అన్వేషించండి

Seethe Ramudi Katnam Today August 21st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తానే సుమతి అని అన్నావదినలతో చెప్పేసిన విద్యాదేవి.. పూర్తిగా కోలుకున్న శివకృష్ణ!

Seethe Ramudi Katnam Today Episode హార్ట్‌ ఎటాక్ వచ్చిన శివకృష్ణకు తానే సుమతి అని విద్యాదేవి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode శివకృష్ణ బతకాలి అంటే సుమతి రావాలని రామ్, సీతలు చెప్తారు. అందుకు సుమతికి విషయం తెలిసేలా పేపర్లలోనూ, టీవీలోనూ న్యూస్ వచ్చేలా చేస్తానని రామ్ అంటాడు. మహాలక్ష్మీ అర్చనతో ఒంటరిగా మాట్లాడుతుంది. రామ్ అలా చేయడం వల్ల సుమతి ఆచూకి ఈజీగా తెలిసిపోతుందని అన్న కోసం ఎక్కడున్నా సుమతి వస్తుందని మహాలక్ష్మీ అంటుంది. 

మహాలక్ష్మీ: అన్నని కాపాడబోయి అది చస్తుంది.
అర్చన: అంటే ఆల్రెడీ సుమతి అక్క కోసం స్కెచ్ వేసేశావా. 
మహాలక్ష్మీ: ఇప్పుడు వేయబోతున్నాను. మహాలక్ష్మీ రౌడీలకు కాల్ చేసి సుమతి ఫొటో పంపిస్తానని హాస్పిటల్‌కి ఆమె వస్తే చంపేయ్‌మని చెప్తుంది. ఫొటో, హాస్పిటల్ వివరాలు పంపిస్తుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలని ఒకే రోజు సీత తండ్రిని మేనత్తని పోగొట్టుకుంటుందని అనుకుంటారు.

సీత తండ్రి గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంది. మధుకి కాల్ చేసి తండ్రి గురించి చెప్తుంది. మధు షాక్ అయిపోతుంది. ఏడుస్తుంది. ఇద్దరూ ఫోన్‌లో ఏడుస్తారు. ఇక సీత మధుని రావొద్దని తానే మొత్తం సెట్  అయితే ఫోన్ చేస్తానని సీత ఇంట్లో మహాలక్ష్మీ మాట్లాడిన మాటలు చెప్తుంది. 

మధు: మన అత్తయ్య స్థానంలో ఉంటూ ఆవిడనే అవమానించిందంటే ఆవిడ మనిషి కాదు. ఆవిడని ఏం చేసినా పాపం లేదు.
సీత: ఆవిడ పాపం పండే రోజు దగ్గర్లోనే ఉంది అత్తయ్య వస్తే మహాలక్ష్మీ పని అయిపోతుంది.
మధు: నాన్న కోసమైనా అత్తయ్య వస్తుంది.
సీత: సుమతి ఫొటో దగ్గరకు వెళ్లి.  నాన్న చావు బతుకుల మధ్య ఉన్నారు. నిన్నే కలవరిస్తున్నారు. నువ్వు రాకపోతే నాన్న బతికేలా లేరు అత్తమ్మ. ఇప్పుడు నాన్నని కాపాడేది దేవుడో డాక్టర్లో కాదు నువ్వు మాత్రమే. నీకు నాన్న అంటే ఇష్టం కదా అత్తమ్మ నాన్నకి నువ్వంటే ప్రాణం అని అర్థమవుతుంది. ఆ ప్రాణం కోసం నువ్వు రావాలి. నిన్ను ఎంతగానో ప్రేమించే ఆ ప్రాణం కోసం నువ్వు రావాలి. దయచేసి రా అత్తమ్మ. సీత మాటలు వింటున్న విద్యాదేవి ఫీలవుతుంది.

రామ్ సీత దగ్గరకు వచ్చి ఓదార్చుతాడు. ఇంతలో విద్యాదేవి మీ అత్తమ్మ వస్తుంది సీత మీ నాన్నకి ఏం కాదు ధైర్యంగా ఉండని రేపటికి మీ నాన్న కోలుకుంటారని అంటుంది. ఆయన క్షేమంగా బయట పడతారని చెప్తుంది. విద్యాదేవి తనలో తాను తన అన్నయ్య కోసం తానే సుమతి అని చెప్తానని అనుకుంటుంది. ఇక రౌడీలు హాస్పిటల్‌ దగ్గరకు వెళ్తారు.  సుమతి ఫొటో పట్టుకొని వెయిట్ చేస్తుంటారు. ఇక విద్యాదేవి హాస్పిటల్‌కి వెళ్తుంది. లలితని వదినా అని పిలుస్తుంది. సుమతి అని లలిత అనుకుంటుంది. అన్నయ్యని చూస్తా అని విద్యాదేవి అంటే లలిత తీసుకెళ్తుంది. విద్యాదేవి అన్నయ్య అని పిలవగానే శివకృష్ణ లేస్తాడు. విద్యాదేవిని సుమతి అని పిలుస్తాడు. 

లలిత: మెలకువలో ఉంటే ఈయన సుమతి సుమతి అని కలవరిస్తారు. నేను వెళ్లి డాక్టర్‌ని పిలుస్తాను.
విద్యాదేవి: ఆగు వదిన ఎవర్నీ పిలవాల్సిన పని లేదు.
శివకృష్ణ: సుమతి
విద్యాదేవి: సుమతినే వచ్చాను అన్నయ్య. నీ చెల్లెలు సుమతిని నేనే అన్నయ్య. 
శివకృష్ణ: నువ్వు నువ్వు నా చెల్లెలు సుమతివా
విద్యాదేవి: అవును అన్నయ్య నేను నీ సొంత చెల్లి సుమతినే. పండక్కి నీకు షర్ట్ కుట్టిన సుమతినే. నిన్ను కాదని ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన సుమతినే.
లలిత: ఏమంటున్నావ్ అమ్మా మరి నీ రూపం.
విద్యాదేవి: అదృష్టమో దురదృష్టమో తెలీదు నా రూపం మారిపోయింది వదిన. నా కొడుకుని కాపాడుకొనే క్రమంలో నా రూపం మారిపోయింది. అని జరిగింది అంతా చెప్తుంది.  నా ఆస్తి మీద కన్నేసిన మహాలక్ష్మీ నా భర్తని, పిల్లల్ని సొంతం చేసుకుందని తెలిసిపోయింది. నేను ఎవర్నో చెప్తే ప్రమాదం అని తెలిసి చెప్పలేదు. 
శివకృష్ణ: నీ సొంత ఇంట్లోనే పరాయిదానిలా ఉన్నావ్ కదమ్మా. ఇక నువ్వు ఎవరికీ భయపడాల్సిన పని లేదమ్మా నీ గురించి అందరికీ చెప్పేస్తాను. ఆ మహాలక్ష్మీ అంతు చూస్తాను. నిన్ను ఇన్ని కష్టాలు పెట్టిన దాన్ని వదలను. పదమ్మా
విద్యాదేవి: వద్దన్నయ్యా ఆవేశపడొద్దు ఏం చేయొద్దు
లలిత: ఇప్పటికే చాలా నష్టపోయావు నీ గురించి నీచంగా మాట్లాడి ఈయనకు గుండెపోటు తెచ్చింది అలాంటి దాన్ని వదిలేస్తే ఇంకెన్ని చేస్తుందో.
విద్యాదేవి: మహాలక్ష్మీ పాపం పండింది వదిన సీత రూపంలో తనకి ప్రత్యర్థి వచ్చింది. నేను సీత మహాలక్ష్మీ ఆట కట్టిస్తాను అప్పటి వరకు మీరు నా గురించి ఎవరికీ చెప్పొద్దు రామ్ సీతలకు కూడా చెప్పొద్దు. మహాలక్ష్మీకి పెద్ద శిక్షే వేయాలి. అందుకే ఈ రహస్యం మన ముగ్గురి మధ్యే ఉండాలి. 

రౌడీల ఎదురుగానే విద్యాదేవి వెళ్తుంది. సుమతి ఇంకా రాలేదని వాళ్లు అనుకుంటారు. ఉదయం సీత, రామ్‌లు హాస్పిటల్‌కి వస్తారు. శివకృష్ణ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని లలిత చెప్తుంది. సీత, రామ్‌లు శివకృష్ణతో మాట్లాడుతారు. అమ్మ ఆచూకి తెలీలేదు అని రామ్ అంటే లలిత మీ అమ్మ వచ్చిందని అంటుంది. ఎవరు అని సీత, రామ్‌లు అంటే అమ్మవారు అని కవర్ చేస్తారు. ఇక శివకృష్ణ వాళ్లు వాళ్ల ఇంటికి బయల్దేరుతారు. సీత రామ్‌లు తమ ఇంటికి వెళ్తారు.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: వాంతులు చేసుకున్న సత్య ఇది అదేనా.. మైత్రితో క్లోజ్‌గా హర్ష, ఫీలవుతున్న నందిని!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget