Satyabhama Serial Today January 27th: సత్యభామ సీరియల్: సంధ్య ఫోన్ కాల్ వినేసిన సత్య.. సంజయ్‌కి వార్నింగ్.. కోడలికి ఉచ్చు బిగించిన మామ!
Satyabhama Today Episode సంధ్య, సంజయ్‌ల ప్రేమ గురించి తెలుసుకున్న సత్య సంజయ్‌కి వార్నింగ్ ఇవ్వడం మహదేవయ్య సంజయ్‌ని రెచ్చగొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య గురించి టీవీలో చూపిస్తారు. ఒక్క సంఘటనతో ఒంటరిగా ఉన్న సత్య మామకు గట్టి పోటీ ఇస్తుందని చెప్తారు. మహదేవయ్య, రుద్రలు టీవీలో చూసి రగిలిపోతూ ఉంటారు. ఇంతలో పార్టీ ఇన్‌ఛార్జీ మహదేవయ్యకు కాల్ చేసి నువ్వు ఓడిపోతే నేను అధిష్టానానికి సమాధానం చెప్పుకోవాలి. అంటే మహదేవయ్య గెలిచేది తానే అని చెప్తాడు. సత్య గట్టి పోటీ ఇచ్చేలా ఉందని అంటే ఎమ్మెల్యే నేనే అవుతా నమ్మకం ఉంచమని అంటాడు.
మహదేవయ్య కోపంతో అందరూ సత్య పేరే జపిస్తున్నారని కష్టంగా ఉందని మహదేవయ్య రుద్రతో అంటాడు. ఇక క్రిష్ సత్య దగ్గరకు వెళ్లి బొమ్మని పట్టుకొని ఇన్‌డైరెక్ట్‌గా సత్యతో భలే ప్లాన్ చేశావ్ చిట్టీ రౌడీలను చితక్కొట్టడం వీడియో వైరల్ చేయడం సూపర్ ఐడియా అంటాడు. దాంతో సత్య క్రిష్‌తో తనకు అంత అవసరం లేదని చెప్తుంది. క్రిష్ ముద్దు అడిగితే కొన్ని క్రిష్‌ని కళ్లు మూసుకోమని నోటిలో చాక్లెట్ పెడుతుంది. ఇక విశ్వనాథం సంధ్యకి ఓ సంబంధం తీసుకొస్తాడు. ఇంటిళ్లపాది చూసి అబ్బాయి చాలా బాగున్నాడు పెళ్లి ఫిక్స్ చేయమని అంటారు. ఇంతలో నందిని సంధ్యని పిలిచి అబ్బాయిని చూడమని అంటుంది. సంధ్యకి విషయం తెలిసి షాక్ అయిపోతుంది.
పెళ్లి కొడుకు ఫొటో చూడమని అంటే పెళ్లి ఇప్పుడే వద్దని ఫొటో అక్కడ పెట్టేస్తుంది. మంచి సంబంధం అని విశ్వనాథం అంటే నాకు వద్దని అంటుంది. దాంతో రేపే పెళ్లి చూపులకు వస్తారని విశ్వనాథం అంటే నా ఇష్టాఇష్టాలతో మీకు సంబంధం లేదా అని అడుగుతుంది. రేపు పెళ్లి చూపులు వద్దని చెప్తుంది. మాట ఇచ్చేశా వెనక్కి తగ్గితే బాగోదని విశ్వనాథం అంటే సంధ్య కోపంగా వెళ్లిపోతుంది. దాని మొండి తనం ఏంటని శాంతమ్మ అంటే నేను చూసుకుంటానని విశాలాక్షి అంటుంది.
సంధ్య గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని సంజయ్‌కి కాల్ చేస్తుంది. సత్య గది ఎదురుగా సంజయ్ తన ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేయడంతో సత్య కాల్ రావడం చూస్తుంది. చాలా సార్లు ఫోన్ రావడంతో వెళ్లి చూస్తుంది. సంధ్య అని ఉండటంతో ఏ సంధ్య అనుకొని తన చెల్లి ఏమో అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. దాంతో సంధ్య తనకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని అబ్బాయి బాగుంటే పెళ్లి చేసేస్తారని మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలని అంటుంది. నేను సంజయ్‌ని కాదు సత్యని అని సత్య అనగానే సంధ్య భయంతో కాల్ కట్ చేసేస్తుంది.
సంజయ: సత్యతో తెలిసిపోయిందా.
సత్య: సంజయ్ టీ షర్ట్ పట్టుకొని ఎందుకు నా చెల్లి జోలికి వెళ్లావ్.
సంజయ్: ఏయ్ ఎందుకు వదిలేశావ్ పట్టుకో.
సత్య: నోర్ముయ్. ఎందుకు నా చెల్లి జోలికి వెళ్లావ్.
సంజయ్: నువ్వే అందుకు కారణం మగాడిని అని కూడా చూడకుండా నా చెంప పగలగొట్టావ్ నా ఇగో హర్ట్ అయింది అందుకే నీ చెల్లిని ట్రాప్ చేశా. ఎస్ ట్రాపే చేశా. అక్కడితో ఆగను వదిలిపెట్టను తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాను. నాకు కావాల్సింది సంధ్య కాదు నువ్వు. సంధ్యని సాధిస్తే నువ్వు ఏడుస్తావ్ అందుకే అటు నుంచి నరుక్కొచ్చా. చేతనైతే సంధ్యని కాపాడుకో.
సత్య: ఏయ్ ఇడియట్ నేను ఉంటే సంధ్య నీడని కూడా తాకలేవ్.
సంజయ్: నీడ కాదు ఇప్పటికే దాని ఒడిలో పడుకొని చాలా చేశా. చాలా మాయమాటలు చెప్పాను. సంధ్య నన్ను కలలో కూడా మర్చిపోదు. ఇప్పుడు నా చేతి తోలుబొమ్మ. ఇప్పుడు నిన్ను చంపేయ్ మంటే ఎందుకు అని అడగకుండా చంపేస్తుంది. ఇప్పుడు నా ప్రేమలో పీకలవరకు ఉంది. నేను పెళ్లి చేసుకుంటా తర్వాత మోసం చేస్తా. నీ కళ్ల ముందే టార్చర్ చేస్తా.
సత్య: అసలు ఆ పెళ్లి జరిగితే కదా.
సంజయ్: నీకు చేతనైతే ఆపి చూడు.
సంజయ్ మాటలు మహదేవయ్య వినేస్తాడు. ఎదురుగా వచ్చి వినేశానురా మొత్తం వినేశా అని నవ్వుతాడు. మగాడు ఇలాగే ఉండాలని సంజయ్‌ని ఇంకా రెచ్చగొడతాడు. పెళ్లి చేసుకుంటా అనడం బాగుంది నా ఓటు నీకే అని అంటాడు. మా బిగ్ డాడ్ మన పెళ్లికి ఒప్పుకున్నాడు కానీ మీ అక్క ఎలక్షన్‌లో పోటీ చేయకూడదని కండీషన్ పెట్టారని చెప్పమని అంటాడు. దాంతో సంజయ్ సరే అంటాడు. ఉచ్చు బిగించానని పోటీ నుంచి తప్పుకుంటావని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపని కాపాడమని చేతులు చాచి సాయం అడిగిన కాంచనను అవమానించిన తండ్రి..!





















