అన్వేషించండి

Satyabhama Serial Today February 12th - సత్యభామ సీరియల్: క్రిష్ ఇంటికి వెళ్లి అందరితో చెడుగుడు ఆడేసుకున్న సత్య, మహదేవయ్య కోపానికి బలికానుందా!

Satyabhama Serial Today Episode సత్య క్రిష్ ఇంటికి వెళ్లి క్రిష్ తనని తన కుటుంబాన్ని వేధిస్తున్నాడు అని అందరి ముందు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: హర్ష తన తండ్రితో క్రిష్‌కి భయపడొద్దని కంప్లైంట్ ఇవ్వమని చెప్తాడు. దీంతో క్రిష్‌ గన్ తీసుకొని హర్షమీదకు వెళ్తాడు. విశ్వనాథం క్రిష్‌ని బతిమిలాడుతాడు. కంప్లైంట్ ఇవ్వను అని తన కొడుకు మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవద్దని వేడుకుంటాడు. 

క్రిష్: నేను రాక్షసుడిని కాదు మాస్టారు నేను ఎవరి జోలికి రాను. కానీ నా జోలికి వస్తే ఊరుకోను నీ కొడుకు విషయంలోనే కాదు. అది నీ కూతురి విషయంలో కూడా.. కానిస్టేబుల్ నేను కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నా. మాస్టారూ పిల్లలకి అర్థమయ్యేలా పాఠాలు చెప్పడమే కాదు మీ కూతురు మనసు కూడా అర్థం చేసుకోండి. నా ప్రేమను కూడా అర్థం చేసుకోండి. ప్రేమించుకున్నోళ్లని ఒకటి చేయండి. 
శాంతమ్మ: ఎవరి దిష్టి తగిలిందో ఈ ఇంట్లో సంతోషం అనేదే లేకుండా పోయింది. ఏదో శాపం శనిలా చుట్టుకుంది. 
విశాలాక్షి: నాన్న గారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చాలా సేపు అయింది. అక్కడ ఏం జరిగుతుందో ఏంటో ఒకసారి ఫోన్ చేయ్ సత్య.
సత్య: చేశానమ్మ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అన్నయ్యా.. 
విశాలాక్షి: వచ్చావా నాన్న.. నువ్వు ఏ తప్పు చేయలేదు. నిన్ను వదిలేస్తారు అని మాకు తెలుసు.. ఏమైంది హర్ష ఎందుకు అంత కోపంగా ఉన్నావ్. పోలీస్‌స్టేషన్‌లో ఏం జరిగింది. 
హర్ష: నాతో పాటు నాన్న కూడా వచ్చారు కదా ఆయన్ను అడగండి ఏం జరిగిందో చెప్తారు.
సత్య: ఏమైంది నాన్న అన్నయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నాడు.
విశ్వనాథం: వాడిని నిర్దోశి అని పోలీసులు వదిలేయలేదు. నేనే ఆ రౌడీలను బతిమాలుకొని ఇక మీ జోలికి రాము అని నచ్చచెప్పి కంప్లైంట్ వెనక్కి తీసుకొనేలా చేసి హర్షని తీసుకొచ్చాను. అది వాడి కోపం. హర్ష నీది ఉడుకు రక్తం. ఆవేశంలో నువ్వు అలా ఆలోచిస్తున్నావురా. ఇప్పటికే మనకు దెబ్బమీద దెబ్బ తగులుతుంది. హర్ష నీ అంత తెలివి నాకు ఉండకపోవచ్చు కానీ అనుభవం ఉంది. నా బాధని అర్థం చేసుకోరా ప్లీజ్. మనం స్టేషన్‌కి వెళ్లే సరికి ఆ రౌడీ ఎస్‌ఐ సీటులో  కూర్చొన్నాడు అంటే వాడి పవర్ ఏంటో అర్థం చేసుకోరా. వాడిని మనం ఏం చేయలేంరా.. 
హర్ష: మనం ఇలాగే ఉంటే వాడు ఇంకా ఇంకా రెచ్చిపోతాడు నాన్న. అప్పుడేం చేస్తాం. నా బాధ కూడా అర్థం చేసుకోండి.
సత్య: అన్నయ్య ఆత్మాభిమానంతో బతికే అమ్మాయికి సమస్యలు వస్తాయి అని ఇలాంటి సమస్యలు వస్తాయి అనుకోలేదు అన్నయ్య. సమస్య వస్తే ఎదురిస్తా అనుకున్నాను కానీ నా కుటుంబానికే నా వల్ల సమస్య వస్తుంది అనుకోలేదు అన్నయ్య. ఇంత జరుగుతుంది అని ఊహిస్తే ఆ రౌడీ చేసినవన్నీ నేను ముందే నాన్నకి చెప్పేదాన్ని. జరిగినదాని అంతటికీ కారణం నేనే. నువ్వు నాన్న మీద కొప్పడకు అన్నయ్య నా కారణంగా ఇంట్లో దూరాలు పెరుగుతాయి అని భయంగా ఉంది.
హర్ష: సత్య నాన్న మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది. అన్నయ్య అయి ఉండి చెల్లికి ఏవిధంగా అండగా నిలబడలేకపోతున్నా అని బాధ పడుతున్నాను అంతే. 
సత్య: అన్నయ్య దయచేసి నా గురించి నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు.
హర్ష: నీ విషయంలో కూడా ఆ క్రిష్‌గాడు రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడు. కన్నవాళ్లు కొడుకుని బాధ్యతగా పెంచకపోతే అది ఆ ఇంటికే కాదు ఈ సమాజానికే ప్రమాదం. ఆ సంగతి ఆ క్రిష్ గాడి కన్నవాళ్లకి తెలీదా తెలిసి కూడా ఊరుకుంటున్నారా. అసలు ఆ కుటుంబానిది నీతి జాతి లేని కుటుంబం అయి ఉంటుంది. ఎవరో ఒకరు పూనుకొని వాడికి, వాడి కుటుంబానికి బుద్ధి చెప్పకపోతే మన సమస్య పెరుగుతూనే ఉంటుంది సత్య. 

సత్య: క్రిష్ ఇంటికి వచ్చి.. ఎక్కడ నీ కొడుకు.
రుద్ర: ఏయ్ ఎవరు నువ్వు ఏం కావాలి.
సత్య: అచ్చు వేసిన ఆంబోతులా నీ తమ్ముడిని వదిలేశారు కదా వాడిగురించే అడుగుతున్నాను ఎక్కడ వాడు.
మహదేవయ్య: చూడు ఈ మహదేవయ్య ఇంట్లో అడుగుపెట్టాక గొంతులో భయం ఉండాలి. గొంతులో వణుకు ఉండాలి. ఈ రెండింటిలో ఏది తక్కువ అయినా..
సత్య: తక్కువ అయితే..
భైరవి: ఇక్కడి నుంచి భయటకు వెళ్లేది నీ శవమే. 
సత్య: క్లాప్స్ కొడుతూ.. చాలా బాగుంది  మీ అబ్బాయి అంత మూర్ఖుడిగా ఎలా ఉన్నాడా అనుకున్నాను. మీ ఇంట్లో అందరూ ఇలా ఉండే వాడు ఇంకెలా ఉంటాడు. 
భైరవి: ఏయ్ ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు గురించి ఇలా మాట్లాడుతున్నావు. 
నందిని: ఏయ్ మా అన్నయ్య గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.
సత్య: మరి ఎవరికి ఇక్కడ ఉంది. మనుషులను చంపే వీళ్లకా.. లేక పొగరు తప్ప మర్యాద తెలియని నీకా..
నందిని: ఏయ్ ఆరోజు గుడి కాబట్టి నిన్ను వదిలేశా.. ఇది నా ఇళ్లు ఇక్కడ నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నువ్వు అన్న ఆ పొగరే చూపించాల్సి వస్తుంది. 
సత్య: చావుకి భయపడేదాన్నే అయితే ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు.
క్రిష్‌: నందిని ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు తను సత్య.
నందిని: ఏదో హోం మినిస్టర్ అన్నట్లు అలా చెప్తావ్ ఏంటి అన్న. అదేం వాగుతుందో నీకు తెలుసా.
క్రిష్: అది ఇది అని మాట్లాడుతావేంటే మర్యాద ఇచ్చి మాట్లాడు తను నేను ప్రేమించిన అమ్మాయి. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. 
రుద్ర: చిన్నా ఏం మాట్లాడుతున్నావ్‌రా నువ్వు.
క్రిష్: అవును అన్నా నేనే టైం చూసి చెప్పాలి అనుకున్నా కానీ తనే నేరుగా వచ్చేసింది కాబట్టి.. అందరికీ చెప్తున్నా నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. 
నందిని: దొరక్కదొరక్క నీకు ఇదే దొరికిందా.. దీనికి పొగరు ఎక్కువ. ఇది నాకు వదినగా వద్దు.
క్రిష్: నువ్వేం అనుకోకు సత్య.. మా చెల్లి చాలా మంచిది. అయినా నువ్వేంటి ఇంత సర్‌పైజ్ ఇచ్చావ్. అయినా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా.. రా మా బాపుకీ పరిచయం చేస్తా..
సత్య: చేయి వదిలించుకుంటూ.. నేను ఇక్కడికి వచ్చింది పరామర్శించడానికి కాదు. నీ సంగతి తేల్చడానికి.. 
నందిని: హలో ఈ వరంగల్‌లో మా అన్నని ఎదురించేవాడే లేడు. అలాంటిది నువ్వు ఆడదానివి. నువ్వేం చేయగలవు. 
సత్య: ఎదురించాల్సి వస్తే నువ్వు ఆడదాన్ని అని ఆగిపోతావ్ ఏమో నేను ఎదిరించి తీరుతా..
క్రిష్‌: ఏయ్ ఏంటి సత్య ఇది మొదటి సారి మా ఇంటికి వచ్చావ్. ఇప్పుడు ఇదంతా ఎందుకు. 
సత్య: బాపూ ఎలా అయ్యాడు దేశం కోసం పోరాడిన మహాత్మానా.. రౌడీనే కదా.. నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావ్ కానీ నా ఫ్యామిలీ గురించి గానీ నా వాళ్ల పరువు గురించి అయినా ఒక్కసారి ఆలోచించావా. అసలు నా వాళ్లని ఏం చేయాలి అనుకుంటున్నావ్.
క్రిష్‌:సత్య నీ వాళ్లే మొదట నామీద కంప్లైంట్ పెట్టారు. 
సత్య: ఎందుకు అలా చేశారు. నువ్వు నా జీవితంలోకి వచ్చి నన్ను టార్చర్‌ చేశావనే కదా.. నీ పాటికి నువ్వు ఇష్టపడితే నేను తలవంచి తాళి కట్టించుకోవాలా. నీ లాంటి వాడిని నేనే కాదు ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. ఇక సత్య ఇంకా మాట్లాడుతుంటే మహాదేవయ్య చాలు ఆపమ్మా అంటూ అరుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'నాగ పంచమి' సీరియల్ ఫిబ్రవరి 12th: పంచమి నిర్ణయంతో ఫుల్ ఖుషీలో మోక్ష.. రగిలిపోతున్న వైదేహి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Embed widget