Satyabhama Serial Today November 23rd: సత్యభామ సీరియల్: క్రిష్ తన కొడుకంటూ మహదేవయ్య ఇంటికి వచ్చి రచ్చ చేసిన గంగ.. కొడుకు కోసం ధర్మా!
Satyabhama Today Episode మహదేవయ్య ఇంటికి గంగ వచ్చి క్రిష్ తన బిడ్డ అని మహదేవయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో వాళ్లతో చెప్పి రచ్చ రచ్చ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode భైరవి, క్రిష్ ఆరు బయట ఉంటారు. నీళ్ల బాటిల్ భైరవి దగ్గర ఉంటే క్రిష్ నీరు అడిగితే భైరవి నేను ఇవ్వను నీ పెళ్లానికి అడుగు అని అంటుంది. నీ చేతిలో ఉంది కాబట్టి అడిగా అమ్మా అని క్రిష్ అంటే అన్నింటికీ నీకు నీ పెళ్లాం కావాలి.. నీ పెళ్లాన్ని బయటకు తీసుకెళ్తావ్.. ఆరు బయట మంచం వేసి గోరు ముద్దలు తినిపించి కాళ్లు నొక్కుతావ్ ఇప్పుడు మాత్రం నేను నీరు ఇవ్వాలా అని అంటుంది. అన్నీ సేవలు నువ్వు నీ పెళ్లానికి చేస్తావ్ కదా నీళ్ల బాటిల్ ఇవ్వదా అంటాడు.
క్రిష్: చాలా పెట్టుకున్నావ్ అమ్మ నెత్తిలో ఇలా అయితే నెత్తి నొప్పి వస్తుంది. ఏమైంది అమ్మ నేను ఏం తప్పు చేశాను. ఏమైందో చెప్పమ్మా.
భైరవి: అప్పుడప్పుడు బాధ అనిపిస్తుందిరా. కొడుకులకు దూరంగా ఉంటున్నానేమో అని. పెద్దొడు జైలులో కూర్చొన్నాడు. అసలు వాడు ఉన్నాడని మర్చిపోయాం. ఇక నువ్వు అయితే ఉంటే నీ పెళ్లాం వెనక ఉంటావ్. లేదంటే మీ బాపు వెనక ఉంటావ్.
పంకజం: అబ్బా తల్లీకొడుకుల్ని ఇలా ఒక్క దగ్గర చూసి ఎన్ని దినాలు అయిందో.
భైరవి: అదిగో చూశావా దానికి కూడా అర్థమైంది.
క్రిష్: నువ్వు ఇప్పుడే రావాలా సత్య లేదా.
భైరవి: అదిగో చూశావా ఊ అంటే సత్య ఆ అంటే సత్య. మనం పనికి రామ్. నువ్వు ఆ కాఫీ ఇచ్చి పో.
ఇంతలో గంగ ఆటో దిగి ఎంట్రీ ఇస్తుంది. రౌడీలు నువ్వు ఎవరు అని అడిగితే మీ పెద్దాయనకి చెప్పు ఆయన నెత్తి ఎక్కి ఆడటానికి గంగ వచ్చిందని అంటుంది. ఇక మేడ మీద ఉన్న సత్య గంగని చూసి అక్కడే ఉన్న క్రిష్‌ని చూపించి సైగ చేస్తుంది. దాంతో గంగ బాబు బాబు అని క్రిష్ దగ్గరకు పరుగులు తీసి నాటకం షురూ చేస్తుంది.
గంగ: నువ్వు నా రక్తానివే కదా నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డవే కదా. తెలిసిపోతుందిరా. ఇలా ఎదురుగా నొల్చొంటే నా ఒళ్లు పులకరించిపోతుంది. నిన్ను చూస్తుంటే నా బిడ్డ అని తెలిసిపోతుంది. కృష్ణ.. కృష్ణ
క్రిష్: అమ్మా చూడమ్మా.
భైరవి: ఏయ్ నా బిడ్డకు దూరంగా ఉండు. అసలు నువ్వు ఎవరు.
గంగ: నీ పెనిమిటిని అడుగు నీ గురించి నాకు చెప్పాడు భైరవి. నా దగ్గరకు వచ్చినప్పుడు.
భైరవి: అసలు నా పెనిమిటి నీ దగ్గరకు ఎందుకు వచ్చాడు.
గంగ: అవసరం ఉండి వచ్చాడు.
భైరవి: పెనిమిటి పెనిమిటి త్వరగా బయటకు రా. మన చిన్నా గాడిని పట్టుకొని నా కొడుకు నా కొడుకు అని పట్టుకొని వదలడం లేదు.
గంగ: బాబు నేను మీ అమ్మని నన్ను గుర్తు పట్టడం లేదా. చూడండి మన అబ్బాయిని ముద్దు చేస్తున్నా.
భైరవి: ఆయన్ని మన అబ్బాయి అంటావేంటి.
గంగ: క్రిష్‌కి నేను అమ్మని అయితే ఆయన నాన్న కదా అలాంటప్పుడు ఆయన్ని నేను ఏమనాలి
భైరవి: అవ్వా నువ్వు అమ్మ అయితే మరి నేను ఎవరినే.
సత్య వచ్చి ఎవరు మీరు అని అడిగితే క్రిష్ నా కొడుకు అని సత్యని కోడలు అని అందరినీ వరసలు పెట్టి పిలుస్తుంది. మహదేవయ్య శివుడి అని భైరవి పార్వతి అని నేను గంగని ఈయన నెత్తి మీద ఉంటానని అంటుంది. ఇక బంటి అని ఓ పెద్ద అబ్బాయిని చూపించి వాడు మా బిడ్డ అని అంటాడు. బంటి మెడలో తిండి వస్తువులు వేసుకొని తింటూ ఉంటాడు. గంగ మహదేవయ్య భర్త అని అనడంతో అందరూ షాక్ అయిపోతారు. నేను నీ రెండో పెళ్లాన్నని చెప్పమని అంటుంది. సత్య కూడా మామయ్యకి రెండో పెళ్లా అని నటిస్తుంది. మహదేవయ్య ఎవరు నువ్వు అని అరుస్తాడు. దాంతో గంగ ముద్దు చేసినన్నినాళ్లు ముద్దు చేసి ఈ లడ్డూ గాడిని నా చేతిలో పెట్టి ఇప్పుడు పొమ్మాంటావా అని ఏడ్చినట్లు నటించి గోల గోల చేస్తుంది.
పాతికేళ్ల క్రితం తాను క్రిష్‌ని కన్నానని అప్పుడు భైరవి కూడా బిడ్డని కన్నానని భైరవి బిడ్డ పురిటిలో చనిపోతే నా మొగుడికి డబ్బు ఆశ చూపి నా బిడ్డ అయిన క్రిష్‌ని తీసుకెళ్లిపోయాడని అంటుంది. నువ్వు చెప్పింది నిజమేనా అని భైరవి ఏడుస్తుంది. ఇక తన భర్త చనిపోతే నా బిడ్డని నాకు ఇవ్వమని మహదేవయ్యని అడిగితే నేను ఉండగా నువ్వు అనాథవి ఎందుకు అవుతావని నా మెడలో తాళి కట్టారని చూపిస్తుంది. ఇక మహదేవయ్యకి తనకి పుట్టిన బిడ్డే బంటు అని చెప్తుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావ్ అని సత్య అడిగితే నా పెద్ద కొడుకు నాకు కావాలి నాతో తీసుకొని పోతా అని అంటుంది. నా కొడుకుని తీసుకెళ్తానని అంటుందని భైరవి ఏడుస్తుంది. మహదేవయ్య ఇద్దరినీ బయటకు తీసుకెళ్లమంటే పంకజం గంగని ఇద్దరు రౌడీలు బంటుని లాక్కెత్తారు. బయటకు నెట్టేస్తారు. దాంతో గంగ బయట కూర్చొని గోల గోల చేస్తుంది. నా కొడుకుని తీసుకెళ్ల వరకు నీ ఇంటి ముందు ధర్నా చేస్తానని అంటుంది. భైరవి ఆడవాళ్లు అందరినీ ఓ దగ్గరకు చేర్చి జయమ్మతో నీ కొడుకుకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అత్తమ్మా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.