అన్వేషించండి

Satyabhama Serial Today February 14th: సత్యభామ సీరియల్: సత్య, క్రిష్‌ల మధ్య చిచ్చుపెట్టిన నర్శింహ చావు.. ఇక ఎప్పటికీ ప్రేమికులు కలవనట్లే!!

Satyabhama Today Episode క్రిష్ నర్శింహకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత రుద్ర నర్శింహని చంపడం సత్య క్రిష్‌ని అపార్థం చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode మహదేవయ్య, రుద్రల నాటకం తెలియని క్రిష్ నర్శింహని చంపడానికి బయల్దేరుతాడు. సత్య ఎంత చెప్పినా వినడు. ఆవేశంగా వెళ్తాడు. క్రిష్ చాకు తీసుకొస్తే సత్య తీసుకొని నువ్వు నర్శింహని చంపడానికి వెళ్లడానికి వీళ్లేదని అంటుంది. 

రుద్ర: ఈ ఇంట్లో మగాడు బయటకు వెళ్తే అడ్డుకోవడం ఆడవాళ్ల పని కాదు. హారతి ఇచ్చి పంపాలి  అంతే.
సత్య: సరే అయితే అక్క హారతి తీసుకొని రా ఈ కత్తి సంజయ్ చేతిలో పెడతా సంజయ్‌కి హారతి ఇచ్చి పంపుదాం. నర్శింహని చంపి వస్తాడు. 
సంధ్య: సంజయ్‌కి ఏంటి సంబంధం ఎందుకు సంజయ్‌ని ఇన్వాల్స్ చేస్తావ్ అక్క.
సత్య: సంజయ్ కూడా తన కొడుకు లాంటి వాడే అని మామయ్య చెప్పారు కదా. నిన్ను ఈ ఇంటి కోడలిగా చూస్తున్నారు కదా. అత్తయ్య ఇచ్చిన నగలు కులుక్కుంటూ తీసుకున్నప్పుడు సంజయ్ వెళ్తే ఏంటి. 
భైరవి: వాడికి దీనికి సంబంధం ఏంటే.
సత్య: సంబంధం ఏంటో నీకు మామయ్య చెప్పలేదా. క్రిష్‌ ఎగ్జిట్ పోల్స్ నాకు అనుకూలంగా రావడంతో ఈ నాటకాలు ఆడుతున్నారు.
మహదేవయ్య: ఓరేయ్ చిన్నా ఆత్మాభిమానం తర్వాతే ఈ మహదేవయ్యకు ఏమైనా అందుకే నువ్వు వెళ్తుంటే ఆపడం లేదు. సత్య నీకు ఏవేవో చెప్తుంది. నిన్ను ఆపాలని. నువ్వు వెళ్లకురా ఆ కత్తి వదిలేయ్. పోయి ఒంటి చేత్తోనే ఆ నర్శింహని చంపేస్తా.
క్రిష్: బాపు నేను బతికుండగానే నీకు కత్తి పట్టే అవసరం రానివ్వను. ఆ నర్శింహని చంపేస్తా.
సత్య: మనిషిని చంపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు.

నాకు కూడా ఇంట్లో ఇష్టం లేని వారు ఉన్నారు వాళ్లని చంపేస్తా ఈ కత్తి నా దగ్గర ఉండినీ అని సత్య అంటే క్రిష్ ఒప్పుకోడు. దాంతో సత్య నీకు ఓ న్యాయం నాకో న్యాయమా అని అడుగుతుంది. క్రిష్ సత్య చేతిలో కత్తి తీసుకొని వెళ్లిపోతాడు. సత్య ఎంత బతిమాలినా తన ప్రేమ చూపించిన ఎంత చెప్పినా క్రిష్ సత్య మాట వినకుండా వెళ్లిపోతాడు. సత్య కింద కూర్చొని ఏడుస్తుంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ రిజల్స్ చూసిన నర్శింహ మహదేవయ్య ఓడిపోతున్నాడనే సంతోషంతో తాగుతూ ఉంటాడు. ఇంతలో క్రిష్ అక్కడికి వెళ్లి నర్శింహ రౌడీలను కొట్టి నర్శింహని కొడతాడు. నర్శింహని పొడవడానికి కత్తి తీసి సత్య మాటలు గుర్తు చేసుకొని ఆగిపోతాడు. సత్య నన్ను ఆపిందని లేదంటే నీ ప్రాణాలు పోయావని నీకు నా సత్య ప్రాణ భిక్ష పెట్టిందని అంటాడు. పారిపో అని వార్నింగ్ ఇచ్చి క్రిష్ వెళ్లిపోతాడు. సత్య మాటలు తలచుకొని ఇంటికి వెళ్లి పోతాడు. ఇంతలో రుద్ర వచ్చి నర్శింహని చంపేస్తాడు. 

ఇంటి దగ్గర అందరూ చాలా టెన్షన్ పడుతుంటారు. ఇంతలో టీవీలో నర్శింహని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని ఎన్నికలు రద్దు అయ్యావని వస్తుంది. దాంతో అందరూ క్రిష్ నర్శింహని చంపేశాడని అనుకుంటాడు. ఇక క్రిష్ ఇంటికి వస్తూ చేతికి రక్తపు మరక లేకపోవడంతో సత్య తనని ముద్దులతో ముంచేస్తుందని మారిపోయిన భర్తని పొగుడుతుందని అనుకొని లోపలికి వెళ్తాడు. క్రిష్‌ని చూసి మహదేవయ్య, భైరవిలు పొగిడేస్తారు. నర్శింహని చంపి పరువు నిలబెట్టావని అంటారు. ఇక క్రిష్ టీవీలో నర్శింహ చావు గురించి తెలుసుకొని షాక్ అయిపోతాడు.

సత్య కోపంగా అక్కడిని నుంచి వెళ్లిపోతుంటే క్రిష్ సత్యని ఆపి నేను నర్శింహని చంపలేదని బెదిరించాను అంతే అంటాడు. నీ బెదిరింపుకే చనిపోయాడా అని రుద్ర అంటాడు. దాం తో అందరూ నవ్వుతారు. క్రిష్ అందరి మీద అరిచి నేనేం చేయలేదని అరుస్తాడు. సత్య వెళ్లిపోతుంటే నన్ను నమ్ము సత్య అని ఏడుస్తాడు. చంపాలని కత్తి పెట్టా కానీ నీ మాటలు గుర్తొచ్చి ఆగిపోయాను నేను మారిపోయాను సత్య అని చెప్తాడు. అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలని సత్య అంటుంది. నా దృష్టిలో నువ్వు పది రెట్లు కిందకి పడిపోయావ్ అని అబద్ధం చెప్పి ఇంకా దిగజారిపోయావని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది కదా కావాల్సింది.. కావేరిని చిన్నమ్మా అని పిలిచిన కార్తీక్.. ఏకాకైపోయిన శ్రీధర్!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Embed widget