Satyabhama Serial Today February 2nd: సత్యభామ సీరియల్: సత్య నిశ్చితార్థం అడ్డుకున్న క్రిష్, లాగిపెట్టి కొట్టిన సంపంగి - నవ్వుకుంటున్నా కాళీ!
Satyabhama Serial Today Episode సత్య నిశ్చితార్థం జరుగుతుందని తెలుసుకున్న క్రిష్ అక్కడికి వచ్చి గొడవ పెట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode నిశ్చితార్థం కోసం మాధవ్ వేగంగా రెడీ అయిపోయి సత్యభామని చూడాలి అని ఆమె గది దగ్గర అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంతలో సంధ్య అక్కడికి వచ్చి ఇలా కాదు బావగారు అంటూ వాళ్ల అమ్మని పిలిచి అమ్మా బావగారికి కావల్సింది ఏదో లోపల ఉంది అంట అంటుంది. ఇక మాధవ్ తల్లి వచ్చి డోర్ తీస్తుంది. ఇక మాధవ్‌ని వెళ్లండి అంటూ సంధ్య గదిలోకి తోస్తుంది. మాధవ్ తల్లి ఏం కావాలిరా అని అడిగితే వాచ్ కనిపించడం లేదు అని మాధవ్ అంటాడు. మాధవ్ సత్యని చూసి ఫిదా అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు.
మాధవ్‌తల్లి: ఓరేయ్ మాధవ్ ఒకసారి చూసి చెప్తు సత్యని నువ్వు చెప్పినట్లే ముస్తాబు చేశాను కదా.. రేయ్ ఇక చూసింది చాలా దిష్టి తగులుతుంది ఇక వెళ్లు.. వెళ్లూ..
క్రిష్: సత్య ఇంటికి వచ్చి.. ఇదేంటిరా తాళం వేసి ఉంది.
బాబీ: ఒకవేళ వదినను తీసుకొని టూర్‌కి వెళ్లారేమో అన్న..
క్రిష్: నీ.. ఇప్పుడేమైనా దసరా టూర్ నడుస్తుందారా కాలేజ్ లేదు అని టూర్‌కి పోవడానికి.
బాబీ: అన్నా గుమ్మానికి మామిడి ఆకులు అవి వేశారు అంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది అన్న.
కాళీఫ్రెండ్: అన్నా ఇంటికి తాళం వేశారని పక్కింటి వాళ్లని అడిగితే సత్యకు నిశ్చితార్థం అని తెలిసిపోతుంది కదనే..
కాళీ: సత్యకు నిశ్చితార్థం అని వాడికి ఎవరో చెప్పడం ఎందుకురా మనమే చెప్పేద్దాం..
కాళీఫ్రెండ్: అలా అయితే నిశ్చితార్థం ఆపేస్తాడు కదనే..
కాళీ: అన్నా.. అన్నా.. అయిపోయింది అన్నా అంతా అయిపోయింది. అక్కడ వదినకు నిశ్చితార్థం అవుతుంది అన్న.
క్రిష్: రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా..
కాళీ: నేను చెప్పేది నిజం అన్న.
క్రిష్: ఇంత సడెన్‌గా నిశ్చితార్థం ఎలా పెట్టుకుంటారు.
కాళీ: ఇదంతా ఒక్క రోజులో జరిగిపోయింది అంట అన్న అమెరికా సంబంధం వచ్చిందని అందరు కలిసి వాడినే పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు అంట. వదిన ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఎంత చెప్పినా వాళ్ల నాన్న విషం తాగుతాను అని బెదిరించాడు అంట.
క్రిష్: చస్తా అంటే పెళ్లి చేసుకుంటుందా. నన్ను ప్రేమించింది కదరా.. తను త్యాగం చేసి వెళ్లిపోతే నేను చూస్తూ కూర్చొవాలా సత్య నాదే..
కాళీ: అంతా అయిపోయింది అన్న ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు.
క్రిష్: అసలు ఆ నిశ్చితార్థం జరగకుండా ఆపేస్తే.. పెళ్లి ఎలా జరుగుతుందిరా..
కాళీ: ఎట్లా ఆపుతావ్ అన్న వదిన ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వినదు. కన్నవాళ్ల కోసం నీ ప్రేమను ఎందుకు ఒప్పుకుంటుంది.
బాబీ: నిజం అన్న వదినకు అంత ధైర్యం లేదు కాబట్టే ఈ పెళ్లికి ఒప్పుకుంది. నువ్వు వెళ్లి అందర్ని రఫ్ ఆడించి వదిన నీ సొంతం అని అందరికీ అర్థమయ్యేలా చేస్తే నీ దగ్గరకు వస్తుంది.
క్రిష్: ఎక్కడ జరుగుతుందిరా నిశ్చితార్థం. పదండిరా వెళ్దాం.
కాళీ: మనసులో.. ఇప్పుడు వీడు అక్కడికి పోయి రచ్చ రచ్చ చేస్తాడు. అది చూసి సత్య వీడిని తిట్టి నువ్వేంటే నాకు అసహ్యం అని చెప్తుంది.
సత్య, మాధవ్‌లు పూజ చేస్తాయి. పెద్దవాళ్లు తాంబూళం మార్చుకునే టైంలో క్రిష్ అక్కడికి వస్తాడు. ఆపండి అని గట్టిగా అరుస్తాడు. సత్య క్రిష్‌ని చూసి షాక్ అయిపోతుంది. అందరూ షాక్ అవుతారు. క్రిష్ తాంబూళాలను నేలకు విసిరి కొడతాడు. అన్నీ విసిరేస్తాడు. సత్య చేయి పట్టుకొంటాడు. సత్య వదులించుకోవాలి అని ప్రయత్నించినా వదలడు.
క్రిష్: మాధవ్‌తో ఏందిరా ఇంకా ఇక్కడ నిల్చొని తమాషా చూస్తున్నావ్ నడు అంటూ తోసేస్తాడు. ఏందిరా అలా చూస్తున్నావ్.
మాధవ్: చూడు ఇక్కడ కాదు మన గొడవ ఏదైనా ఉంటే బయట చూసుకుందాం. ఇక్కడ మా నిశ్చితార్థం జరుగుతుంది. దయచేసి ఇబ్బంది పెట్టకు మర్యాదగా బయటకు పో.
క్రిష్: చల్ తీ.. నా ఊరు వచ్చి నా ముందే నిల్చొని నా కే మర్యాదలు నేర్పిస్తున్నావా..
హర్ష: రేయ్ ఇడియట్..
బాబీ: రేయ్ మా అన్న ఇప్పుడు లెక్కలు తేల్చుకోవడానికి వచ్చాడు. ఎవడైనా అడ్డం వచ్చాడో బొక్కలు ఇరుగుతాయ్.
శేఖర్: అరే విశ్వనాథం ఎవర్రా వీళ్లంతా ఏంట్రా ఈ గొడవ అంతా..
క్రిష్: నేను ఎవరో నా సంపంగికి తెలుసు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా నా సంపంగికి బాగా తెలుసు. నీ కొడుకును భద్రంగా సూట్‌కేస్‌లో పెట్టిస్తా.. నీ దేశం తీసుకపో.. నా ముందు వాడి నకరాలు మాత్రం నడవవ్ అని చెప్పు.
విశ్వనాథం: బాబు నువ్వు నా స్టూడెంట్‌వి అని మంచి కుర్రాడివి అని అనుకున్నాను. ఇలా ఇక్కడికి వచ్చి ఏంటి బాబు ఈ గొడవ. నువ్వు ఎందుకు వచ్చావో.. అసలు గొడవ ఎందుకు చేస్తున్నావో.. నా కూతురి నిశ్చితార్థం ఎందుకు చెడగొడుతున్నావో అసలు నాకేం అర్థం కావడం లేదు.
క్రిష్: మాస్టారూ.. నేను వచ్చింది నువ్వు పెట్టి బిర్యాని తినడానికి కాదు. నా సంపంగి మనసులో ఉన్నది నేను అని అందరికీ చెప్పి పోవడానికి వచ్చా.. నేను ఈ సత్య ప్రేమించుకున్నామని ఇక్కడ అందరికీ చెప్పడానికి వచ్చా.. నా సంపంగి వేలికి ఉంగరం తొడగాల్సింది ఈ క్రిష్ గాడు అని అనౌన్స్ చేయడానికి వచ్చా. ఆ మిల్క్ బాయ్ గాడు కాదని చెప్పడానికి వచ్చా. ఈ సత్యభామకు కాబోయే మొగుడు ఈ క్రిష్ణుడు. మన ప్రేమ సంగతి పెద్దొళ్లకి చెప్పమంటే పిచ్చిదాని లెక్క మిల్క్ బాయ్‌గాడికి రింగ్ తొడుగుతున్నావ్ నేను ఏమైపోవాలి.
ఇంత పిరికి దానికి అయితే ఎట్లా. నాకు ఒక్క మాట చెప్పాలి కదా.. చెప్పుంటే మీ పెద్దొళ్లతో మన లవ్ స్టోరీ చెప్పేవాడిని. మాస్టారూ మీకు కథ మొత్తం ఇప్పుడు క్లారీటీ వచ్చుంటుంది. పెళ్లి చేసేటప్పుడు కూతురి మనసు కూడా అడిగి తెలుసుకోవాలి కదా. ఇట్లా తొందర పడితే ఎట్లా.. సరే కానీ జరిగిందేంటో జరిగిపోయింది. ఇప్పుడు ఇదే ముహూర్తానికి సంపంగితో నాకు నిశ్చితార్థం చేస్తానంటే నేను రెడీ.. అక్కడ నా సంపంగి కూడా రెడీ.
మాధవ్‌తల్లి: వాడు ఎవడో వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మీరు ఎవరూ మాట్లాడరేంటి వదినా.. ఇదంతా మీకు ముందే తెలుసా దాచి పెట్టి ఎంగేజ్ మెంట్ చేస్తున్నారా.
విశాలాక్షి: అలాంటిది ఏం లేదు వదినా అతను ఎవరో మాకు కూడా తెలీదు.
మాధవ్‌తల్లి: ఆ మాట సత్యకు చెప్పమని చెప్పండి.
విశ్వనాథం: ఇంత గొడవ జరుగుతున్నా మౌనంగా ఉన్నాంవేటి అమ్మా ఆ మౌనానికి అర్థమేంటి అమ్మ. ఇది మన పరువు పోయే పరిస్థితి అమ్మా. నిజం ఏంటో అబద్ధం ఏంటో నోరు తెరిచి గట్టిగా చెప్పు తల్లి.
మాధవ్: సత్య నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. వాడు చెప్పింది అబద్ధం అని ఒక్కమాట చెప్పు చాలు.
కాళీ: మనసులో.. ఇది కాదా నేను ఆశించిన సీన్. మస్త్ మజా వస్తుంది.
క్రిష్: చెప్పు సంపంగి మనం ప్రేమించుకున్నాం అన్న సంగతి ఇక్కడ అందరికీ చెప్పు.
సత్య: ఏడుస్తూ క్రిష్‌ని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. క్రిష్ బాబీ షాక్ అయిపోతారు. కాళీ నవ్వు కుంటాడు. నా మనసులో ఏముందో అర్థమైందా ఇంకా క్లారిటీగా చెప్పమంటావా. నాన్న వీడు ఎవడో నాకు తెలీదు. వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. వీడిని అప్పుడెప్పుడో జాతరలో రౌడీయిజం చేస్తుంటే చూశాను. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే నా ముందు నిలబడ్డాడు. సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. వీడు చేసే పని వల్ల ఓ ఆడపిల్ల జీవితం ఏమవుతుందా అని కూడా తెలీకుండా మాట్లాడుతున్నాడు.
ఒక ఆడపిల్ల మనసు ఎంత గాయపడుతుందో అని తెలీకుండా మాట్లాడుతున్నాడు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది అని తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. రౌడీలా రోడ్డున పడి తిరిగే వాడు. అసలు నీలాంటి వాడిని చూడటం అంటేనే నాకు అసహ్యం. అలాంటిది నువ్వు నా మనసులో ఉండటం ఏంటి. నేనే కాదు మనసు ఉన్న ఏ ఆడపిల్లా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోదు. గెట్ అవుట్.. చెప్తుంది నీకేరా అర్థం కావడం లేదా.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. వినపడుతుందా.. నీకేరా చెప్పేది వెళ్లరా ఇడియట్.. సత్య కొట్టడానికి చేయి ఎత్తితే సత్య చేయి క్రిష్ పట్టుకుంటాడు.
క్రిష్: ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ ఎవరు మాట్లాడమని చెప్పారు. ఎవరు నీ మనసుని మార్చారు. చెప్పు సత్య. నీ నోటి నుంచి వచ్చే ఈ మాటలు నీవి కావు మనసు చంపుకొని మాట్లాడుతున్నావ్ అవునా..
సత్య: చేయి వదులు.. నీకేమైనా పిచ్చా.
క్రిష్: అవును నువ్వు అంటే పిచ్చి. మొదటి చూపులోనే నిన్ను ఇష్టపడినా. నా ప్రేమను చెప్పుకుందామని వెంటపడినా. నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావ్ కదా..
సత్య: నేను ఇష్టపడ్డానా..
క్రిష్: ఒక్కసారి కాదు మస్త్ సార్లు.
సత్య: అబద్ధం చెప్పకు.
క్రిష్: నేను కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావ్. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: దలపతి విజయ్ నెట్ వర్త్: కళ్లు చెదిరే బంగళా, లగ్జరీ కార్లు, దళపతి విజయ్ ఆస్తుల విలువెంతో తెలుసా?