అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today April 18th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత, మిధున ఒక్కరేనా నిజం చెప్పండి.. ముఖర్జీ మీద మహాలక్ష్మీ ఫైర్.. ఎంట్రీ ఇచ్చేసిన మిధున

Seethe Ramudi Katnam Today Episode సీత మిధున ఒకే సారి మిస్ అవ్వడంతో మహాలక్ష్మీకి అనుమానం వచ్చి ముఖర్జీని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ మిధునని వెంటనే తీసుకురమ్మని ముఖర్జీని కంగారు పెడుతుందని ముఖర్జీ మహాలక్ష్మీతో నిజం చెప్పేయాలి అనుకుంటారు. సీతని కాపాడటానికి మహాలక్ష్మీతో సీత, మిధున ఒక్కరే అని చెప్పాలి అనుకుంటారు. సీత తనని విడిపించమని అంటుంది. కావాలనే రౌడీలను రెచ్చ గొడుతుంది. ఓ రౌడీ రెచ్చిపోతుంటే మరో రౌడీ ఆపుతాడు. తాను బందీ అయినట్లు సీత ఎవరికైనా చెప్పాలి అనుకుంటుంది. 

రేవతి రామ్‌తో సీత గురించి ఇంకా తెలీలేదు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సీత తండ్రికి ఫోన్ చేయమని అంటారు. కాసేపు చూసి ఏసీపీ కాల్ చేసి రిపోర్ట్ ఇస్తానని రామ్ అంటాడు. ఈ రోజు సాయంత్రం వరకు మీకు సీత గురించి ఏం తెలీదు అని మహాలక్ష్మీ అంటుంది. ఇక పంతులు టైం అయిపోతుందని కంగారు పెడుతుంది. గౌతమ్ మిధునకు కాల్ చేస్తా అన్న టైంకి ముఖర్జీ వస్తారు. మిధున ఎక్కడుందని గౌతమ్ అడుగుతాడు. ముఖర్జీ తడబడతాడు. 

మహాలక్ష్మీ: ఏమైంది సార్ మిధున మీతో రాలేదా. ఏంటండి ఇబ్బందిగా ఉన్నారు ఏమైనా సమస్యనా.
ముఖర్జీ: మిధున.. మిధున.. 
సుశీల: మిధున కనిపించడం లేదండీ.
చలపతి: వీడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అమెరికా చెక్కేసిందేమో.
మహాలక్ష్మీ: మిధున ఎక్కడికి వెళ్లింది.
ముఖర్జీ: అదే తెలీదు.
గిరి: మీకు చెప్పకుండా మిధున ఏం చేయదు కదా. 
అర్చన: ఇక్కడ సీత అక్కడ మిధున ఒకేలా ఉన్న ఇద్దరు ఒకేసారి కనిపించకుండా పోవడం ఏంటి. ఏదో తేడాగా ఉంది మహా.
మహాలక్ష్మీ: నాకు అలాగే అనిపిస్తుంది. నిజం చెప్పండి ముఖర్జీ గారు మిధున మీ అమ్మాయేనా లేక సీతే మిధునలా నటిస్తుందా నాకు నిజం తెలియాలి ముఖర్జీ గారు. రేవతి వాళ్లు, మీరు, సీత కలిసి నాటకం ఆడుతున్నారని నాకు అనుమానంగా ఉంది. మర్యాదగా నాకు నిజం చెప్పండి.
జనా: ఏంటి సార్ మౌనంగా ఉన్నారు. సీత మిధునలా నటిస్తుందా.
సుశీల: మీ దగ్గర నిజం చెప్పాలి అనే వచ్చాం. 

ముఖర్జీ సీత, మిధున ఒక్కరే అని చెప్పబోతారు. సీత, మిధున ఒక్కరేనా అని మహాలక్ష్మీ అరుస్తుంది. దాంతో సీత మిధునలా నిశ్చితార్థానికి రెడీ అయి ఇద్దరూ ఒక్కరు కాదు అని చెప్పి ఎంట్రీ ఇస్తుంది. నేను రావడం కాస్త లేటు అయ్యే సరికి నేను సీత ఒక్కరే అయిపోతారా అని అంటుంది. సీతతో నాకు పోలిక ఏంటి అని మిధున అంటే దానికి సీతకు నీకు పోలిక ఏంటి నువ్వు సీతలా ఉండాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలి అంటాడు. ఇక అందరూ  కార్యక్రమం మొదలు పెడదామని అనుకుంటారు. మహాలక్ష్మీ గౌతమ్‌ని చాటుగా తీసుకెళ్లి రౌడీలకు కాల్ చేయమని చెప్తుంది. రౌడీలకు ఫోన్ చేసి సీత ఉందో లేదో కనుక్కోమని అంటుంది. 

గౌతమ్ రౌడీలకు కాల్ చేస్తాడు. రౌడీలు సీత ఉందని అంటారు. గౌతమ్, మహాలక్ష్మీ రిలాక్స్ అయపోతారు. అయితే సీత తండ్రి రౌడీలకు గన్ గురి పెట్టడంతో రౌడీలు సీత ఉందని అబద్ధం చెప్తారు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో మీకు తెలుసా అని శివకృష్ణ అడుగుతాడు. ఫ్లాష్ బ్యాక్‌లో సీత కాలితో ఫోన్ తీసుకొని వాట్సాప్‌లో తండ్రికి లొకేషన్ పెడుతుంది. తర్వాత వాయిస్ కాల్ చేసి సిగ్నిల్ ఇస్తుంది. సీత ప్రమాదంలో ఉందని గ్రహించి శివకృష్ణ వెళ్తాడు. ఇంతలో సీత కట్లు విప్పుకొని రౌడీలను కొట్టి పారిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!
 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
నువ్వులేక నేను లేను: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
Podarillu Serial Today July 29th: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు
పొదరిల్లు: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు
Illu Illalu Pillalu Serial Today July 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు:
ఇల్లు ఇల్లాలు పిల్లలు: "ఐ హేట్ యూ ధీరజ్..!" ఇంటిని వదిలి వెళ్లిపోయిన ప్రేమ..! వేదవతిపై చేయి ఎత్తిన రామరాజు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget