Seethe Ramudi Katnam Serial Today December 4th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అర్చన, గిరిలకు షాక్ ఇచ్చిన మహా.. రాకేశ్, ఉషల సీక్రెట్ పెళ్లి!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ ఉష, రాకేశ్‌లకు పెళ్లి చేసి ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, అర్చనలు ఇంటికి వచ్చి చాలా చీరలు అమ్మేశాం లక్ష రూపాయలు వచ్చాయని చెప్తారు. అందరూ తెగ సంతోష పడిపోతారు. ఇక సీత కారులో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది. సీత లోపలికి రావడంతో చలపతి సీతతో సీత అదరగొట్టేశావంట అని అంటాడు. అవును అని సీత అంటుంది. ఇక జనార్థన్, రామ్‌లు సీతతో మహాలక్ష్మీ మొదటి రోజే లక్ష రూపాయల చీరలు అమ్మిందని చెప్తారు.
సీత: అవునా లక్ష రూపాయలే అంత మొత్తంలో నేను ఎప్పుడూ చీరలు అమ్మలేదు.
అర్చన: నీకు మహాకు తేడా లేదా సీత మహా ఏమైనా చేస్తుంది.
జనార్థన్: ఒక్క రోజులోనే లక్ష అమ్మింది అంటే వారంతో మొత్తం అమ్మేస్తుంది.
రామ్: మా పిన్ని పని చేతల్లో చూపిస్తే నువ్వు ఇంకా మాటల్లోనే ఉండిపోయావు సీత.
మహాలక్ష్మీ: ఏంటి సీత అందరూ నన్ను పొగుడుతుంటే అసూయగా ఉందా.
సీత: అసూయగా కాదు అసహ్యంగా ఉంది మీరు చేసిన పనికి. మీరిద్దరూ చేసిన పనికి సిగ్గేస్తుంది.
అర్చన: ఏం మాట్లాడుతున్నావ్ సీత మేమేం చేశాం.
సీత: చెప్తాను ఆగండి.
డ్రైవర్‌ని పిలిచి ఓ మూట తెప్పిస్తుంది. అందులో అన్నీ కొత్త చీరలు ఉంటాయి. ఉదయం నుంచి ఇద్దరూ అమ్మలేదని ఇంటికి వస్తే పరువు పోతుందని కొన్ని చీరలు దారిలో పడేసి ఏటీఎంలో డబ్బులు తీసి మీకు ఇలా చెప్పారని అంటుంది. ఇలా చేస్తారా అని అందరూ మహాలక్ష్మీ, అర్చనల్ని ఛీ కొడతారు. మీ పరువు మీరే తీసుకున్నారని తిడతారు. ఇక సీత మహాలక్ష్మీతో అత్తా మీ ముఖాల మీద మీరే ఉమ్మేసుకున్నారు చాలా దరిద్రంగా లేదూ అని అంటుంది. ఓడిపోవడానికి రెడీగా ఉండండి అని చెప్పి వెళ్లిపోతుంది.
మహాలక్ష్మీకి త్రిలోక్ సీఐ కాల్ చేస్తాడు. రాకేశ్ తండ్రి మోహన్ రావు ఫోన్ చేశాడని ఉష, రాకేశ్‌ల పెళ్లి జరగకపోతే మిమల్ని అరెస్ట్ చేయమని చెప్పారని అంటాడు. మీరు నా మనిషా ఆయన మనిషా అని మహాలక్ష్మీ అడిగితే డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే అటే ఉంటాను అంటాడు. తొందరగా ఆ పెళ్లి చేయమని లేదంటే మిమల్ని అరెస్ట్ చేయడానికి నేనే మీ ఇంటికి రావాల్సి ఉంటుందని అంటాడు. ఇక మహాలక్ష్మీ సీక్రెట్‌గా ఈ పెళ్లి చేయాలని అనుకుంటుంది.
ఇక రామ్ సీత మాటలు తలచుకొని ఆఫీస్‌ని అల్లాడించేసిందని సీత మామూలుది కాదని అనుకుంటాడు. ఇంతలో సీత రావడంతో నమస్తే మేడం అని మాట్లాడుతాడు. మేడం మేడం అని మాట్లాడుతాడు. ఇదేంటి అని సీత అంటే నేను ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నానని అంటాడు. దానికి సీత ఇంట్లో నువ్వు నా మామ నేను నీ ముద్దుల భార్యని అని అంటుంది. ఇక రామ్ పాలు తాగుతూ స్వీట్ లేవు అని సీతతో తాగించి తాను తాగుతాడు. స్వీట్ సరిపోలేదు అని రామ్ అంతే సీత రామ్‌కి ముద్దు పెట్టుకుంటుంది. దాంతో రామ్ బెడ్ మీదపడిపోయి స్వీట్ ఎక్కువ అయిపోయింది అంటే సీత వెనక్కి తీసుకుంటా అని ముద్దు పెట్టుకుంటుంది.
ఉదయం అర్చన, గిరిధర్‌లు ఉష్ కనిపించడం లేదని అందరినీ అడుగుతారు. ఇక సీత వచ్చి మహాలక్ష్మీ అత్తయ్య కూడా కనిపించడం లేదని అంటుంది. ఇంతలో మహాలక్ష్మీ రాకేశ్, ఉషలకు పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తుంది. అందరూ రాకేశ్ ఉషల్ని పెళ్లి బట్టల్లో చూసి షాక్ అయిపోతారు.
అర్చన: ఏం చేశావు మహా నువ్వు ఈ దుర్మార్గుడితో పెళ్లి చేసి నా కూతురి గొంతు కోశావా.
గిరిధర్: ఎంత పని చేశారు వదినా మాతో ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేస్తారా. ఉష జీవితం నాశనం చేశావు.
జనార్థన్: ఎందుకిలా చేశావు మహా,
మహాలక్ష్మీ: నేనేం చేయలేదు జనా పొద్దున్న గుడికి వెళ్లా అక్కడ వీళ్లిద్దరూ పెళ్లి చేసుకొని ఇలా కనిపించారు. రాకేశ్ వాళ్ల ఇంటికి వెళ్లిపోతుంటే నేను మన ఇంటికి తీసుకొచ్చా. వాళ్లిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారంట మనం అడ్డుపడతాం అని చెప్పలేదు.
రామ్: ఎంత ఇష్టం అయినా అలా ఎలా చేసుకుంటారు పిన్నీ కనీసం మీకు అయినా చెప్పాల్సిందిగా.
మహాలక్ష్మీ: ఈ ఇంట్లో ఎవరి పెళ్లి నా ఇష్టంతో జరిగింది రామ్. నీ పెళ్లి నా ఇష్టంతో జరగలేదు. రేవతి పెళ్లి మాకు ఎవరికీ నచ్చలేదు. ప్రీతి పెళ్లి ఎలా జరిగిందో మనందరికీ తెలుసు.
అర్చన: కానీ ఈ పెళ్లి నీకు ఇష్టం లేకుండా జరిగుండదు మహా. నీకు ముందే వీళ్లకి పెళ్లి చేయాలని ఉంది మాతో చెప్తే మేం వద్దన్నాం అని చెప్పకుండా పెళ్లి చేసి తీసుకొచ్చావ్. నా కూతురి పెళ్లి దుర్మార్గుడైన ఈ రాకేశ్‌తో చేయడం ఇష్టం లేదు.
సీత: అది మీకు ఇప్పుడు తెలిసిందా చిన్నత్తయ్యా. అప్పుడు ప్రీతికి ఇతనితో పెళ్లి చేయాలని తెగ ఆరాట పడ్డారు ఇప్పుడు మీ కూతురితో పెళ్లి అవ్వగానే నేరం అనేస్తున్నారు.
మహాలక్ష్మీ వల్లే ఇదంతా అని సీత అంటుంది. రాకేశ్ మాట్లాడుతూ నాకు కోట్ల ఆస్తి ఉంది నన్ను వెధవ అన్నట్లు మాట్లాడుతారు ఏంటి అంటాడు. నీకు బుద్ధి లేదని అర్చన అంటే దానికి ఉష నా భర్తని ఏం అనొద్దు మా అత్తారింటికి వెళ్లుంటే హారతి ఇచ్చి చక్కగా ఆహ్వానించేవాళ్లు అని అంటుంది. అయితే పోవే అని అర్చన వెళ్లిపోతుంది. ఇక సీత జరిగింది జరిగిపోయిందని జంటని ఆశీర్వదించమని అంటే గిరి కూడా వెళ్లిపోతాడు. ఇక సీత రాకేశ్‌తో నా ఆడపడుచు ఉషని ఇబ్బంది పెడితే నీ పని అయిపోతుందని రామ్, సీతలు వార్నింగ్ ఇస్తారు. దానికి రాకేశ్ నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు మీరేం చెప్పొద్దని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.