అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today September 25th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: ఎన్నారైతో పెళ్లికి రెడీ అయిన గౌరి – ఎన్నారైగా తన ఫ్రెండును పంపిస్తున్న రాకేష్‌

Prema Entha Madhuram  Today Episode: శంకర్‌ ను తిట్టిన గౌరి వెంటనే తనకు సంబంధం చూడమని బాబాయ్‌కు చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  గౌరి కూడా తనకు శంకర్‌ అంటే ఇష్టం లేదని ఎక్కడ ఉంచాల్సిన వారిని అక్కడ ఉంచితే బాగుంటుందని అంటుంది. దీంతో పాండు నువ్వు కూడా కొంచెం గౌరవంగా మాట్లాడితే బాగుంటుందని పాండు అంటాడు. దీంతో యాదగిరి, పాండును తిడతాడు. అనవసరంగా చెప్పుడు మాటలు వినొద్దని.. శంకర్‌ సార్‌ ఎలాంటి వారో మీకు బాగా తెలుసు అంటాడు. దీంతో గౌరి కోపంగా బాబాయ్‌ నాకు వెంటనే ఒక మంచి సంబంధం చూడండి నెల రోజుల్లో నా పెళ్లి అయిపోవాలని చెప్తుంది. దీంతో బాబాయ్‌ అమ్మా గౌరి పెళ్లి అనేది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదని చెప్తాడు. గౌరి వినకుండా అబ్బాయి తనకు ఎలా ఉండాలనేది చెప్తుంది. దీంతో పాండు తన దగ్గర నీవు అడిగిన లక్షణాలు ఉన్న అబ్బాయి ఫారిన్‌ సంబంధం ఉందని చెప్తాడు.

పాండు: అమ్మా ఆ అబ్బాయికి ప్యామిలీ వాల్యూస్‌ ఎక్కువ. మీ చెల్లెల్లను కూడా తన చెల్లెల్లుగానే చూసుకుంటాడు. వీళ్లకు కూడా ఫారిన్‌ లో ఉద్యోగాలు చూసి అందర్నీ తనతో పాటే తీసుకెళ్తాడు.

గౌరి: నాకు ఓకే ఓనరు గారు. అబ్బాయిని పలిపించండి.

అని చెప్పి వెళ్లిపోగానే అందరూ షాకింగ్‌ చూస్తుండిపోతారు. తర్వాత విషయం తెలిసి అకి బాధపడుతుంది. అమ్మ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని జెండేను అడుగుతుంది. మరోవైపు రాకేష్‌ ఆవేశంలో ఉండగానే పెళ్లి జరిగిపోవాలని పాండుకు చెప్తాడు. మరోవైపు యాదగిరిని జ్యోతి తిడుతుంది. అకి ఇక అమ్మానాన్నలకు నిజం తెలియాల్సిన టైం వచ్చిందని అకి అంటుంది. ఇలా అందరూ మాట్లాడుకుంటుంటారు.

జెండే: అన్ని ప్రశ్నలకు సమాధానం తెలిస్తే మనం మనుషులను ఎందుకు అవుతాము అకి. దేవుడు వాళ్లకు పునర్జన్మను ఇచ్చాడు. తన వాళ్లందరినీ కలిసేలా చేశాడు. ఒకరికోసం ఒకరు ఏమైనా చేసుకునేంత స్నేహాన్ని ఇచ్చాడు. ఇంత  చేసిన ఆ దేవుడు వాళ్లని జతగా కూడా చేస్తాడు. ఆ నమ్మకంతోనే జోగమ్మ మాటకు విలువిచ్చి ఏం జరుగుతుందో చూద్దాం అకి.

అకి: అలా చూస్తూ ఉంటే జరగరానిది జరగుతుంది ఫ్రెండ్‌. నేను వెళ్లి అమ్మానాన్నలకు నిజం చెప్తాను. ఫస్ట్‌ ఈ సమస్యకు ఇంతకన్నా పరిష్కారం లేదు ఫ్రెండ్‌. లేకపోతే ఈ పెళ్లిని ఆపలేం.

 మరోవైపు

రాకేష్‌: ఈ పెళ్లిని ఆపడానికి ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఎవ్వరూ ఆపలేరు. ఆగదు కూడా

పాండు: నేను ఉన్నాను కదా ఎలాగైనా పెళ్లి జరిపించేస్తాను. ఇంతకీ మనోడి డీటెయిల్స్‌ ఏంటి?

రాకేష్‌: జైలు నుంచి బెయిలు మీద వచ్చిన ఖైదీ. పెళ్లి చేసుకుని మళ్లీ జైలుకు వెళ్లిపోవాలి. సో పది రోజుల్లో ఈ పెళ్లి జరిగిపోవాలి. జరిగేలా నువ్వు చేయాలి. చేస్తావు ఎందుకంటే పది లక్షలు నీ అకౌంట్‌ లో క్రెడిట్‌ అయ్యాయి కాబట్టి.

ఇంకోవైపు

జ్యోతి: మా వదినకు సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయడానికి వాడెవడండి. ఆ ఓనరు గాణ్ని ఈసారి చపాతి పిండి నలిపినట్టు నలిపి చంపేస్తాను. పదండి ముంద వెళ్లి అడుగుదాం.

యాదగిరి: అబ్బా ఇది ఆవేశపడే విషయం కాదే.

జ్యోతి: పోనీ నన్ను వదిన దగ్గరకు తీసుకెళ్లండి నేను మాట్లాడతాను.

యాదగిరి: ఇప్పుడు ఆవిడ ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. సార్‌ మీద కోపంతో ఉన్నారు. ఎవరేం చెప్పినా వినరు నమ్మరు.

మరోవైపు

అకి: నమ్మాలి ఫ్రెండ్‌. వాళ్ల ప్రేమకు కారణం ఆ నమ్మకం. వాళ్లది జన్మజన్మల బంధం అని నమ్మేలా చేయాలి.

జెండే: వద్దు అకి నా మాట విను నా అనుభవంతో చెప్తున్నాను. జోగమ్మ చెప్పినట్లు చేద్దాం.

అకి: అయితే ఆ జోగమ్మనే వెళ్లి అడుగుతాను.

 అంటూ అకి బాధపడుతుంద. మరోవైపు శంకర్‌, గౌరి గురించి ఆలోచిస్తుంటాడు. గౌరి విషయంలో తొందరపడ్డానా? అని గౌరితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. ఇంతలో గౌరి వచ్చి రేపు ఉదయం 9 గంటలకు నా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్లిపోతుంది. శంకర్‌ బాధపడతాడు. తర్వాత జోగమ్మ దగ్గరకు వెళ్లిన అకి విషయం చెప్తుంది. వాళ్ల మధ్య దూరం ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. దీంతో జోగమ్మ ఇది కూడా విధి లికితమే అనుకోవాలి అని చెప్తుంది. జోగమ్మ మాటలకు అకి ఏడుస్తుంది.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Allu Arjun: మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Range Rover Vs Rolls Royce: రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABPతిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Allu Arjun: మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Range Rover Vs Rolls Royce: రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
Airtel Vs Jio: ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు రూ.100 లోపే - మరి ఏ లాభాలు లభిస్తాయి?
ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు రూ.100 లోపే - మరి ఏ లాభాలు లభిస్తాయి?
Pushpa 2: ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Embed widget