండి నాన్న.
సూర్యప్రతాప్: వద్దు నాకేం చెప్పొద్దు. ఆ రోజు జరిగింది మర్చిపోలేదు.
విజయాంబిక: తమ్ముడు మందారం తిరిగి బతకడం వల్ల గుడికి వెళ్లి పూజ చేశాను. తీర్థం కొంచెం కొంచెం రోజూ తాగిస్తే త్వరగా కోలుకుంటుందని పంతులు చెప్పారు. అయినా నువ్వేంటి తమ్ముడు అంత డల్‌గా ఉన్నావ్.
దీపక్: మామయ్య కాఫీ అడిగితే రూప తీసుకొచ్చింది.
విజయాంబిక: ఏంటి రూప మీ నాన్న పౌరుషం గురించి నీకు తెలీదా. మందారం వచ్చింది కదా అని నీ చేతి కాఫీ తీసుకుంటారని అనుకున్నావా.
మౌనిక ఏడుస్తూ గదికి వెళ్తుంది. దీపక్ వెనక వెళ్తాడు. అత్తయ్యకు మందారం అంటే ఇష్టం అని నన్ను పట్టించుకోవడం లేదని అంటుంది. దాంతో విజయాంబిక వచ్చి ప్రేమ లేదు ఇష్టం లేదు అది తీర్థం కాదు విషం మందారం ప్రాణాలు తీయడానికి అని చెప్తుంది. రూప దీపులు మందారం దగ్గర ఉంటారు. విజయాంబిక, దీపక్, మౌనికలు అక్కడికి వెళ్తారు. మందారానికి దీపుతో ఆ తీర్థం తాగిస్తుంది విజయాంబిక. మనసులో ఈ తీర్థమే నీకు తులసి నీరు అని అనుకుంటుంది. మందారం చనిపోవాలి రూప, రాజులు ఏం చేయలేకపోతారని అనుకుంటారు. మౌనిక కాఫీ తీసుకొస్తుంది. ఇక మీకు కావాలా అత్తయ్య అంటే దానికి విజయాంబిక మీ అమ్మానాన్నలు ఇస్తామన్న డబ్బు తీసుకురమ్మని చెప్తుంది. మీ దగ్గర లేని డబ్బా అని మౌనిక అంటుంది. దాంతో విజయాంబిక మనం విదేశాలకు తిరగడానికి అని అంటుంది.
ఇక ఇప్పటికే నగలు కోసం చాలా అప్పు చేశాం ఇప్పుడు డబ్బు కోసం ఏం చేయాలి అని అనుకుంటుంది. ఇంతలో కాఫీ తాగిన దీపక్ కడుపు నొప్పి అని కుప్పకూలిపోతాడు. కడుపు మంట పేగులు మెలిపెతున్నాయని అంటుంది. ఇంతలో రూప వచ్చి అంత నొప్పిగా ఉందా దీపక్ అంటుంది. సాయం చేయకుండా వెటకారం ఎందుకు అని విజయాంబిక అడిగితే మరి మందారానికి తీర్థం పేరుతో విషం తాగించారు కదా అంటుంది. ముగ్గురు షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

