Satyabhama Serial Today January 8th: సత్యభామ సీరియల్: కౌంట్ నెం 2.. సత్యకి కొండంత అండ.. మామ మీద మాట పడనివ్వని సత్యకి క్రిష్ ఫిదా!
Satyabhama Today Episode సత్యని నర్శింహ సపోర్ట్ చేస్తా అనడం సత్య మాస్ వార్నింగ్ ఇవ్వడంతో క్రిష్ ఇంప్రెస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode సత్య, నందిని తొమ్మిది మంది కోసం తిరుగుతూ ఉంటారు. ఎవరూ మహదేవయ్యని కాదని తనకు సాయం చేయను అని చెప్తారు. ఇక సత్య దగ్గరకు నర్శింహ వచ్చి 9 మంది కాదు వంద మందితో సంతకం పెట్టిస్తాను అని అంటాడు. సత్య అవసరం లేదని అంటుంది. క్రిష్ కొంచెం దూరం నుంచి ఇద్దరి మాటలు వింటాడు.
నర్శింహ: మహదేవయ్య నాకు చిరకాల శత్రువు. మామ కోడళ్లు పోటీ పడుతుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది అందుకే నిన్ను బరిలోకి దింపాలి అనుకుంటున్నా.
సత్య: నేను ఎలక్షన్‌లో పోటీ చేస్తున్నా అంత మాత్రానా మా మామయ్య నాకు శత్రువు కాదు. మా మామయ్యని ఓడించడానికి ఆయన శత్రువుతో చేతులు కలిపే అంత కుసంస్కారం నాకు లేదు. మా మామయ్యని ఓడించలేక దొంగ దెబ్బ తీయడానికి నాతో చేతులు కలపడానికి వచ్చారు అంత తెలుసుకోలేనా. మా మామయ్యకు నాకు ఉంది సిద్ధాంతాల వైరమే తప్ప వ్యక్తిగతంగా వైరం కాదు. ఈ సారి ఎమ్మెల్యే అయ్యేది మహదేవయ్య ఇంటి నుంచి ఒకరు.
నర్శింహ: చూడు మీ మామయ్య నిన్ను ఎదగనివ్వడు. నేను మీ మామయ్యని ఎదగనివ్వను. నాతో చేతులు కలుపు నీకు ఏం కావాలన్నా చేసి పెడతాను. కావాలంటే నెస్ట్ ఎలక్షన్‌లో నిన్ను ఎమ్మెల్యేని చేస్తా.
సత్య: దమ్ముంటే ఇప్పుడు గెలువు తర్వాత సంగతి తర్వాత చూద్దాం.
నర్శింహ: మీ మామయ్య మీద జాలి పడకు అమ్మ వాడు ఒట్టి మోసగాడు. నామినేషన్ వరకు వెళ్తే నిన్ను అస్సలు బతకనివ్వడు.
సత్య: ఇంకొక్క మాట మా మామయ్య గురించి మాట్లాడితే నీకు మర్యాద ఉండదు. నువ్వు ఎంత ప్రయత్నించినా మా ఫ్యామిలీని విడదీయలేవు. మమల్ని విడదీసి బాగు పడాలి అని వెర్రి ఆశలు పెట్టుకోకు. పద వదిన.
నర్శింహ: చూస్తాను ఏదో ఒక రోజు నువ్వే నా దారికి వస్తావ్.
సత్య: పెద్ద ప్లానే వేశాడు కదా. క్రిష్‌ని చూసి ఏంటి ఇలా వచ్చావ్.
నందిని: నువ్వు ఇంట్లో లేకపోతే బోర్ కొట్టిందని అనుకుంటా.
క్రిష్: నేను వచ్చింది మిమల్ని ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్లడానికి. నర్శింహ గాడికి మంచి దమ్కీ ఇచ్చావ్ అస్సలు ఊహించలే. సపోర్ట్ దొరక్క టెన్షన్ పడుతున్నావ్ కదా వాడితో చేతులు కలుపుతావ్ అనుకున్నా.
సత్య: నా క్యారెక్టర్ నీకు తెలీదా.
క్రిష్: పరిస్థితులు బట్టీ మారిపోతారు కదా.
సత్య: అలా మారితే దాన్ని క్యారెక్టర్ అనరు. నేను స్వార్థం కోసం పోటీ చేయడం లేదు ఒక సిద్ధాంతం కోసం పోటీ చేస్తున్నా
క్రిష్: తెలుసు అంతా విన్నా నీ మీద గౌరవం పెరిగింది
నందిని: అయితే పార్టీ మారుతున్నావా మా వదినకు సపోర్ట్ చేస్తున్నావా. అడుగు వదిన.
సత్య: నాకు అడిగితే వచ్చే సపోర్ట్ వద్దు నాకు గట్టి నమ్మకం ఉంది నేను అడిగితే మీ అన్నయ్య కాదు అనరు. కానీ నాకు నా ఇష్టం ఉన్నట్లే తనకు తన ఇష్టం ఉంటుంది కదా అడిగి ఇబ్బంది పెట్టను.
నందిని: చూశావా అది మా వదిన అంటే నిన్ను మా వదినలా ఎవరూ అర్థం చేసుకోరు మీ బాపు కూడా. కానీ నువ్వే వదినను అర్థం చేసుకోవడం లేదు. వదిన నీ బాడీ గార్డ్ వచ్చాడు కదా ఇక ఇంటికి వెళ్లు మన దండయాత్ర రేపు షురూ చేద్దాం.
రాత్రి సంధ్య ఫోన్ చూసుకుంటూ మైమరిచిపోతుంది. ఇంతలో హర్ష వస్తాడు. సంధ్యని పిలుస్తాడు. అయినా సంధ్య కళ్లు మూసుకొని ఉంటే హర్ష ఫోన్ లాక్కుంటుంది. ఇక సంధ్యని నందిని గురించి అడిగితే నందిని అక్కతో వెళ్లిందని అక్కలా మొండిలా తయారువుతుందని అమ్మ బాధపడుతుందని వదినకు గట్టిగా చెప్పు అంటుంది. నందిని సైలెంట్ అయితే తన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అనుకుంటుంది. అన్నావదినలకు సంధ్య గొడవ పెడుతుంది. హర్ష నందినిని ప్రశ్నిస్తాడు. నీకు సపోర్ట్ చేసే దమ్ములేదు నాకు చేయనివ్వవు అని గొడవ పెడుతుంది. వదిన వెంటే ఉండి తీరుతా అని తేల్చేస్తుంది.
మరోవైపు సత్య, క్రిష్ ఇంటికి వస్తారు. సత్య క్రిష్‌తో ముందు క్రిష్‌ని వెళ్లమని చెప్తుంది. తనతో వస్తే అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుందని నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను అంటుంది. నిన్నూ అందరూ ప్రశ్నిస్తారు అని క్రిష్ అంటే నేను ఎవరితో గొడవ పెట్టుకోనని మాటిస్తుంది. క్రిష్ లోపలికి వెళ్తాడు. మహదేవయ్య రుద్రతో చిన్నాకి నామినేషన్ పనులు చెప్పాను వాడు పట్టించుకోకపోతే నువ్వు కూడా చూసుకో అంటాడు. క్రిష్ తన బాధ్యత మర్చిపోనని అంటాడు. ఇక రుద్ర సత్యని చూసి భైరవితో అమ్మా కాబోయే ఎమ్మెల్యే వచ్చింది వచ్చి హారతి ఇవ్వు అని అంటాడు. భైరవి బయటకు వస్తుంది. అందరూ సత్యని అవమానిస్తాడు. క్రిష్‌కి ఇచ్చిన మాట కోసం సత్య ఎవరికీ ఏ సమాధానం చెప్పకుండా అలాగే వింటూ ఉండిపోతుంది. భైరవి ఇంట్లో వాళ్లతో నందిని తప్ప దీనికి ఇంకెవరైనా సపోర్ట్ చేస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా అంటుంది.
ఇంతలో జయమ్మ చెప్పు పట్టుకొని వచ్చి నీ చెప్పే కొట్టుకో అనిఅంటుంది. భైరవి ఏమైందని అడిగితే నేను సత్యకి సపోర్ట్ చేస్తున్నా అని అంటుంది. మహదేవయ్యతో పాటు అందరూ షాక్ అయిపోతాడు. సత్య ఎమోషనల్ అయి బామ్మని హగ్ చేసుకొని మీ కొడుకుని కాదని నన్ను సపోర్ట్ చేస్తున్నారు అని ఏడుస్తుంది. ఇక జయమ్మ సత్యని ఎందుకు హింసిస్తున్నారని కోప్పడుతుంది. ఎదురు చెప్పకుండా ఎందుకు భరిస్తున్నావని సత్యని అంటే వాళ్లు నాకు ఎంతో ఇష్టమైన క్రిష్ కన్నవాళ్లని వాళ్లని నేను దూరం చేసుకోలేని అంతా నా వాల్లే అంటుంది. మా అమ్మ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను ఎవరూ మా అమ్మని ఎదురించడానికి లేదని అంటాడు. తంటాలు పడితే కేవలం ఇద్దరు మాత్రమే దొరికారు అని మహదేవయ్య సత్యతో అంటాడు. దానికి సత్య కేవలం రెండే కాదు ఒకరు మీకు జన్మనిచ్చిన వాళ్లు ఒకరు మీరు జన్మనిచ్చిన వాళ్లు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: అద్దంలో త్రినేత్రి ఆత్మ.. మనవరాలు చనిపోయిందని గుండె పగిలేలా ఏడుస్తున్న బామ్మ!