అన్వేషించండి

Seethe Ramudi Katnam August 15th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఇంట్లో అందరితో సెల్యూట్ కొట్టించుకుంటానని ఛాలెంజ్ చేసిన సీత.. అదిరిపోయిన భరతమాత!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీతో పాటు ఇంట్లో అందరితో సెల్యూట్ కొట్టించుకుంటానని సీత భరతమాత వేషం వేసుకొని రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారంది.

Seethe Ramudi Katnam Serial Today Episode సూర్యకి ఆపరేషన్ చేస్తే కాలు వస్తుందని సూర్య అన్న చెప్తాడు. మధు సూర్య చాలా సంతోషిస్తారు. తొందర్లోనే ఆపరేషన్ చేయిద్దామని మధు అంటుంది. జలజ వచ్చి ఆపరేషన్కి చాలా ఖర్చు అవుతుందని అంటే జలజ భర్త ఆపరేషన్‌కి పది లక్షలు అవుతుందని అంటాడు. జలజ ఇక ఆపరేషన్ అవ్వదని అంటుంది. అంత డబ్బు ఎలా తీసుకొస్తావ్ మీ అమ్మనాన్నలని అడుగుతావా మహాలక్ష్మీని అడుగుతావా అని అంటుంది.

మధు: వాళ్లని ఎందుకు అడుగుతాను మా నాన్నతో సీతనో అడుగుతాను. వాళ్లు పరాయి వాళ్లు కాదు మన మీద ప్రేమ ఉన్నవాళ్లు. సీత నాకోసం ఏమైనా చేస్తుంది.
సూర్య: అయినా సరే వద్దు. 
మధు: సూర్య సీతకి మనం అన్నా మన ప్రేమ అన్నా చాలా ఇష్టం అది తలచుకుంటే ఏమైనా చేస్తుంది నువ్వు ఒప్పుకో. 
సూర్యఅన్న: వారంలో ఆపరేషన్ చేయాలంట మధు.
మధు: చేద్దాం బావగారు సీత నాకోసం ఏమైనా చేస్తుంది. 
జలజ: ఈ సూర్య ఎలా నడుస్తాడో ఆ సీత ఎలా డబ్బు ఇస్తుందో నేను చూస్తా.

ఉదయం మహాలక్ష్మీ, అర్చనలు జాగింగ్ డ్రస్ వేసుకొని జాగింగ్ చేస్తుంటారు. సీత కూరగాయలు తీసుకొని వచ్చి ఇద్దరినీ వింతగా చూస్తుంది. ఎవరు మీరు మా వీధికి కొత్తగా వచ్చారా అని అంటుంది. ఈ గెటప్‌లో మమల్ని చూస్తే జలసీగా ఉందా అని మహాలక్ష్మీ అంటుంది. దానికి సీత కాలేజీ అమ్మాయిలు అని అంటాను అనుకున్నారా అత్తలు అని అంటుంది. ఇక మహాలక్ష్మీ వీధిలో అత్త అన్నావని అంటే ముఖం పగలగొడతానని అంటుంది. నిన్ను ఎవరూ గౌరవించరని మాకు పెట్టినట్లు నీకు నమస్కారం పెట్టరని మహాలక్ష్మీ అంటుంది. దానికి సీత మీతోనే నేను సెల్యూట్ కొట్టించుకుంటానని అందుకు రేపే ముహూర్తం అని అంటుంది. ఇంట్లో అందరితో రేపు సెల్యూట్ కొట్టించుకుంటానని అంటుంది. మహాలక్ష్మీ ఇంటికి వచ్చి అందర్ని పిలిచి సీత తమని వీధిలో తిరగనిచ్చేలా లేదని అందరూ తమకి నమస్కారం పెడితే తను మాత్రం హేళనగా మాట్లాడిందని రేపు అందరితో సెల్యూట్ కొట్టించుకుంటానని అందని చెప్తారు. రామ్ వాళ్లు సీత సరదాగా అనుంటుందని అంటారు. సీత ఏదో ప్లాన్ చేసిందని సీతకి సెల్యూట్ చేయడం కంటే సిగ్గు చేటు లేదని అర్చన అంటుంది. ఇక రామ్ సీత ప్లాన్ కనుక్కుంటానని అంటే చలపతి ఆపుతాడు. రామ్ సీత దగ్గరకు వెళ్తాడు. ఆషాఢం పేరుతో ఇద్దరిని వేరు చేసిన మీరే ఇప్పుడు ప్లాన్ పేరుతో దగ్గరుండి పంపారని చలపతి అంటాడు.

రామ్ సీత దగ్గరకు వెళ్తాడు. సీత కూరగాయలు కట్ చేస్తుంటే సీత చూడకుండా వెళ్లి సీతకి డౌట్ రాకుండా విషయం తెలుసుకోవాలని అనుకుంటాడు. రామ్ ప్రేమగా మాట్లాడుతాడు. ప్లాన్ కనిపెట్టడానికే రామ్ వచ్చాడని కాసేపు రామ్‌తో ఆడుకుంటానని అంటుంది. వీధిలో మా ఇద్దరు పిన్నిలతో ఛాలెంజ్ చేశావని అది నాకు భలే నచ్చిందని సీత దగ్గర నిజం లాగడానికి హగ్ చేసుకుంటాడు. సీత నిజం చెప్తాననే నెపంతో రామ్‌తో పనులు చేయిస్తుంది. కూరగాయలు కట్ చేయిస్తుంది. బట్టలు మడతపెట్టిస్తుంది. అంట్లు తోమిస్తుంది.  అన్నీ పనులు చేసిన రామ్ ప్లాన్ చెప్పమంటే రేపు చెప్తా వెళ్లు అని నీ ప్లాన్ నాకు తెలుసని పంపేస్తుంది. 

ఉదయం అందరూ సీత ఎందుకు సెల్యూట్ కొట్టిస్తుందో అని టెన్షన్ పడతారు. ఇక చలపతి ఇంట్లో అందరికీ బయటకి రమ్మని బయట జాతీయ జెండాతో పాటు స్వతంత్ర వీరుల ఫొటోలు ఉన్నాయని అంటాడు. దాంతో రామ్ ఈ రోజు ఆగష్టు 15 అని అంటాడు. ఇక కాలనీ జనాలు కూడా ఇంటి ముందు ఉన్నారని చెప్పి చలపతి అందర్ని బయటకు తీసుకెళ్తాడు. అందరూ అది మహా ప్లాన్ అనుకొని పొగుడుతారు. దీనంతటికి సీతే కారణం అని సీతకి సెల్యూట్ కొట్టాలని చలపతి అంటాడు. ఇంతలో సీత చేతిలో జెండా పట్టుకొని భరతమాత వేషం వేసుకొని వస్తుంది. అందరూ సీతని చూసి ఆనంద పడతారు. మహా బ్యాచ్ షాక్ అయిపోతారు. కాలనీ వాసులు సీతని పొగుడుతారు. మహాలక్ష్మినే తనకు ఆ వేషం వేసుకోమని చెప్పిందని సీత చెప్తుంది. మహాలక్ష్మీ గారి అనువణువునా దేశ భక్తి పొంగి పొర్లుతుందని మహాని ఇరికించేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కన్నతండ్రి చెంప పగలగొట్టిన జ్యోత్స్న.. బావ, దీపలను ఎంజాయ్ చేయమంటావని తల్లిపై జ్యో సీరియస్!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget