అన్వేషించండి

Satyabhama Serial Today June 11th: సత్యభామ సీరియల్: కాళీని రోడ్లమీద పరుగెత్తించి క్షమాపణ చెప్పించిన క్రిష్.. మైత్రి రావడంతో నందినిలో మొదలైన ఈర్ష్య! 

Satyabhama Serial Today Episode మైత్రి, హర్షల గురించి తెలుసుకున్న నందిని హర్షని మైత్రికి దూరంగా ఉంచడం కోసం తాను హర్ష దగ్గరకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode : సత్య బయట అటూ ఇటూ తిరుగుతూ భైరవి చెప్పిన చుట్టాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వ్రతం మొదలై ఉంటుందని బాధ పడుతుంది. ఇంతలో రేణుకు అక్కడికి వస్తే అత్తయ్య తరఫు చుట్టాలు ఇంకా రావడం లేదు అని చెప్తుంది. దానికి పుట్టింటికి వెళ్తాను అన్నావనే అలా అబద్ధం చెప్పారని చెప్తుంది. తన అత్తమ్మ చెప్పిన చుట్టాలు ఎప్పుడూ రారు అని అదంతా అబద్ధం అని అంటుంది. సత్య ఇప్పుడే అడుగుతాను అంటే తాను దొరికిపోతాను అని వద్దని చెప్తుంది. క్రిష్ గాయలతో కాళీ వాళ్లకి వార్నింగ్ ఇస్తాడు.

క్రిష్: రేయ్ నేను జీవితంలో రెండు తప్పులు చేశా. ఒకటి నిన్ను నమ్మి దగ్గరకు తీసుకోవడం. రెండు చేతికి దొరికిన నిన్ను చంపకుండా విడిపెట్టడం. ఇక నీతో నేను మూడో తప్పు చేయనురా. చంపకుండా విడిచిపెట్టనురా. అంటూ క్రిష్ రౌడీలను చితక్కొడతాడు. కాళీ గుండె మీద కాలు వేసి నన్ను చంపాలి అని చూస్తావా వరంగల్ కింగ్‌రా ఇక్కడ. రేయ్ నీకు సంధ్య కావాలారా. అసలు ఏంట్రా నీ ప్రాబ్లమ్‌ ఇన్నాళ్లు సత్యని సతాయించావ్ తన్ని తరిమేశా. ఇప్పుడు నా మరదల్ని సతాయిస్తున్నావా. 
సత్య: నువ్వు చెప్పింది నిజమే అక్క ఈ ఇంట్లో మగాలకి మనసు ఉండదు అక్క. క్రిష్ కూడా అంతే. ప్రేమించి పెళ్లి చేసుకున్నా అంటాడు. కానీ ఎప్పుడూ నా మనసుని అర్థం చేసుకున్నది లేదు తన దోరిని తనదే.
క్రిష్: రేయ్ నువ్వు సంధ్యని కెలికినా నాకు ఫరక్ పడదు. కానీ సంధ్య బాధ పడితే సత్య బాధ పడుతుంది. సత్య బాధ పడితే నా దిమాక్‌లో ఫిల్మెంట్ బర్న్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తానో నాకు తెలీదు. సత్య అంటే నాకు ప్రాణం కాదురా. ప్రాణం కంటే ఎక్కువ. తను నన్ను ఛీ కొట్టినా దూరం అయినా దూరం చేసిన సత్యతోనే నా మనసు ఎప్పుడూ ఉంటుంది. నీడలా ఉంటుంది. 

సత్య గురించి క్రిష్‌ ప్రేమగా గొప్పగా కాళీతో చెప్తే సత్య మాత్రం రేణుకతో క్రిష్‌ గురించి తప్పుగా చెప్తుంది. ఇక కాళీ ఎంత వదిలేయ్‌మని వేడుకున్నా క్రిష్ కనికరించడు. కాళీని పట్టుకొని నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదు పదరా అంటూ తీసుకెళ్తాడు. మరోవైపు వ్రతం ఏర్పాట్లు జరుగుతాయి. మైత్రి హర్షని ప్రేమగా చూస్తుంది. హర్ష దగ్గరకు వెళ్లి నిల్చొంటుంది. దాన్ని నందిని చూస్తుంది. ఇక విశాలాక్షి సత్యకి కాల్ చేస్తుంది. పూజ మొదలవుతుందని చెప్తుంది. సత్య తను రావడం లేదు అని చెప్తుంది. విశాలాక్షి షాక్ అవుతుంది. తన అత్తయ్యకు తలనొప్పి వచ్చిందని నేను ఇంట్లోనే ఉండాలి అని మీరు కానివ్వండి అని చెప్తుంది. ఇక నందినికి మైత్రి, హర్షలు ఒకర్ని ఒకరు చూసుకోవడం ఇష్టం లేక హర్ష దగ్గరకు వచ్చి పూజ మొదలైంది రా కూర్చొందామని పిలుస్తుంది. బలవంతంగా తీసుకెళ్లిపోతుంది. హర్ష మైత్రిని చూస్తుంటే తట్టుకోలేకపోతుంది.

మరోవైపు క్రిష్‌ కాళీ చేతులు కట్టేసి బండికి కట్టి రోడ్డు వెంట పరుగులు పెట్టిస్తాడు. కాళీ వద్దు అని ఎంత బతిమాలినా కనికరించడు. మరోవైపు నందిని, హర్షలు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. నందిని హర్ష కాళ్లకి కూడా దండం పెడుతుంది. పూజలో ఇద్దరూ కూర్చొంటారు. ఇక క్రిష్ కాళీని తీసుకొని విశ్వనాథం ఇంటికి వస్తాడు. సంధ్య బయపడుతుంటే కాళీ చచ్చిన పాము అని భయపడొద్దు అని అంటాడు. వీడు తన ఫ్యామిలీ జోలికి వస్తే అలా ఎలా వదులు తాను అని విశ్వనాథం, సంధ్య కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తేనే వదులుతాను అంటాడు. 

అక్కడే మరోసారి కాళీకి వార్నింగ్ ఇస్తాడు. వాళ్లు క్షమాపణ చెప్తేనే నిన్ను బతకనిస్తాను అని లేదంటే చంపేస్తానని అంటారు. కాళీ విశ్వనాథం, సంధ్యలను క్షమించమని వేడుకుంటాడు. విశ్వనాథం క్షమించాను అని అంటాడు. దాంతో కాళీ వెళ్లిపోబోతే క్రిష్ ఆపి ఇక్కడితే ఇది ఆగకపోతే ఈ చావు వార్త వైరల్ అవుతుందని బెదిరిస్తాడు. కాళీ అలాగే అంటూనే మిమల్ని వదలను అన్నట్లు విశ్వనాథం, సంధ్యలను చూస్తాడు. వీడియోలతో మీ జీవితాలతో ఆడుకుంటానని అంటాడు. మీ బాధ్యత కూడా నాదే అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: స్కూల్ నుంచి వెళ్లిపోతున్నా అంటూ ఎమోషనల్ అయిన లక్కీ.. మిత్రకు కారు ప్రమాదం జరుగుతుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
Embed widget