Seethe Ramudi Katnam Serial Today April 22nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్ : మొదలైన అక్కాచెల్లెళ్ల వార్.. నిజం తెలుసుకున్న సుమతి ఉగ్రరూపం, వణికిపోయిన మహాలక్ష్మి!
Seethe Ramudi Katnam Serial Today Episode : సుమతి ఇంటికి వచ్చి మహాలక్ష్మి మోసం బయట పెట్టడంతో అందరూ మహాని అసహ్యించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode సీత తన తండ్రికి కాల్ చేస్తుంది. సూర్యని తొందరగా విడిపించాలి అని అంటుంది. దానికి శివకృష్ణ అర్థమైంది అమ్మ.. సూర్య జైలులో ఉండటం వల్ల మధుమిత అక్కడుండి నీ కంట్లో నలుసులా తయారైందని అంటాడు. మధుమిత వల్ల అటు నువ్వు ఇటు మేము బాధపడుతున్నామని.. సూర్య జైలు నుంచి బయటకు వస్తేకానీ మధుమిత మీ ఇంటి నుంచి బయటకు రాదని శివకృష్ణ అంటాడు.
శివకృష్ణ: ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.
సీత: ఏదో ఒకటి చేసి సూర్య బావని తొందరగా జైలు నుంచి బయటకు తీసుకురండి నాన్న. అప్పుడే నా బాధ మీ బాధ తీరుతుంది. ఉంటాను నాన్న.
శివకృష్ణ: పాపం సీత మధు వల్ల నరకం అనుభవిస్తుంది. మధుకి ఆ విషయం అర్థం కావడం లేదు.
సీత: నువ్వెప్పుడు వచ్చావ్ అక్క.
మధు: నువ్వు నాన్నతో మాట్లాడుతున్నప్పుడు.
సీత: నీ గురించే నాన్నతో మాట్లాడుతున్నా.
మధు: విన్నాను. నీకు వేరే పనేం లేదా సీత. ఎంత సేపు నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేయాలి అనే చూస్తావా..
సీత: నేను నిన్ను గెంటేయాలి అని అనుకోవడం లేదు అక్క. నిన్ను సమస్యల నుంచి బయట పడేయాలి అనుకున్నాను.
మధు: నా ప్రాబ్లమ్ నువ్వే. నీ వల్లే నాకు హెడ్ యాక్ వస్తుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉంచవని ఆఫీస్‌కు వెళ్తే అక్కడికి వస్తావ్. అమ్మానాన్నలను ఇక్కడికి రప్పించి తీసుకెళ్లిపోమంటావ్.. లేదంటే ఇదిగో ఇలా కాల్ చేసి చాడీలు చెప్తావ్. నీ పేరు సీత కాదే.. సమస్య అని పెట్టాల్సింది.
సీత: ఆపు అక్క.. అనవసరంగా ఏదేదో మాట్లాడకు. నీ కళ్ల ముందు జరిగేవి అన్నీ నిజాలు కావు. చేయని నేరానికి నీ భర్త అరెస్ట్ అయి జైల్‌లో ఉన్నాడు. అసలు బావ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావ్. బావ బెయిల్ గురించి మాట్లాడావా.. కనీసం జైలుకి వెళ్లి బావని కలిశావా..
మధు: సూర్యని విడిపించడానికోసం మహాలక్ష్మి గారు ప్రయత్నిస్తున్నారు.
సీత: నేను అడుగుతున్నది నువ్వేం చేస్తున్నావ్ అని. నువ్వు చేయాల్సింది నేను చేస్తున్నా.. నీ కోసం నేను ఇన్ని చేస్తుంటే నువ్వేమో నేనే నీ సమస్య అని అంటున్నావ్. గుడ్డిగా ఆ మహాలక్ష్మిని నమ్ముతున్నావ్. ఇది నీ ఇళ్లు కాదు నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పినా నువ్వు అర్థం చేసుకోవడం లేదు. టైంకి తినడం టిప్పుటాపుగా రెడీ అయి ఆఫీస్‌కు వెళ్తున్నావ్. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఉద్యోగం కాదు. బావకోసం ఉద్యమం. అర్థమవుతుందా..
మధు: అర్థమవుతుందే.. బాగా అర్థమవుతుంది. నీకు చదువు రాదు కాబట్టి నువ్వు ఆఫీస్‌కు వెళ్లి జాబ్ చేయలేవు. అందుకే నేను వెళ్తుంటే తట్టుకోలేక ఆసూయతో మాట్లాడుతున్నావ్.
సీత: నాకు అసూయా.. నీకు అంతే అర్థమైందా అక్క.
మధు: అంతే కాక ఇంకేంటి. నీకు అందం లేదు చదువు లేదు. అవి రెండూ ఉన్న నన్ను చూస్తే నీకు కుళ్లు. నీకు దక్కిన ఈ వైభవం నేను ఎక్కడ లాక్కుంటానో అని నీకు భయం.
సీత: నాకే అవన్నీ ఉండి ఉంటే నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టనిచ్చేదాన్నే కాదు.
మధు: నువ్వు ఎవరే నన్ను ఇంట్లో అడుగుపెట్టనివ్వకుండా చేయడానికి.
సీత: నేను ఈ ఇంటి కోడల్ని.
మధు: ఇది మహాలక్ష్మి గారి ఇళ్లు. పేరుకే నువ్వు ఈ ఇంటి కోడలివి. ఇంకా చెప్పాలి అంటే బయట ప్రపంచానికి నేనే ఈ ఇంటికి కోడలిని.
సీత: పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అక్క.
మధు: నువ్వేం చేసినా నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించలేవు.
సీత: పంపిస్తాను. పంపిస్తాను.. ఇక్కడ ఉండిపోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను అడ్డుకుంటాను. అతి త్వరలో సూర్య బావని విడిపించి నిన్ను బయటకు పంపించడం ఖాయం. బావతో వెళ్లిపోవడానికి రెడీగా ఉండు.
మహాలక్ష్మి: ఈ మధ్య ఈ ఇంట్లో మాటిమాటికి సుమతి పేరు వినిపిస్తుంది. సీత వల్లే ఇది జరుగుతుంది. అసలు ఆ రోజు యాక్సిడెంట్లో సుమతి నిజంగానే చనిపోయిందా. లేక కొన ఊపిరితో బతికిందా.. బతికితే ఇన్నాళ్లు ఇంటికి ఎందుకు రాలేదు.
సుమతి ఆటోలో ఇంటికి వస్తుంది. గేటు మీద తన పేరు చూసి సంబరపడుతుంది. లోపలికి వస్తుంది. ఇంతలో మహాలక్ష్మి రౌడీ రంగతో మాట్లాడటం సుమతి వినేస్తుంది. ఫ్రెండ్ చేసిన పనికి షాకైపోతుంది. రంగ డబ్బు కావాలి అని బెదిరించడంతో రంగని ఎన్‌కౌంటర్ చేయించాలని అనుకుంటుంది. ఇంతలో సుమతి మహా లక్ష్మి అని గట్టిగా అరుస్తుంది. సుమతిని చూసి మహాలక్ష్మి షాకై వణికి పోతుంది. సుమతి దగ్గరకు రావడంతో డ్రామా మొదలు పెడుతుంది. దగ్గరకు వెళ్లడంతో సుమతి తోసేస్తుంది.
సుమతి: ఏయ్ చాలు ఆపు నీ నాటకాలు. నన్ను తాకొద్దు. దూరంగా ఉండు. రోడ్డున పడ్డ నిన్ను ఆదరించి ఇంత చేస్తే నాకు ఇంత ద్రోహం చేస్తావా.. నువ్వు ప్రాణ స్నేహితురాలివి కాదే ప్రాణాలు తీసే హంతకురాలివి.
ఇంతలో రామ్, జనార్థన్, ప్రీతి అందరూ కిందకి వస్తారు. సుమతిని చూసి అందరూ ఎమోషనల్ అవుతారు. రామ్, ప్రీతిలు సుమతికి పరిచయం చేసుకుంటారు. సుమతి పిల్లల్ని దగ్గరకు తీసుకుంటుంది. సీతని కూడా రామ్ పరిచయం చేస్తాడు. సీత, రామ్‌లను దీవిస్తుంది సుమతి.
సీత: మీరు చనిపోయారు అని అత్తయ్య చెప్పింది.
సుమతి: నేను చనిపోలేదు. ఈ రాక్షసి నన్ను చంపాలి అని చూసింది. అందరూ షాక్ అయిపోతారు.
రామ్: నువ్వు చెప్పింది నిజమా అమ్మ.
మహాలక్ష్మి: లేదు రామ్ మీ అమ్మని నేను ఎందుకు చంపాలి అని చూస్తాను.
సుమతి: నోర్మూయ్ ఇందాక నీ నోటితోనే నిజాన్ని విన్నానే. నీ నిజ స్వరూపాన్ని నువ్వే చెప్పావు. నన్ను చంపి నా భర్తను పిల్లల్ని ఆస్తిని నీ సొంతం చేసుకున్నావు. నీ పాపం పండి నిజం ఏంటో నాకు తెలిసింది.
మహాలక్ష్మి: సుమతి నువ్వు విన్నది నిజం కాదు. నువ్వుంటే నాకు ప్రాణం.
సుమతి: నీ మీద జాలి పడినందుకు నన్నే అంతం చేయాలి అనుకున్నావ్.
రామ్: నువ్వు ఇంత చెడ్డదానివా పిన్ని.. నువ్వు దేవతవని నమ్మాను. నీ గురించి సీత ఎంత చెప్పినా వినలేదు. మా అమ్మ కన్నా నువ్వే ఎక్కువ అనుకున్నా కదా పిన్ని ఇంత చీట్ చేస్తావా..
జనార్థన్: నువ్వు ఇంత కసాయిదానివి అనుకోలేదు మహాలక్ష్మి.. భార్య భర్తలను విడదీశావ్. పిల్లలకు తల్లిని దూరం చేశావ్..
ప్రీతి: నువ్వు ఇంత బ్యాడా ఐ హేట్ యూ..
మహాలక్ష్మిని అందరూ తలో మాట అంటారు. డబ్బు కోసం ఇంత దిగజారిపోయావని అందరూ తిడతారు. అర్చన, గరిధర్‌లు మాత్రం మహాలక్ష్మికి సపోర్ట్ చేస్తారు. జరిగింది మర్చిపోయి అందరం కలిసి ఉందామని అంటారు. ఇక ఉష అయితే పెద్దమ్మ ఇంత కాలం అందర్ని మంచిగా చూసుకుంది కదా అని అంటుంది. అయితే అందరూ మహాని తిడతారు. ఇంతలో మధుమిత వచ్చి అత్తయ్య అని అంటుంది. ఎవరు అని సుమతి అడిగితే మధుమిత తన అక్క అని సీత అంటుంది. ఇక మధు తను మన మేనత్త సీత నాన్న చెల్లెలు అని చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: హీరోయిన్ శివాత్మిక బర్త్‌డే ఈరోజే.. నేటితో ఆమె వయసు ఎంతో తెలుసా?