Satyabhama Serial Today February 13th: సత్యభామ సీరియల్: సత్యని దెబ్బ తీయడానికి నర్శింహని మహదేవయ్య బలి తీసుకుంటాడా.. క్రిష్‌ని రెచ్చగొట్టాడుగా!
Satyabhama Today Episode మహదేవయ్య సత్యని దెబ్బతీయడానికి క్రిష్ చేత నర్శింహని చంపించాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య చెల్లి మాటలు, మహదేవయ్య మాటలు తలచుకొని బాధపడుతుంది. తర్వాత అనాథాశ్రమం బామ్మకి కాల్ చేస్తుంది. ఎలక్షన్‌లో పోటీ చేయలేను ఎన్నికల్లో తప్పుకుంటున్నాను క్షమించండి అని ఏడుస్తుంది. దాంతో బామ్మ దేవుడు కూడా మమల్ని వదిలేస్తే నువ్వు మాత్రం అండగా నిలిచావు ఇప్పుడు నువ్వు కూడా దూరంగా వెళ్లిపోతావా.. సరేలే తల్లి మా రాత ఇంతే అనుకుంటాం.. అప్పడు ఒక్కరు చనిపోయారు ఇప్పుడు 20 మంది చనిపోతాం అంతే అని అంటుంది. సత్య బామ్మ మాటలకు చాలా ఏడుస్తుంది.
క్రిష్ సంజయ్ దగ్గరకు వెళ్లి ఇంటి సమస్యలు సత్య పరిస్థితి అన్నీ నీకు తెలిసి కూడా ఇలాంటి పనులు ఏంటి అని అడుగుతాడు. దాంతో సంజయ్ పెళ్లి టైంలో సంధ్య ఎలా మొండితనం చేసిందో ఫస్ట్‌నైట్ విషయంలో కూడా మొండితనం చేసిందని అంటాడు. సంధ్య చిన్న పిల్ల ఇప్పుడు పూర్తిగా నీ కంట్రోల్‌లో ఉంది నువ్వు అడ్డుకోవాలని క్రిష్ అంటాడు. సంధ్యని చూసుకుంటా అది నా ప్రోపర్టీ అని సంజయ్ అంటే సంధ్యకి నేను కేర్ టేకర్‌ని సంధ్యని నువ్వు పువుల్లో పెట్టుకొని చూసుకోవాలి లేదంటే నేను ముళ్లులా మారాల్సి వస్తుందని అంటాడు.
మహదేవయ్య: ఎలక్షన్లో నుంచి విత్ డ్రా అవుతున్నావా లేదా నీకు ఇచ్చిన టైం అయిపోయింది.
సత్య: ఒక్క నిమిషం.. హలో సురేఖా నేను రిలీజ్ చేసిన వీడియో చూశావా షాక్ అవుతారు అని తెలుసు.
మహదేవయ్య: నన్ను ఎర్రోడిని అనుకుంటున్నావా ఏంటి ఆ ఫోన్లు నేను అడుగుతుంటే.
సత్య: ఒక్క నిమిషం రాగిణి నేను నా నిర్ణయం తీసుకున్నా. నిమిషానికి ఒకసారి ఏం నిర్ణయం తీసుకున్నావని వెంట పడ్డావ్ ఊపిరి ఆడనివల్లేదు అందుకే నా నిర్ణయం తీసుకొని వీడియో రిలీజ్ చేశా.
సత్య ఓ వీడియోని రిలీజ్ చేస్తుంది. ప్రజర్ వల్ల ఓ నిర్ణయం తీసుకున్నాను వెనక్కి తగ్గుతున్నాను అని అంటే మహదేవయ్య ఎలక్షన్‌లో తప్పుకుంటుందని అనుకుంటాడు. కానీ ఎలక్షన్‌లో తగ్గేదేలేదని ఎమ్మెల్యేగా గెలిస్తే మొదటి సారి వృద్థాశ్రమం సమస్య తొలగిస్తానని అంటుంది. అది చూసి మహదేవయ్య షాక్ అయిపోతాడు. నాకు నా చెల్లి కావాలి ఎమ్మెల్యే పదవి కావాలి అని సత్య అంటుంది. రెండింటినీ మీ నుంచి రక్షించుకుంటా అని మామకే సవాలు విసురుతుంది.
రాత్రి మహదేవయ్య వీడియోలు చూసుకుంటూ నవ్వుతుంటే సీరియస్‌గా రుద్ర వచ్చి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ వచ్చాయని నీ చిన్న కోడలు గెలుపు ఒన్ సైడ్ అని వచ్చిందని అంటాడు. మహదేవయ్య పేపర్లు చూసి షాక్ అయిపోతాడు. కోపంతో పేపర్లు చింపేస్తాడు. దాంతో మహదేవయ్య ఎలక్షన్‌ని ఆపడానికి ఎవరో ఒకర్ని చంపాలని అనుకొని నర్శింహని చంపాలని అప్పుడే ఎలక్షన్ ఆగుతుందని అంటాడు. క్రిష్‌తో చంపిస్తే ఎలక్షన్ ఆగిపోతుంది.. సత్య క్రిష్ మధ్య గొడవలు వస్తాయని అంటాడు. అందుకు తగ్గట్టు ఉదయం మహదేవయ్య రుద్రలు చేతికి తలకు కట్లు కట్టుకొని యాక్టింగ్ మొదలు పెడతారు. ఇంటిళ్ల పాది వాళ్లని చూసి కంగారు పడతారు. క్రిష్ ఏమైందని అడిగితే యాక్సిడెంట్ చెప్పి క్రిష్కి అనుమానం వచ్చినట్లు చేస్తారు. దెబ్బలు చూస్తే ఎవరో కొట్టినట్లు ఉందని క్రిష్ అంటే నర్శింహ మనుషులు కొట్టారని రుద్ర చెప్తాడు. క్రిష్, సంజయ్ ఇద్దరూ కోపంతో రగిలిపోతాయి. క్రిష్ నర్శింహ చాప్టర్ ముగిసిపోయిందని చంపేస్తా అని అంటాడు. సత్య అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. రుద్రతో మీకు మీ నాన్న అంటే పౌరుషం లేదా మీరు ఎందుకు ఏం చేయలేదు అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: కోడలికి విషం ఇస్తే కొడుకు నొప్పులు పడుతున్నాడేంటి? విజయాంబికకు ఇది షాకే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

