అన్వేషించండి

Satyabhama Serial Today April 12th: సత్యభామ సీరియల్: క్రిష్ తప్పు లేదని తల్లిదండ్రులతో చెప్పిన సత్య.. అత్తింట్లో చలాకీగా మారిపోయిన సంపంగి!

Satyabhama Serial Today Episode సత్య ఇంట్లో వాళ్ల అందరి పనులు చేసి అందరి కోసం వంట చేసి దగ్గరుండి వడ్డించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode సత్య తన తండ్రికి కాల్ చేసి తాను అత్తింట్లో ఆనందంగా ఉన్నాను అని చెప్తుంది. అత్తారింట్లో అడుగుపెడుతున్నప్పుడు సమస్యల వలయం అనుకున్నాను అని ఇప్పుడు తెలుస్తుంది ఎంత అదృష్టవంతురాలిని అనుకుంటుంది. ఇంటి నిండా పనివాళ్లు అని అత్త తనకి కాలు కింద పెట్టనివ్వడం లేదని అంటుంది. ఇక మామ కూడా ఏమీ అనరు అని చెప్తుంది.  

విశ్వనాథం: మరి అల్లుడుగారు అమ్మ.
సత్య: ఆయనకు నా మీద మామూలు ప్రేమకాదు. రాక్షస ప్రేమ.
విశాలాక్షి: అంటే..
సత్య: తట్టుకోలేని ప్రేమ. అంటే ఒక్క నిమిషం వదిలిపెట్టరు అనుకో ఎప్పుడూ వెనకే ఉంటారు. మా అమ్మనాన్నలతో మాట్లాడుకుంటా కాసేపు వదిలేయండి మహా ప్రభు అని 
అడిగి బలవంతంగా వదిలించుకొని వచ్చాను. ( క్రిష్ సత్య మాటలు వింటుంటాడు)
విశాలాక్షి: మరి పెళ్లికి ముందు ఎందుకు రౌడీలా నిన్ను వేధించుకు తిన్నాడు. ఎందుకు గోడల మీద రాశాడు. 
సత్య: అయ్యో అమ్మ అదంతా ఓ పీడ కల. పైగా అదంతా చేసింది మీ అల్లుడు కాదు. కాళీ అని ఓ రౌడీ ఉన్నాడు కదా. మీ అల్లుడు పేరు చెప్పి వాడు చేశాడు ఈ దౌర్జన్యాలు అన్నీ. (క్రిష్ షాక్ అవుతాడు. సత్య తనని అర్థం చేసుకుంది అనుకొని హ్యాపీగా ఫీలవుతాడు.)
విశ్వనాథం: నిజమేనా సత్య.
సత్య: నిజమే నాన్న నేను ముందు నమ్మలేదు అనుమానించాను. పాపం మీ అల్లుడు అమాయకుడు. మీరు ఇక నా గురించి ఎక్కువ ఆలోచించకండి నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. ఉంటాను.. నాన్న ఒక్క నిమిషం మీ అల్లుడు పిలుస్తున్నారు..
క్రిష్: అబ్బబ్బబా.. ఏమి యాక్టింగ్‌రా బాబు..
విశాలాక్షి: హమ్మాయ్య..
క్రిష్: క్లాప్స్ కొడుతూ.. అబ్బబ్బబా.. మహానటి.. మహానటి.. యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. నేను అబద్ధాల కోరుని అన్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి. నీ దగ్గర సమాధానం లేదు అందుకే పారిపోతున్నావ్. నెత్తి దించుకుంటున్నావ్. అది కాదు సంపంగి మీ వాళ్లతో నీ ప్రాబ్లమ్ ఓపెన్‌గా చెప్పొచ్చు కదా దాచుకోవడం ఎందుకు. 
సత్య: అలా చెప్పుకొనే పరిస్థితే ఉంటే ఇలా ఈ పంజరంలో వచ్చి చిక్కుకునే దాన్ని కాదు. నేను ఏం చేసినా మా అమ్మానాన్నల సంతోషం కోసమే చేశాను. 
క్రిష్: ఏదైతే ఏమైంది కానీ నాకు అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. నీ విషయంలో నేను ఏ తప్పు చేయలేదు  ఆ కాళీ గాడు చేశాడని నమ్మావు.. 
సత్య: నేను ఒప్పుకోలేదు. 
క్రిష్: ఒప్పుకున్నావ్. మీ ఇంట్లో వాళ్లకి చెప్పావ్. కానీ ఏమాటకు ఆ మాట సంపంగి. నువ్వు నా గురించి మీ వాళ్లతో చెప్పినప్పుడు ఏమని పించిందో తెలుసా.. నా మనసులోకి తొంగి చూసినట్లు.. నా మనసులో ఏముందో అదే యాజటీజ్ అదే చెప్పావ్..

సత్య చెప్పింది నిజం కాదు అని విశ్వనాథం అంటాడు. సత్య నిజంగానే సంతోషంగా ఉండి ఉంటే అల్లుడిని తీసుకొని వచ్చేదని.. ఎప్పుడో కాల్ చేసి మాట్లాడేది అని అంటాడు. తాము ఎక్కడ టెన్షన్ పడతామో అని కాల్ చేసిందని అంటాడు. ఇక విశాలాక్షి సత్య దగ్గరికి వెళ్దామని అడుగుతుంది.  దీంతో విశ్వనాథం వద్దు అనేస్తాడు.

భైరవి: సత్య, క్రిష్‌ల ఫొటో ఫోన్‌లో చూస్తూ.. ఎందుకురా తొందర పడ్డావ్. నువ్వు సంతోషంగా లేవు మాకు సంతోషం లేదు. నీకు సుఖం లేదు మాకు సుఖం. లేదు. ముళ్ల కంపను తెచ్చి ఇంటిలో తెచ్చి పెట్టావ్ కదరా.. అసలు ఎందుకురా నవ్వుతున్నావ్‌రా..
పంకజం: ఎవరితో మాట్లాడుతున్నారమ్మా.. 

ఇక పంకజం బట్టలు ఉతకడానికి అడిగితే భైరవి గదిలో పెట్టాను కదా ఉతికి ఆరేశావు కదా అంటుంది. దానికి పంకజం నేనా అని షాక్ అయిపోతుంది. ఇంతలో సత్య వచ్చి నేను ఉతికి ఆరేశాను అని చెప్తుంది. ఇక నుంచి రోజూ నేనే చేస్తా అని చెప్తుంది. 

భైరవి: కాకా పడుతున్నావే..
సత్య: లేదు కోడలిగా నా కర్తవ్యం నెరవేరుస్తా.. అత్తయ్య ఈ పూట వంట ఏం చేయాలి.
పంకజం: తిన్నట్లే..
భైరవి: నువ్వు వడ్డించడం చూసుకో వంట గురించి మర్చిపో.
సత్య: పెద్ద లిస్ట్ చెప్పి ఇవి చాలా ఇంకా చేయాలా..
క్రిష్: వామ్మో ఇదేంటిరా సత్య కొత్తగా కనిపిస్తుంది. స్పీడ్ పెంచింది. గేరు మార్చింది. ఇదేంటిది..
భైరవి: పొద్దున్నే జోకులు వేస్తున్నావా.. 
సత్య: అయ్యో మీతో జోకులా గంటలో వంట చేస్తా..
భైరవి: నాన్ వెజ్ తినని దానివి ఎట్లా వండుతావ్.. ఎట్లా నమ్మాలి.

మీరే చూస్తారు కదా అని సత్య వెళ్తుంది. ఇక పంకజం మొగుడ్ని కొంగుకు చుట్టుకుంది. మిమల్ని కంట్రోల్‌లో పెట్టాలి అనుకుంటుంది అని భైరవికి పనామె చెప్తుంది. ఇక సత్య ఎందుకు కొత్తగా ప్రవర్తిస్తుంది అని భైవరి అనుకుంటుంది. 

ఇక సత్య తన అక్క వంట చేస్తుంటే పక్కకు తప్పుకోమని చెప్తుంది. రోజూలా కాకుండా ఈ రోజు హుషారుగా ఉన్నావని ఎప్పుడూ ఇలాగే ఉండు అని రేణుక సత్యతో అంటుంది. ఇక ఇద్దరు అక్కాచెల్లెలు కబుర్లు చెప్పుకొని వంట చేస్తారు. ఇక రేణుక క్రిష్‌ని ఇష్టపడి చేసుకున్నావా.. లేక బలవంతంగా చేసుకున్నావా అని అడుగుతుంది. సత్య, రేణులకు సరదాగా నవ్వుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకు మనస్శాంతి లేకుండా చేస్తానన్న నర్శింహ.. కార్తీక్‌ ఇంట్లో జడ్జిగా మారిన వంటలక్క!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 20th: నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 20th:రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ
నువ్వులేక నేను లేను: రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ
Karthika Deepam 2 Serial Today July 20th: కార్తీకదీపం 2 సీరియల్: దీప, జ్యోత్స్నల గెలుపు.. మర్చిపోలేని రోజు! ఈ ప్రేమలు శాశ్వతం అవుతాయా!
కార్తీకదీపం 2 సీరియల్: దీప, జ్యోత్స్నల గెలుపు.. మర్చిపోలేని రోజు! ఈ ప్రేమలు శాశ్వతం అవుతాయా!
Nindu Noorella Saavasam Serial Today July 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుకు హోమ భస్మం పెట్టిన భాగీ – అడ్డుకోబోయిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుకు హోమ భస్మం పెట్టిన భాగీ – అడ్డుకోబోయిన మనోహరి  

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget