Seethe Ramudi Katnam Serial Today December 21st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: దంచు.. దంచు.. బాగా దంచు.. అర్చనను చీపురుతో చితక్కొట్టిన మహా.. సీతకు ప్రమిదల పరీక్ష!
Seethe Ramudi Katnam Today Episode సీత చీర కాలిపోవడంతో అపశకునంగా భావించి పరిహారం కోసం గుడికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode జనార్థన్ పక్కన విద్యాదేవి కూర్చొని వ్రతం చేయడం గుర్తు చేసుకొని మహాలక్ష్మీ కోపంతో ఉంటుంది. జనా తాను ఎప్పటికీ విడిపోకూడదని వ్రతం చేయాలనుకుంటే సీత మొత్తం నాశనం చేసిందని అనుకుంటుంది. నేనే దగ్గరుండి సుమతి, జనార్థన్ని ఒక్కటి చేసినట్లుందని అనుకుంటుంది. ఇంతలో అర్చన వచ్చి ఫీలవకు మహా మరో ఐడియా ఇస్తాను అంటే ఏంటే నువ్వు నాకు ఐడియా ఇచ్చేదని మహాలక్ష్మీ అర్చనను చీపురుతో చితక్కొడుతుంది.
అర్చన: అయినా వ్రతంలో నీకే కాదు ఆ సీతకి కూడా చెడు జరిగింది కదా రామ్ ఇచ్చిన చీర కాలిపోయింది కదా.
మహాలక్ష్మీ: గుడ్డిలో మెల్లలా అదొకటి జరిగిందిలే. అయినా ఆ చీర కాకపోతే రామ్ మరో చీర కొనిపెడతాడు. అది అసలే చీరల వ్యాపారం చేస్తుంది దానికి చీరలు కొదవా.
అర్చన: అలా తీసి పారేయకు మహా. సీత తను అమ్మే చీరలు కట్టుకోవడం కూడా కాదు. వ్రతం రోజు చీర కాలిపోవడం అపశకునం. అంటే త్వరలో సీతకి ఏదో నష్టం జరగబోతుందని అర్థం. వ్రతంలో అది నిన్ను ఏడిపించినా చివరకు తనే ఏడ్చింది కదా.
మహాలక్ష్మీ: నాలుగు దెబ్బలు పడిన తర్వాత నీ బ్రెయిన్ బాగానే పని చేస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు సీతకి ఏ కీడు జరగబోతుంది. దాని జీవితంలో ఏ చీకటులు కమ్ముకోబోతున్నాయ్.
సీత రామ్ గిఫ్ట్‌గా ఇచ్చిన చీర కాలిపోవడం గుర్తు చేసుకొని బాధ పడుతుంది. విద్యాదేవి అలియాస్ సుమతి సీత దగ్గరకు వస్తుంది. నన్ను మీ మామయ్య పక్కన కూర్చొపెట్టి వ్రతం చేయించినందుకు సంతోషపడాలా లేక అలా జరిగినందుకు బాధ పడాలో అర్థం కావడం లేదని అంటుంది. సీత అలా జరగడం అపశకునం కదా ఏమవుతుందా అని భయంగా ఉందని అంటుంది. దాంతో విద్యాదేవి నువ్వు మంచి దానివి కదా నీకు ఏం కాదు అని అంటుంది. ఇక సీత చీర కాలిపోవడం వెనక ఎవరూ లేరని దేవుడు నాకు ఇచ్చిన సంకేతం అని అంటుంది. దాంతో విద్యాదేవి ఇద్దరినీ గుడికి వెళ్లి పరిహారం చేయమని అంటుంది. సీత సరే అని రామ్ దగ్గరకు వెళ్తుంది. రేపు ఉదయం గుడికి వెళ్దామని చెప్తుంది. రామ్ సరే అంటాడు. దాని గురించి ఎక్కువ బాధ పడొద్దని అంటాడు. ఉదయం సీత రామ్‌లు గుడికి వెళ్తారు. పంతులన్ని కలుస్తారు.
సీత పంతులుకి విషయం చెప్తుంది. సుమంగళి వ్రతంలో చీర కాలిపోయిందని చెప్పడంతో పెద్ద అపచారమే జరిగిందని పంతులు అంటారు. ఇక పరిష్కారం చెప్పమని రామ్ అడుగుతాడు. పంతులు ఇద్దరి పేర్ల మీద అర్చన చేసి తర్వాత పరిహారంగా సీతకి రెండు పెద్ద ప్రమిదలు ఇచ్చి వాటిలో సాయంత్రం తులసి కోట దగ్గర ఇద్దరూ అఖండ దీపం పెట్టమని చెప్తారు. ఆ దీపాలు రాత్రి వెలిగిస్తే ఉదయం వరకూ వెలుగుతూ ఉండాలని దీపాలు ఆరిపోతే విడిపోయే ప్రమాదం ఉందని అంటారు. రెండింటిలో ఒక దీపం ఆరిపోయినా వాళ్ల వల్ల గొడవలు వస్తాయని చెప్తాడు. ప్రమిదలను తీసుకొని సీత వాళ్లు ఇంటికి వెళ్తారు. సీత విద్యాదేవికి పరిష్కారం గురించి చెప్తుంది. సీత విద్యాదేవికి విషయం చెప్పడం మహాలక్ష్మీ, అర్చనలు వింటారు. సీతని ఇంకా బయటపెట్టడానికి ఈ అవకాశం వాడుకోవాలని మహాలక్ష్మీ అర్చనతో చెప్తుంది. సీత పెట్టిన దీపం ఆర్పేయాలని అనుకుంటారు. మహాలక్ష్మీ, అర్చనల మాటలు విద్యాదేవి వినేస్తుంది. ఇక సాయంత్రం సీత రామ్ ఇద్దరూ తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: భార్య, మామల్ని దారుణంగా అపార్థం చేసుకున్న రాజు.. తండ్రిని చేరిన పసికందు!