Satyabhama Serial Today February 6th: సత్యభామ సీరియల్: అందరిముందు అక్కని ఛీ కొట్టిన సంధ్య.. చేయని తప్పునకు వెక్కి వెక్కి ఏడుస్తున్న సత్య!
Satyabhama Today Episode సత్య సంధ్య ఫస్ట్ నైట్ చీర కాల్చేసిందని భైరవి ఇంట్లో రచ్చ చేయడం చేయని తప్పునకు అందరూ సత్యని నిందించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode భైరవి సంధ్యకి ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేస్తానని సత్య ఆపేస్తుందని పని మనిషి పంకజంతో చెప్తుంది. సంధ్యని అడ్డు పెట్టుకొని సత్యని ఓ ఆట ఆడుకుంటానని భైరవి అంటుంది. మరోవైపు సత్య ఇంటిళ్లపాది సంధ్య వైపు ఉన్నారు. సంధ్యకి ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటుంది. ఇంతలో భైరవి చీర, స్వీట్స్, పళ్లు తీసుకొని సత్య దగ్గరకు వచ్చి ఈరోజు రాత్రి మన ఇంట్లో సందడి ఉంది కదా సాయం చేయొచ్చు కదా అంటుంది. పళ్లెం సత్యకి ఇచ్చి ఫస్ట్‌నైట్ గదిలో పెట్టమని అంటుంది.
సంధ్య కూడా అక్కడికి వచ్చి పిలిచారంట అని అడుగుతుంది. భైరవి సంధ్యకి చీర ఇచ్చి ఇది మా అత్తయ్య నా కోసం కొన్నారు. నాకు నచ్చింది ఇప్పుడు నీకు ఇస్తా ఓకేనా అంటుంది. సంధ్య మహా ప్రసాదంలా ఫీలైపోతుంది. ఇక చీర నలిగిందని ఇస్త్రీ చేయమని సత్యకి చెప్తుంది. సత్య చీర పట్టుకెళ్లి ఐరన్ బాక్స్ దగ్గర పెట్టి పళ్లెం ఫస్ట్ నైట్ గదిలో పెట్టడానికి వెళ్తుంటే భైరవి చీర మీద వేడి ఐరన్ బాక్స్ పెడుతుంది. ఇక సత్య గదిలోకి వెళ్లే సరికి క్రిష్ బెడ్ సర్దుతూ సత్య వెంట పడుతుంది. క్రిష్ సత్యతో కాసేపు మనం ఫస్ట్ నైట్ చేసుకునే అమ్మాయి అబ్బాయిలా మారిపోదాం అంటే సత్య తాను అబ్బాయి అని క్రిష్‌ని అమ్మాయిలా నటించమని అంటుంది. క్రిష్ సిగ్గు పడుతూ సత్య దగ్గరకు రావడంతో సత్య క్రిష్‌ని పట్టుకొని కొరికేస్తాను నిన్ను మొత్తం కొరికేస్తాను అని అంటుంది. ఇద్దరూ చక్కగా నవ్వుకుంటారు. సత్య నవ్వు చూసిన క్రిష్ నువ్వు నీలాఉంటేనే బాగుంటుంది సత్య. ఏం మిస్ అవుతున్నావ్ తెలుసా అని అడుగుతాడు.
ఇంతలో రేణుక చీర కాలిపోవడం చూసి కాలిపోతుంది కాలిపోతుంది అని అరుస్తుంది. దాంతో భైరవి నా చీర నా చీర అని అరుస్తుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. ఆ చీర అంటే నాకు ఇష్టం అది ఇదీ అని భైరవి అంటుంది. సంధ్య కోపంగా సత్యని చూస్తుంది. సత్య కావాలనే కాల్చేసిందని భైరవి అంటుంది. సత్య అలా చేయదు అని రేణుక అంటే నీకు ఇష్టమైన తోటికోడలు కాబట్టి సపోర్ట్ చేస్తావని అంటుంది. నేనేం చేయలేదు అని సత్య ఏడుస్తుంది. సంధ్య పెళ్లి జరగడం సత్యకి ఇష్టం లేదని శోభనం జరగడం కూడా ఇష్టం లేదని అందుకే ఇలా చేసిందని భైరవి అంటుంది. సంధ్య కూడా అవును నేను ఇంటికి రావడం అక్కకి ఇష్టం లేదు అని అంటుంది. తన మనసు నిందా ద్వేషం నిండిపోయిందని అంటుంది. దాంతో సత్య ఏడుస్తుంది. ఒక చీర కోసం ఇంత పంచాయితీ అవసరమా అని క్రిష్ అడుగుతాడు. దాంతో ఇది నాకు ఇష్టమైన చీరరా ఎప్పుడూ పెళ్లాన్ని సపోర్ట్ చేయడం కాదు అప్పుడప్పుడు నిలదీయాలని అంటుంది. సత్య సంధ్యతో నువ్వు ఈ ఇంటి కోడలిగా రావడం నాకు ఇష్టం లేదు కానీ ఈ చీర కాలిపోవడంతో నాకు సంబంధం లేదు ప్రమాణం చేసి చెప్తున్నా అంటుంది. దాంతో సంధ్య ఈ ఇంట్లో నీ వల్ల మాత్రమే నాకు ప్రమాదం ఉందనీ సత్య ముఖం మీద ఛీ కొట్టి వెళ్లిపోతుంది. సత్య చాలా ఏడుస్తుంది.
సంధ్య సంజయ్‌తో మా అక్కని ఇలా మొదటి సారి చూస్తున్నా నీ మీద ఇంత కక్ష కట్టింది. ఎప్పుడైనా ఏమైనా అన్నావా అంటే దానికి సంజయ్ శ్రీరామ చంద్రుడిలా ప్రవర్తిస్తాడు. ఏదో ఒకరోజు నువ్వు కూడా సత్య మాటలు నమ్మేసి నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అని సంజయ్ అంటాడు. సంజయ్ సంధ్యకి ముద్దు అడుగుతాడు. ఇంతలో భైరవి వస్తుంది. ఏం జరుగుతుందిరా ఇక్కడ అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి ప్రమాదం.. ప్రాణాలకు తెగించి కాపాడిన త్రిపుర.. గాయత్రీ మీద నింద!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

