Seethe Ramudi Katnam Serial Today April 23rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్‌తో పెళ్లి చేయండి.. లేదంటే బిజినెస్ ఆపేస్తా: మిధన కండీషన్‌కి మహా నిర్ణయం ఏంటి?
Seethe Ramudi Katnam Today Episode సీత మహాలక్ష్మీ పొగరు అణచాలి రామ్‌తో తనకు పెళ్లి చేయకపోతే బిజినెస్ మొత్తం ఆపేస్తా అని మిధునలా బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode గౌతమ్, రేఖ ఇద్దరూ ఓ డీల్ చేసుకుంటారు. ఆస్తి మొత్తం గౌతమ్‌కి వచ్చేలా చేస్తే రేఖని పెళ్లి చేసుకుంటా అని అంటాడు. ఇద్దరూ డీల్ కుదురించుకుంటారు. మరోవైపు రేవతి, కిరణ్‌లు సీతకు జాగ్రత్తలు చెప్తారు. నాకు అంతా మంచే జరుగుతుంది ఏం పర్లేదు అని సీత అంటే మహాలక్ష్మీ నీకు మంచి జరగనివ్వదు అని ఇద్దరూ అంటారు. మహాలక్ష్మీ స్పీడ్‌కి బ్రేక్‌లు వేస్తానని సీత అంటుంది.
సీత ప్లానేంటి?
కిరణ్, రేవతిలు రామ్‌కి దగ్గరవ్వమని సీతకు చెప్తారు. ఇంకో తొమ్మిది రోజుల్లో తమ పెళ్లి రోజు వస్తుందని ఈ లోపు రామ్‌కి దగ్గరవుతానని ఆ ఇంటికి మళ్లీ వెళ్తానని సీత అంటుంది. మహాలక్ష్మీకి చెక్ పెట్టి అన్న సమస్యలు పరిష్కరించే ఐడియా వేసేశానని అది ఇప్పుడే అమలు చేస్తానని సీత వాళ్లతో చెప్తుంది. ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతారు.
అన్నింటికీ ఆ సీతే కారణం..
మహాలక్ష్మీ, జనా, గిరిలకు అర్చన కాఫీ ఇస్తుంది. మహా తనకు వద్దని మైండ్ అంతా డిస్ట్రబ్‌గా ఉందని అంటుంది. ఏమైందని జనార్థన్ అడిగితే ప్రీతి పెళ్లి నా చేతుల మీద జరగలేదు.. రేవతి పెళ్లి నా ఇష్టప్రకారం జరగలేదు.. ఆఖరికి నా అక్క కొడుకు పెళ్లి కూడా నాకు నచ్చిన అమ్మాయితో జరకుండా అయిపోయింది. అన్నింటికీ ఆ సీత కారణం అని మహాలక్ష్మీ అంటుంది.
మిధున ఏం చేస్తుందో ఏంటో?
చలపతి వస్తూ మిధున మిస్ అయితే ఏంటి రేఖ కోడలిగా వస్తుంది కదా అంటాడు. ఆ రేఖకి మిధునతో పోలిక ఏంటి అసలు అది ఎవరో కూడా తెలీదు అని అర్చన అంటుంది. ఇక నిశ్చితార్థం చెడిపోయినందుకు మిధున ఏం చేస్తుందో అని అందరూ టెన్షన్ పడతారు. గౌతమ్ గురించి గొప్పగా చెప్తారు ఇప్పుడు ఆ మిధున ఏం చేస్తుందో అని చలపతి అంటాడు. ఇంతలో ముఖర్జీ మహాలక్ష్మీకి కాల్ చేసి మహాని జనార్థన్ ఇద్దరినీ అర్జెంటుగా రమ్మని అంటాడు. ఏం చేద్దామని మహాలక్ష్మీ భర్తని అడిగితే ఏమైనా ఇప్పుడే తేల్చుకుందాం వెళ్దాం అని జనా అంటాడు. ఇద్దరూ ముఖర్జీ ఇంటికి వెళ్తారు.
అలాంటి వాడితో నాకు పెళ్లి ఎలా చేయాలి అనుకున్నారు..
మహాలక్ష్మీ వాళ్లకి సారీ చెప్పి మీరు ఎంత బాధ పడుతున్నారో మేం అంతకంటే ఎక్కువ బాధ పడుతున్నాం అంటుంది. మిధున చాలా ఫీలవుతుంది. తను మీకు ఏదో చెప్పాలి అని పిలిచిందని అంటారు. ఇంతలో మిధున కిందకి వస్తుంది. గౌతమ్ తరుఫున మహాలక్ష్మీ, జనార్థన్ సారీ చెప్తారు. దానికి మిధున మీతో సారీ చెప్పించుకోవడానికి పిలవలేదు.. మీ వల్ల మా పరువు పోయింది. మీ ఇంటి అబ్బాయి గురించి నాకు తెలియకపోతే ఎలా అంకుల్ అలాంటి వాడితో నాకు పెళ్లి చేయాలి అని ఎలా అనుకున్నారు అని మిధున ప్రశ్నిస్తుంది.
మీతో ఇక బిజినెస్ చేయం..
మహాలక్ష్మీ పొరపాటు జరిగింది అంటే మిధున నేను దాని కోసం మాట్లాడాలి అనుకోలేదు. మీరు మాతో జెన్యూన్‌గా లేరు కాబట్టి మీతో బిజినెస్ చేయలేం. మీతో మాకున్న అన్నీ బిజినెస్ డీల్స్ వెంటనే క్యాన్సిల్ చేసుకుంటున్నాం. అందుకు మీరు ఒప్పుకున్నట్లు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టి బయల్దేరండి అని చెప్తుంది. మహాలక్ష్మీ, జనార్థన్ షాక్ అవుతారు. సడెన్‌గా ఇలా అంటే ఎలా మేం చాలా నష్టపోతాం అని మహాలక్ష్మీ అంటుంది. మిధునకు సర్దిచెప్పమని ముఖర్జీతో చెప్తారు. ముఖర్జీ మాత్రం నా కూతురిదే ఫైనల్ నిర్ణయం అని అంటాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని మహాలక్ష్మీ, జనార్థన్ మిధునని అడుగుతారు.
రామ్‌తో పెళ్లి చేయండి..
మిధున వాళ్లతో మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక ఛాన్స్ ఇస్తా. మేం మీతో ఉండాలి అంటే మీరు నాకు రామ్‌తో పెళ్లి చేయాలి అని అంటుంది. రామ్‌కి నువ్వు ఇష్టం లేదమ్మా సీత అంటేనే ఇష్టం అని జనార్థన్ చెప్తే నాకు తెలుసు కానీ రామ్, సీత విడిగా ఉన్నారు కదా మళ్లీ తిరిగి రాదు అని మహాలక్ష్మీ చెప్తారు కదా రామ్ మైండ్ మార్చేయండి అని అంటుంది. రామ్ ఒప్పుకోడు అని జనార్థన్ అంటే అయితే మీతో బిజినెస్ చేయడానికి నేను ఒప్పుకోను డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి వెళ్లండి అంటుంది. దాంతో మహాలక్ష్మీ మేం వెళ్లి రామ్‌తో మాట్లాడుతామని అంటుంది. మహాలక్ష్మీ ఇంటికి వెళ్లి జరిగింది ఇంట్లో చెప్తారు. ఇప్పుడేం చేద్దాం అని అందరూ అనుకుంటారు. బిజినెస్ కోసం రామ్‌ని పెళ్లికి ఒప్పించాల్సిందే అని మహాలక్ష్మీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!





















