రీతూ చౌదరి ప్రస్తుతం 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 చూడటం లేదు. వరుస చిత్రీకరణలలో బిజీగా ఉండటం వల్ల షో చూడలేకపోతున్నానని ఆమె చెప్పారు.
Rithu Chowdary: 'బిగ్ బాస్' చూడట్లేదు... ఈసారి విష్ణుప్రియతో జోడీగా - రీతూ చౌదరి సెన్సేషనల్ కామెంట్స్
Rithu Chowdary On Bigg Boss: బిగ్ బాస్ తెలుగు 9లో సందడి చేసిన అందాల భామల్లో రీతూ చౌదరి ఒకరు. అయితే... లేటెస్ట్ సీజన్ చూడట్లేదని ఆవిడ పేర్కొన్నారు. ఇంకా విష్ణుప్రియ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

- రీతూ చౌదరి షూటింగ్ బిజీతో బిగ్ బాస్ 10 చూడటం లేదన్నారు.
- స్నేహితురాలు విష్ణుప్రియతో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు.
- ఆహా ఓటీటీ 'షెఫ్ మంత్ర' కుకింగ్ షోలో టీమ్‌గా కనిపించనున్నారు.
Rithu Chowdary Comments On Vishnu Priya: తెలుగు బుల్లితెర వీక్షకులకు రీతూ చౌదరి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి కార్యక్రమాల్లో సందడి చేసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రియాలిటీ షో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లో సందడి చేశారు. బిగ్ బాస్ 9లో ఆమె 90 రోజులు ఉన్నారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యారనుకోండి. కానీ, మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 స్టార్ట్ అయ్యింది. అది చూడటం లేదని రీతు చౌదరి స్పష్టం చేశారు. ఇంకా తన ఫ్రెండ్ విష్ణుప్రియా భీమనేని మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
బిగ్ బాస్ చూడట్లేదు... అసలు రీజన్ అదే!
ప్రస్తుతం తాను 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 చూడటం లేదని అందాల భామ రీతూ చౌదరి తెలిపారు. వరుస చిత్రీకరణలలో బిజీగా ఉండటం వల్ల 'బిగ్ బాస్' షోను చూడలేకపోతున్నానని, అంతకు మించి మరొక కారణం ఏమీ లేదని, త్వరలో వీలు కుదిరినప్పుడు ఎపిసోడ్స్ అన్నీ చూస్తానని ఆమె చెప్పారు. అదీ సంగతి. తాను చూడకపోయినప్పటికీ... తెలుగు బుల్లితెర వీక్షకులను మాత్రం తప్పకుండా 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 చూడాల్సిందిగా కోరారు రీతు.
విష్ణుతో ప్రాజెక్ట్ సెట్... రీతు చౌదరి హ్యాపీ!
బుల్లితెర కార్యక్రమాలు, సినిమాలతో పాటు ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్, ఇంకా వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న మరొక అందాల భామ విష్ణుప్రియా భీమనేని. రీతూ చౌదరికి ఆమె క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరూ కలిసి టూర్లు, షికార్లకు వెళ్తారు. వాళ్లిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అందరి కోరిక నెరవేరబోతోంది.
View this post on Instagram
విష్ణుప్రియ, తాను కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే చూడాలని చాలా మంది చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారని రీతూ చౌదరి చెప్పారు. ఫైనల్లీ... 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కుకింగ్ షో 'షెఫ్ మంత్ర'లో కలిసి ఓ టీమ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని సంతోషంగా చెప్పారు. 'షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె' వీక్షకులకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని రీతూ చౌదరి చెప్పారు. ఇందులో మొత్తం ఆరు టీమ్‌లు (జోడీలు) ఉన్నాయని, అందులో విష్ణుప్రియతో పాటు తాను ఓ టీమ్ అని, ఇద్దరు అమ్మాయిలుగా ఒక జోడీగా పాల్గొంటున్నారని, అదే విశేషమని పేర్కొన్నారు రీతూ చౌదరి. అదీ సంగతి.
Frequently Asked Questions
రీతూ చౌదరి ప్రస్తుతం ఏ షో చూడటం లేదు?
రీతూ చౌదరి మరియు విష్ణుప్రియ కలిసి ఏ ప్రాజెక్టులో పాల్గొంటున్నారు?
రీతూ చౌదరి, విష్ణుప్రియ కలిసి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కుకింగ్ షో 'షెఫ్ మంత్ర'లో పాల్గొంటున్నారు. వారు ఒక టీమ్‌గా ఈ షోలో ఉంటారు.
'షెఫ్ మంత్ర' షో ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది?
'షెఫ్ మంత్ర' అనే కుకింగ్ షో 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో మొత్తం ఆరు టీమ్‌లు పాల్గొంటాయి.
ట్రెండింగ్ వార్తలు





















