అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today October 8th:  ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: వినయ్‌ ని అనుమానించిన శ్రావణి – యాదగిరికి వార్నింగ్‌ ఇచ్చిన గౌరి

Prema Entha Madhuram  Today Episode:  పెళ్లి ఆపేందుకు అందరూ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా గౌరి మాత్రం ఈ పెళ్లి జరిగి తీరాల్సిందేనని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: అమ్మవారి ముందు కూర్చున్న జోగమ్మ వాళ్ల గత జన్మ అర్ధాంతరంగా ముగిసింది. ఈ జన్మలోనేనా వారు పూర్తి జీవితం గడుపుతారనుకుంటే ఇలా చేస్తున్నావేంటమ్మా అని బాధపడుతుంది.  మరోవైపు వినయ్‌ ని పెళ్లికోడుకును చేసిన పాండు నాది లక్కీ హ్యండ్‌ అని చెప్తాడు. ఇప్పుడు పెళ్లికొడుకును అవుతున్నాను. రాత్రికి నవమన్మథుడిని అవుతాను అనగానే పాండు రేపు మళ్లీ జైలులో ఖైదీవి అవుతావు. అని మాట్లాడుకుంటుంటే శ్రావణి వచ్చి వింటుంది. బయటకు వెళ్లి ఆలోచిస్తుంది. సంధ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో సంధ్య వస్తుంది.  

సంధ్య: శ్రావణి పెళ్లి బట్టలు ఎక్కడున్నాయి. ఏమైందే అలా ఉన్నావు.

శ్రావణి: నువ్వు చెప్పింది నిజమే సంధ్య అతని క్యారెక్టర్‌ మంచిది కాదనిపిస్తుంది.

సంధ్య: ఏమైంది శ్రావణి నిన్ను ఏమైనా అన్నాడా?

శ్రావణి: లేదు. కానీ ఓనరు అంకుల్‌ అతనితో మాట్లాడ్డం విన్నాను. వాళ్ల మాటలేవో తేడాగా ఉన్నాయి సంధ్య. అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అక్క పెళ్లికి ఒప్పుకుంది. అక్క జీవితం ప్రమాదంలో పడినట్టే అవుతుంది.

సంధ్య: నేను చెబితే వినిపించుకోలేదు. ఇప్పుడు ఏమి చెప్పినా లాభం లేదు.  పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లిని ఆపడం కూడా కుదరదు.

శ్రావణి: ఎందుకు కుదరదు. ఇప్పుడే వెళ్లి అక్కతో చెబుదాం. ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్‌ చేయించాలి. పద.

 అంటూ వెళ్తారు. ఇద్దరు వెళ్లి గౌరికి చెప్పగానే వాళ్లిద్దర్ని గౌరి తిడుతుంది. ఎవ్వరూ ఆపినా ఆగదు ఆ శంకర్‌ పంతం నెగ్గదు. ఈ పెళ్లి జరుగుతుంది అని గౌరి చెప్తుంది. మరోవైపు శంకర్‌ వాళ్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్తుంటే ఒంటి ఓనరు పాండు టూ లెట్‌ బోర్డు తీసుకుని వస్తాడు. ఇంతలో యాదగిరి వచ్చి కంగారుపడుతుంటాడు. మరోవైపు ఇంట్లో ఏడుస్తూ కూర్చున్న అకిని చూసిన రాకేష్‌ హ్యాపీగా ఫీలవుతాడు. నువ్వు మీ అమ్మానాన్నను కలిపేసి మీ కుంటుంబం అంతా హ్యాపీగా ఉంటే చూస్తూ ఊరుకుంటానా  అనుకుంటూ అకి దగ్గరకు వెళ్లి ఏంటి బాధపడుతున్నావు అని అడుగుతాడు. నాతో షేర్‌ చేసుకోకూడదా? అని అడుగుతుండగా రవి వస్తాడు.

రవి: షేర్‌ చేసుకోవడానికి ఏమీ లేదు సార్‌. గౌరి గారికి పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లి కొడుకు అంత మంచివాడు కాదని తెలిసింది. అందుకే బాధపడుతుంది.

రాకేష్‌: సో సాడ్‌. కొన్నింటిని ఆపినా ఆగవు.

రవి: శంకర్‌ గారి ప్లాన్‌ వర్కవుట్‌ అయ్యుంటే ఇంత వరకు వచ్చి ఉండేది కాదు.

అభయ్‌: ఏంటి ఏదో సీరియస్‌ డిష్‌కర్షన్‌ లో ఉన్నారు.

రవి: ఏం లేదు సార్‌ గౌరి గారి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాము.

అభయ్‌: అవును ఏవో ఇష్యూస్‌ అవుతున్నాయి అన్నారు అవి ఇంకా క్లియర్‌ అవ్వలేదా?

రాకేష్‌: ఈరోజు పెళ్లి పెట్టుకుని ఏం క్లియర్‌ అవుతుంది అభయ్‌.

అభయ్‌: ఓ ఈరోజేనా..?

రాకేష్‌: మనకు ఇన్విటేషన్‌ రాదులే లైట్‌ తీసుకో..

   ఇంతలో యాదగిరి, అకికి ఫోన్‌ చేసి శంకర్‌ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నాడు అని చెప్తాడు. దీంతో భయంగా ఏడుస్తున్న అకి నేను ఇప్పుడే వస్తున్నాను అని వెళ్లిపోతుంటే అభయ్‌ ఏమైందని అడుగుతాడు తర్వాత మాట్లాడతానని వెళ్లిపోతుంది.  మరోవైపు యాదగిరి వెళ్లి శంకర్‌ ను ఆపాలని చూస్తాడు. శంకర్‌ వినడు. ఇంతలో పాండు వచ్చి శంకర్‌ ను చూసి వెటకారంగా మాట్లాడతాడు. మరోవైపు గౌరిని కన్వీన్స్‌ చేయాలని చూస్తుంటారు శ్రావణి, సంధ్య. ఇంతలో యాదగిరి వచ్చి అతడు మంచివాడు కాదని చెప్తుంటాడు.  దీంతో గౌరి యాదగిరిని తిట్టి వార్నింగ్‌ ఇస్తుంది. మరోవైపు రాకేష్‌, పాండుకు ఫోన్‌ చేసి ఏ అడ్డంకి లేకుండా పెళ్లి జరిగిపోవాలని వార్నింగ్‌ ఇస్తాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

 

టాప్ హెడ్ లైన్స్

Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget