అన్వేషించండి

Sankranthiki Vasthunam TRP Rating: టీవీలోనూ సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్స్... టీఆర్పీలో దుమ్ము దులిపిన విక్టరీ వెంకటేష్

Sankranthiki Vastunnam world television premiere TRP: థియేటర్లలో, ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసిన 'సంక్రాంతికి వాస్తున్నాం' సినిమా టీవీ టీఆర్పీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది.

సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ వసూళ్ల సాధించింది. థియేటర్లలో 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.‌ ఆ తర్వాత ఓటీటీలలోనూ ఈ సినిమాకు రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు టీవీలోనూ దుమ్ము దులిపిందీ సినిమా.

జీ తెలుగులో 'సంక్రాంతికి వస్తున్నాం'కి రికార్డు టీఆర్పీ
మార్చి ఒకటవ తేదీ సాయంత్రం 'జీ తెలుగు' ఛానల్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రీమియర్ షో వేశారు. అదే రోజు జీ5‌ ఓటీటీలో డిజిటల్ రిలీజ్ కూడా చేశారు. రెండో రోజుకు ఓటీటీలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు టీవీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. 

అర్బన్ ఏరియాలలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 15.92 టీఆర్పీ నమోదు చేసింది. ఇది ఒక రికార్డ్. జీ తెలుగు ఛానల్ టీవీ టీఆర్పీ హిస్టరీలో సెకండ్ హైయెస్ట్ అని చెప్పాలి. ఐదేళ్ల క్రితం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాకు 19 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత 15 ప్లస్ టీఆర్పీ సాధించిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' కావడం గమనార్హం.

Also Read'కోర్టు చూడండి... నచ్చకపోతే నా 'హిట్ 3' చూడటం మానేయండి' అని నాని చెప్పారు. మరి, కోర్టు ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

థియేటర్లలో సూపర్ రెస్పాన్స్... ఎవరూ ఊహించలేదు!
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు థియేటర్లలో సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించింది. మూడు వందల కోట్లకు పైగా వసూళ్ల సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒక వైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్',‌‌‌ మరొక వైపు నట సింహం నందమూరి బాలకృష్ణ 'డాకు ‌మహారాజ్' సంక్రాంతికి విడుదల కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు వస్తారా? రారా? అనే సందేహాలు ట్రేడ్ వర్గాలలో వ్యక్తం అయ్యాయి. అనూహ్యంగా ఆ రెండు సినిమాలను మించి ఈ సినిమా కలెక్షన్స్ సాధించింది. 

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను అగ్ర నిర్మాత 'దిల్' రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు. ఇందులో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు. వినోదంతో భారీ విజయం సాధించింది.‌ ఈ సినిమాకు భీమ్స్ అందించిన మ్యూజిక్ ప్లస్ అయింది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Embed widget