అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today November 29th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌:    శంకర్‌ చెంతకు చేరిన చిన్నొడు, పెద్దోడు – ఒకరికి గతజన్మ గుర్తుకు వస్తుందన్న జోగమ్మ

Prema Entha Madhuram  Today Episode:  గౌరి, శంకర్‌ లో ఒకరికి గతజన్మ గుర్తుకు వస్తుందని జోగమ్మ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:   గౌరి పర్మిషన్‌ లేకుండా తన చాంబర్‌ లోకి వచ్చిందని శంకర్‌ అనగానే గౌరి బయటకు వెళ్లి మే ఐ కమీన్‌ సార్‌ అంటుంది. ఎవరూ అంటూ తిరిగి చూసిన శంకర్‌ ఓ వైస్‌ చైర్మన్‌ గారా..? కమీన్‌ అంటాడు. లోపలికి వచ్చిన గౌరి వెనకాలే శ్రావణి, సంధ్య వస్తారు. వాళ్లను చూసిన శంకర్‌.. వీళ్లు అంటే.. వాళ్లు నా చెల్లెల్లు వాళ్లు తమ టాలెంట్‌ తో ఈ కంపనీలో జాబ్‌ సాధించారు.  ఈ ఆఫర్‌ లెటర్స్‌ మీద మీ సంతకం కావాలి చెయండి అంటుంది గౌరి. ఆ లెటర్స్‌ తీసుకున్న శంకర్‌ ఈ లెటర్స్‌ కు ఏదో తక్కు వ అయింది అంటాడు.

గౌరి: ఫ్లీజ్ సంతకం పెట్టండి సార్‌

శంకర్‌: ఆ ఇప్పుడు బ్యాలెన్స్‌ అయింది. ఇందాక ఎవరో మీ సంతకానికి అంత విలువ ఉందా..? అన్నారు. ఆ సంతకం కోసమే వచ్చారు. గేమ్‌ చేంజర్‌ అంటే ఇది. ఇదిగో నా ఆఫీసులో స్ట్రిక్ట్‌ గా వర్క్‌ చేయాలి. టైం వేస్టు చేస్తూ వాగారు అనుకో మనకు అస్సలు నచ్చదు.

గౌరి: ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే.

శంకర్‌: ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థం అయింది కదా..?

శ్రావణి, సంధ్య: అర్థమైంది శంకర్‌ గారు

శంకర్‌: శంకర్‌గారు, టాగూర్‌ గారు.. నానక్‌రాం గూడ గారు ఇలాంటి సౌండ్స్‌ పనికిరావు. ఓకేనా.. ఎస్‌ సర్‌.. ఓకే సర్‌.. అని మాత్రమే పిలవాలి.

శ్రావణి, సంధ్య: ఓకే సార్‌..

గౌరి: మీరు వెళ్లండి నేను వస్తాను.

సంధ్య, శ్రావణి వెళ్లిపోతారు. శంకర్‌ చైర్‌లోంచి లేచి గౌరి పక్కన నిలబడతాడు.

గౌరి: అవును మా చెల్లెల్ల దగ్గర అంతలా బిల్డప్‌ ఇచ్చారు మీ తమ్ముళ్ల దగ్గర కూడా అలాగే ఉంటారా..?

శంకర్‌: వై నాట్‌ ఈ శంకర్‌ అంటే ఏమనుకున్నారు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అతీతంగా ఉంటాడు. కర్తవ్యం ముందు ఈ శంకర్‌కు అందరూ సమానులే..

గౌరి: ఒక్కమాట అన్నందుకు ఇంత క్లాస్‌ పీకాలా..? మీకో దండం.

అంటుంది. బయట శంకర్‌ తమ్ముళ్లు పెద్దొడు, చిన్నొడు వచ్చి శంకర్‌ ను కలవాలనుకుంటారు. ఎఫ్‌ఎం ఆపి వివరాలు తెలుసుకుని లోపలికి పంపిస్తాడు. వాళ్లను చూసిన గౌరి వీళ్లేంటి ఇక్కడికి వచ్చారు మీరే పిలిపించారా..? అని అడుగుతుంది. లేదని శంకర్‌ చెప్తాడు. లోపలికి వచ్చిన పెద్దొడు, చిన్నోడు ఇద్దరిని గౌరి తిడుతుంది. ఎందుకు వచ్చారు మళ్లీ మీ అన్నయ్యను అవమానించడానికి వచ్చారా..? అంటూ నిలదీస్తుంది. ఇంతలో రాకేష్‌ వచ్చి నేనే వీళ్లను తీసుకొచ్చాను అని చెప్తాడు. దీంతో శంకర్‌ వాళ్లకు జాబ్‌ ఇస్తాడు.  నీ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇచ్చి నీకు నవ్వే ప్రమాదం కొని తెచ్చుకున్నావు మిస్టర్‌ ఆర్యవర్థన్‌ అని మనసులో అనుకుంటాడు రాకేష్‌. అభయ్‌, జెండే, అకి, రాకేష్‌ కారులో వెళ్తుంటారు.

అభయ్‌: ఏంటి ఫ్రెండ్‌ అమ్మానాన్నలతో కలిసి ఆఫీసు నుంచి ఏ రెస్టారెంట్‌ క వెళ్లి డిన్నర్‌ చేద్దామనుకుంటే మమ్మల్ని ముందే తీసుకొస్తున్నారు.

అకి: నీకింకా అర్థం కాలేదా అన్నయ్యా.. అమ్మా నాన్నలకు ప్రైవసీ క్రియేట్‌ చేసి వాళ్లిద్దరూ దగ్గర అయ్యేలా చేస్తున్నారు.

అభయ్‌: ఏ పిల్లలైనా అమ్మా నాన్నల  పెళ్లి ఆల్బమ్‌ చూసి సంతోషిస్తారు. మనం మాత్రం అమ్మానాన్నల పెళ్లి చేయబోతున్నాం.

జెండే: సరే వాళ్లింకా.. టామ్‌ అండ్‌ జెర్రీలా గొడవ పడుతూనే ఉన్నారు.

అభయ్: ఆ గొడవలు ఎన్ని రోజులలే ఫ్రెండ్‌

అనుకుంటూ అందరూ ఇంటికి వస్తారు. ఇంటి ఎదురుగా జోగమ్మ కూర్చుని ఉంటుంది. అందరూ ఆమెకు మొక్కి మీ వల్ల అంతా సవ్యంగా జరుగుతుంది. మీ ప్రేమకు వెలకట్టలేము అంటారు. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండేలా మమ్మల్ని దీవించమని అడుగుతారు. ఇంతలో జోగమ్మ మీ అమ్మా నాన్నల్లో ఒకరికి గత జన్మ గుర్తుకు రాబోతుందని చెప్తుంది. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. జెండే మాత్రం మీ మాటలు వింటుంటే ఎందుకో కంగారుగా ఉంది. గతజన్మ గుర్తుకు రావడం వల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా..? అని అడుగుతాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 23th: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget