అన్వేషించండి

 ‘సత్యభామ’ సీరియల్ :  భైరవికి షాక్‌ ఇచ్చిన మహదేవయ్య – క్రిష్‌ను రెచ్చగొట్టిన రుద్ర

Satyabhama Today Episode:  నామినేషన్‌ వేయడానికి ర్యాలీగా వెళ్తున్న మహదేవయ్య, తనతో భైరవిని రావొద్దని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Satyabhama  Serial Today Episode:  సత్య ప్లాన్‌ వర్కవుట్‌ అయిందని సంతకం చేయడానికి పది మంది దొరికేశారని క్రిష్‌ మనసులో అనుకుంటాడు. ఈరోజు ఎలాగైనా సంపంగితో ఎంజాయ్‌ చేయాలని మనసులో అనుకుంటాడు. ఇంతలో సత్య వచ్చి క్రిష్‌కు షాక్‌ ఇస్తుంది.

క్రిష్‌: ఈ సంతోషమంతా నాది కదా నేను కష్టపడ్డాను కదా అయితే ఒక్కడినే ఎంజాయ్ చేయాలి

సత్య:  నేను ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాను కదా..? ఈ ఎలక్షన్‌ అంతా అయిపోయే వరకు.. అందులో నాకు అందరూ సాయం చేసే వరకు మన మధ్య ఈ దూరం ఉండాలి.

 అని సత్య చెప్పగానే.. క్రిష్‌ డల్లు అయిపోతాడు. మౌనంగా అమాయకంగా చూస్తూ ఉండిపోతాడు. మరునాటి  ఉదయం అందరూ నిద్ర లేచి వెంటనే.. నామినేషన్స్ వేయడానికి మహదేవయ్య కుటుంబం రెడీ అవుతుంది.  మహదేవయ్యాను ఊరేగింపుగా  నామినేషన్స్ కు తీసుకెళ్లాలని రుద్ర ప్లాన్ చేస్తాడు. భైరవి వీర తిలకం దిద్ది హారతి ఇవ్వాలని అనుకుంటుంది.

మహదేవయ్య: భైరవి నువ్వు కాదు..  నాకు చిన్న కోడలు హారతి ఇస్తేనే విజయం సాధిస్తాను.

సత్య: ఇదే  మీ ఓటమికి తొలి అడుగు

అని మనసులో అనుకుంటూ  హారతి ఇచ్చి వీర తిలకం దిద్దుతుంది.

భైరవి: నీవల్ల నా పెనిమిటికీ హారతి కూడా ఇవ్వలేకపోయాను. నీవల్ల అందరి దృష్టిలో నేను శత్రువుని అయిపోయాను హారతి కూడా ఇవ్వలేకపోయాను.

 అని కోపంగా  భైరవి, సత్యను మనసులో తిట్టుకుంటుంది. ఇక మహదేవయ్యను ఊరేగిస్తూ బయటకు తీసుకెళ్తారు.

బైరవి: నీతోపాటి నీ పక్కన ఊరేగింపుకు నేను వస్తాను.

మహదేవయ్య: సత్యకు నామినేషన్స్ లో సంతకం చేయడానికి వెళుతూ నాతో ఎలా వస్తావు.

అంటూ మహదేవయ్య అనగానే భైరవి షాక్‌ అవుతుంది. తర్వాత మహదేవయ్యను చాలా గ్రాండ్‌ గా నామినేషన్ష్ వేయడానికి తీసుకెళ్తారు. నామినేషన్స్‌ వేసే ఆఫీసు దగ్గరకు రెండు ఫ్యామిలీలు చేరుకుంటాయి. సత్య ఫ్యామిలీని చూసిన భైరవి తన మాటలతలో వాళ్లను బాధపెడుతుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ మొదలవుతుంది. చిన్న  గొడవ  పెద్దగా మారుతుందని గమనించిన ఆఫీసర్లు వచ్చి మీలో మీరు గొడవలు పడితే మొత్తం ఎన్నికలనే ఆపేస్తామని వార్నింగ్‌ ఇస్తారు. దీంతో అందరూ సైలెంట్‌ అయిపోతారు. తర్వాత నరసింహ కోపంగా వెటకారంగా మహదేవయ్యను తిడుతుంటాడు.

నరసింహ: ఇంట్లో ఉన్న నీ కోడలే పోటీగా దిగుతుంది అంటే నువ్వు ఎలాంటి వాడివో జనాలకు తెలుస్తుంది నీ కోడలినే  ఉద్ధరించలేని వాడివి జనాలను  ఏం ఉద్దరిస్తావు.

సత్య: ఇది మా ఇంట్లో గొడవ మీకు అవసరం లేదు.

మహదేవయ్య: రేయ్‌ నరసింహం ఎక్కువ మాట్లాడుతున్నావు. క్రిష్‌ వాడి అంతు చూడు..

సత్య: క్రిష్‌ నువ్వు ఆగు… ఆవేశం వద్దు..

అంటూ సత్య ఆపడంతో క్రిష్‌ ఆగిపోతాడు. దీంతో రుద్ర కోపంగా క్రిష్‌ను చూస్తూ.. నీ పెళ్లాం చెప్పిందని ఆగిపోతావా..? బాపు మాట అంటే నీకు లెక్కలేదా.? అంటూ ఆవేశంతో ఊగిపోతుంటాడు. తన మాటలతో రుద్ర, క్రిష్‌ను రెచ్చగొట్టి నరసింహం మీదకు గొడవకు వెళ్లేలా చేయాలని మాట్లాడతాడు. అయినా క్రిష్‌ ఎక్కడా రెచ్చిపోకుండా సంయమనం పాటిస్తుంటాడు. ఇంతలో ఆఫీసర్లు వచ్చి నామినేషన్‌ పేపర్లు సబ్మిట్‌ చేయడానికి రండి అని పిలుస్తాడు. దీంతో అందరూ కలిసి నామినేషన్స్‌ వేయడానికి ఆఫీసు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లిన మహదేవయ్య సత్యను చూస్తూ నువ్వు నామినేషన్‌ వేయడానికి నీతో పది మంది లేరు కదా అంటాడు. ఒకసారి అటూ చూడండి మామయ్య అంటుంది సత్య. అందరూ అటు చూడగానే ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
Illu Illalu Pillalu Serial Today August 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!
Meghasandesam Serial Today August 8th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి షాక్‌ ఇచ్చిన చెర్రి – శారదకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేపీ
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి షాక్‌ ఇచ్చిన చెర్రి – శారదకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేపీ

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget