Seethe Ramudi Katnam Serial Today April 4th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సూసైడ్ చేసుకున్న మధుమిత.. రామ్, సీతలు మధుని కాపాడగలరా? కన్నతండ్రి కర్కసత్వం..!
Seethe Ramudi Katnam Serial Today Episode అవమానాలు భరించలేక తాను బతికి ఉంటే అందరికీ ఇబ్బందని మధుమిత ఆత్మహత్య చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode రామ్, సీతలు గుడికి వస్తారు. సీత తన అక్క మధుమిత, బావ సూర్య పేర్ల మీద అర్చన చేయమని పంతులుకి చెప్తుంది. పంతులు సరే అని సీత రామ్‌లను ప్రదక్షణలు చేయంటాడు. సీత రామ్‌కి కొంగుముడి వేసుకొని ప్రదక్షిణలు చేస్తుంది. మధుమిత వాచ్ మాన్ సాంబకి కొన్ని మాత్రలు తీసుకురమ్మంటుంది.
సాంబ: అమ్మగారు ఈ మాత్రలు కోసం చాలా చోట్ల తిరిగాను ఎవరూ ఇవ్వమన్నారు. ఇక చివరకు నాకు తెలిసిన ఒకతను ఇచ్చాడు. ఎందుకు అమ్మ ఇది.
మధు: నేను పోవడానికి..
సాంబ: ఏంటమ్మా..
మధు: అదే నిద్రపోవడానికి..
సాంబ: పాపం మధుమిత అమ్మగారు కష్టాల్లో ఉన్నట్లు ఉన్నారు. అందుకే నిద్ర పట్టక ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంటారు.
మధు తన గదికి వచ్చి గతం మొత్తం తలచుకొని బాధ పడుతుంది. సాంబ ఇచ్చిన ట్యాబ్లెట్స్ పట్టుకొని తాను ఎవరికీ అడ్డంరాను అని తన వల్ల ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు అని వాటిని మింగేస్తుంది. నా వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావు ఐ మిస్ యూ సీత అని ఏడుస్తుంది. తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టాను అని క్షమాపణలు చెప్పుకుంటుంది. మరోవైపు శివకృష్ణ ఇంట్లో ఉన్న మధుమిత, సీతల ఫొటో కింద పడి పగిలిపోతుంది. దాన్ని చూసి ఇంట్లో అందరూ అపశకునం అనుకుంటారు.
శివకృష్ణ: మన ఇంటికి పట్టిన శని వదల బోతుంది అని దేవుడు ఇలా చెప్పినట్లు ఉన్నాడు.
శివతల్లి: ఏం మాట్లాడుతున్నావ్ రా వాళ్లు నీ కూతుళ్లు.
శివకృష్ణ: వాళ్లలో సీత ఒక్కర్తే నా కూతురు. మన పరువు తీసిన మధు సీత ఇంట్లో కాదు ఫొటోలో సీత పక్కన కూడా ఉండకూడదు.
లలిత: ఎందుకు మీరు ప్రతీ దానికి మధునే అంటారు.
శివతల్లి: కోపంలో నువ్వేం మాట్లాడుతావో నీకే తెలీదురా..
శివకృష్ణ: నా పరువు తీసిన వాళ్లు నాకు నచ్చరు. ఈ ఫొటో పగిలిపోయింది కదా. ఇక నుంచి సీత ఫొటోనే మన ఇంట్లో ఉంటుంది. మధు కూడా సుమతిలా కనిపించకుండా పోవాలా కానీ ఇలా పక్కలో బల్లెంలా మారకూడదు. సుమతిలా మధు కూడా కనిపించకుండా ఉంటే బాగున్ను. మధు చనిపోతే బాగున్ను.
శివతల్లి: తప్పురా కన్నతండ్రివి అలా శపించకూడదు.
శివకృష్ణ: నా శాపం నిజం అయితే బాగున్ను.
మరోవైపు మధు ఇబ్బంది పడుతుంటుంది. సీత రామ్‌లు ప్రేమగా మాట్లాడుకుంటారు. రామ్ సీత అంటే తనకు ఇష్టమని మా పిన్ని విషయంలోనే నచ్చవని అంటాడు. ఇద్దరూ చేతులు పట్టుకొని ప్రేమగా ఉంటారు. ఇంతలో గుడికి వాచ్‌మాన్ సాంబ వస్తాడు. డ్యూటీ వదిలేసి ఇక్కడేం చేస్తున్నావ్ అని సాంబని రామ్ అడుగుతాడు. గుడికి రావాలి అని వచ్చానని సాంబ అంటాడు.
సాంబ: నాకు మధు మేడం గురించి చాలా బాధగా ఉందమ్మా. ఆ అమ్మ చాలా కష్టాలు పడుతుంది.
సీత: అక్కకి ఆ కష్టాలు అన్నీ తీరిపోతాయి సాంబ. బావ బయటకు రావాలి.
సాంబ: ఈరోజు మీ అక్క బాగా డల్‌గా ఉన్నారమ్మా. ప్రశాంతంగా నిద్రపోతా అని చెప్పి నాతో ఏవో మాత్రలు తెప్పించుకున్నారు.
రామ్: ఏ మాత్రలు సాంబ.. సాంబ చీటీ చూపిస్తాడు. అది చూసి రామ్ షాక్ అవుతాడు. అవి నిద్రమాత్రలు అని వాటిని మింగితే చాలా డేంజర్ అని చెప్తాడు.
సీత: అంటే మా అక్క నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటుందా..
రామ్: అలాగే అనిపిస్తుంది. ఇవి ఎన్ని తెచ్చావు సాంబ.
సాంబ: ఒక డబ్బా తెచ్చాను బాబు. మధు మేడం ఇలా చేస్తారు అని నేను అనుకోలేదు బాబు. ఇప్పుడెలా దేవుడా మధుమేడంని నువ్వే కాపాడాలి.
సీత మధుకి కాల్ చేస్తుంది. మధు మైకంలో ఫోన్ కోసం వెతుకుతుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.
మధు: సీత నన్ను నువ్వు మీ ఇంట్లో ఉండొద్దు అన్నావ్ కదా అందుకే ఈ లోకం నుంచే వెళ్లిపోతున్నా.
సీత: అక్క నువ్వు ఆ నిద్ర మాత్రలు మింగొద్దు అవి చాలా ప్రమాదం అంట.
మధు: ఇప్పటికే చాలా మింగేశాను. నాకు బతకాలి అని లేదు సీత. చనిపోతున్నా..
సీత: వద్దక్కా.. నా మాట విను..
రామ్: ప్లీజ్ మధుగారు మీరు ఆ పిల్స్ వేసుకోవద్దు. మీరు అంత రిస్క్ చేయొద్దు.
మధు: సారీ రామ్ గారు నేను మిమల్ని మీ పిన్ని గారికి చాలా ఇబ్బంది పెట్టాను. మీరు నాకు ఎంతో సాయం చేశారు. నా మీద చాలా ప్రేమ చూపించారు. అందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు బతకాలి అని లేదు సారీ..
సీత ఏడుస్తూ తన అక్కని బతిమాలుతుంది. దానికి నా వల్ల అందరికీ సమస్యలు నేను పోతే అందరూ బాగుంటారు సీత అని అంటుంది. నేను మీ అందరికీ బాధపెట్టాను ఇలాంటి బతుకు నాకు వద్దు అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక రామ్ తన పిన్ని మిమల్ని తీసుకొచ్చింది అని పిన్ని లేని టైంలో మీరు ఇలా చేయడం బాలేదు అని అంటాడు. ఇక తనని దేవుడు కూడా కాపాడలేడు అని. తన తరఫున పిన్నికి సారీ చెప్పమని అంటుంది. రామ్ మధుతో మాట్లాడించమని సీతకి ఫోన్ ఇచ్చి బయటకు వెళ్తాడు.
మరోవైపు అర్చన, గిరిధర్‌లు కాఫీ తాగుతూ ఉంటారు. రామ్ సీతలు బయటకు వెళ్లారని చలపతి, రేవతి కూడా బయటకు వెళ్లిపోయారు అని మహా లేకపోవడం అందరూ ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు అని అనుకుంటారు. ఇంతలో రామ్ గిరిధర్‌కి కాల్ చేస్తాడు. అయితే రామ్ ఫోన్‌తో సీత చేస్తుంది అని తాను రామ్‌తో ఎలా ఎంజాయ్ చేస్తుందో చూపించడానికే చేస్తుంది అని కాల్ కట్ చేస్తుంది. రామ్ గిరిధర్ కాల్ కట్ చేశాడు అని అర్చనకు చేస్తాడు. దీంతో అర్చన ఫోన్లు స్విఛ్ ఆఫ్ చేయమంటుంది. రామ్ చాలా టెన్షన్ పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ రివ్యూస్ వచ్చేశాయ్ - 'దిల్' రాజు భార్య, హీరో ఫాదర్ సినిమా చూసి ఏమన్నారంటే?