Satyabhama Serial Today July 10th: సత్యభామ సీరియల్: "నాకు ఊపిరెందుకు ఇచ్చావ్" సత్య వెనకాలే క్రిష్.. విశ్వనాథం వింత ప్రవర్తన!
Satyabhama Serial Today Episode కాళీ బెదిరింపులకు భయపడిన విశ్వనాథం వింతగా ప్రవర్తిస్తూ ఇంట్లో అందరి మీద కోప్పడుతూ చిరాకు పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Satyabhama Today Episode క్రిష్‌ని కాపాడటానికి సత్య ఊపిరందించడంతో క్రిష్ లేచి మైకంలో ఉంటాడు. ఏమైందని అందరూ అడిగితే కొత్త ఊపిరి వచ్చిందని చెప్తాడు. ప్రపంచం అంతా కొత్త కొత్తగా కనిపిస్తుందని అంటాడు. ఏమైందని ఇట్లా మాట్లాడుతున్నాడని భైరవి అంటుంది. సత్య కూడా అలాగే ఉండిపోతుంది. సత్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
విశాలాక్షి: హర్ష నాన్న ఎక్కడ. పొద్దున్నుంచి ఏదేదో ఆలోచిస్తున్నారు. తనలో తానే కంగారు పడుతున్నారు. ఏమైందో ఏంటో. ఏం ఆలోస్తున్నారు. ఏమైంది.
విశ్వనాథం: వెళ్లు ఇక్కడి నుంచి. చెప్తే గానీ వెళ్లవా.
హర్ష: నాన్న మీరేంటి ఏదోలా ఉన్నారు.
విశ్వనాథం: అలా ఏం లేదురా.
హర్ష: మరేంటి కొత్తగా అమ్మ మీద అరిచేస్తున్నారు.
విశ్వనాథం: అదేం లేదురా..
హర్ష: నాన్న దేనికో కంగారు పడుతున్నారు. కానీ అది నా దగ్గర దాస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి.
సత్య: ఏంటి..
క్రిష్: నాకు తెలియాలి. నీ మనసులో ఏముందో నాకు తెలియాలి. నీ మనసు నిండా నీ మీద ప్రేముంది.
సత్య: ఎవరు చెప్పారు. నవ్వేదో అనుకుంటే నేనేం చేయాలి.
క్రిష్: నీ కళ్లలోకి చూస్తుంటే తెలిసిపోతుందిలే. సత్య చేయి పట్టుకొని.. నేను ఏమైనా అనుకుంటా అని బలవంతంగా జరిగిపోతున్నావ్. నేను అంటే ఇష్టం లేనప్పుడు నాకు ఎందుకు ఊపిరి అందిచావ్. సత్య మౌనంగా ఉండిపోతుంది. నువ్వు ప్రాణం పోసింది నాకు కాదు. నాలో ఉన్న ప్రేమకు. నువ్వు బతికించింది నన్ను కాదు మన బంధాన్ని.
పంకజం వచ్చి సత్యని పిలిస్తే క్రిష్ సత్య కొంగు పట్టుకొని వదలడు. సత్యని వెంట తీసుకొని రమ్మని చెప్పారని పంకజం అంటే సత్య క్రిష్‌తో నేను వెళ్లాలి అర్థం కావడం లేదా అని పంకజానికి తెలీకుండా అడుగుతుంది. ఊపిరి ఎందుకు ఇచ్చావ్ అని వెనకెనక పడుతూ అడుగుతాడు. సత్య చిరాకు పడుతూ వెళ్తుంటుంది. సత్య ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు. మహదేవయ్యకు సత్య కాఫీ ఇస్తే అక్కడికి కూడా క్రిష్ వెళ్తాడు.
సత్య: ఉదయం నుంచి చంపేస్తున్నావ్. ఏం ఊపిరి ఇవ్వకూడదా. ప్రాణం పోతుంటే అలా చూస్తూ ఉండాలా.
క్రిష్: నేను అంటే నీకు ఇష్టం లేదు కదా నాకు నువ్వు ఊపిరి ఇవ్వడం ఏంటి. నాకు ఇష్టమని హల్వా తీసుకొచ్చావ్. అడక్కుండా కాఫీ ఇచ్చావ్. ఇదంతా చూస్తుంటే.. నీకు కూడా నా మీద మస్త్.. ప్రేమ పుట్టిందిలే.
సత్య: హలో మాస్టారూ అంత సీన్ లేదు. మహానుభాన నీకో దండం ఒకసారి ఇలా ఊహించుకొనే నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో పడేశావ్. ఈసారి మళ్లీ ఊహించుకొని ఈ సారి డెస్ట్ బిన్‌లో పడేయకు.
క్రిష్: అదేంటి అంత మాట అనేశావ్.
సత్య: మన ఆరు నెలల అగ్రిమెంట్ అలాగే ఉంది. తర్వాత నీ దారి నీదే.. నా దారి నాదే.
క్రిష్: నువ్వే నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటావ్లే. ఈ రోజు నీ ఊపిరి ఇచ్చావ్ ఏదో ఒక రోజు నీ ప్రేమ కూడా ఇస్తావ్.
సంధ్య కోచింగ్‌కి బయల్దేరుతుంది. విశ్వనాథం వచ్చి వద్దని సంధ్య మీద కోప్పడతాడు. అందరూ వింతగా ప్రవర్తిస్తున్నావ్ అని విశ్వనాథాన్ని ప్రశ్నిస్తారు. ఇక లైబ్రరీకి అని చెప్పి విశ్వనాథం బయటకు వెళ్తాడు. హర్షకు అనుమానం వచ్చి ఫాలో అవ్వాలి అనుకుంటాడు. విశ్వనాథం కాళీ దగ్గరకు వెళ్తాడు. డబ్బులు ఇవ్వలేదు అని కాళీ విశ్వనాథాన్ని తిడతాడు. డబ్బు ఇవ్వకపోతే సత్య కాపురం ముక్కలు చేస్తానని కాళీ అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.