అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today february 21st: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: ఆనంది గురించి నిజం తెలుసుకున్న ఆర్య, కొత్త ప్లాన్ వేసిన మాన్షి

Prema Entha Madhuram Today Episode: ఆనంది వీణ వాయించడం చూసి ఆర్య షాక్ అవుతాడు. తను ఎవరనేది ఆర్యకు క్లారిటీ రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఆనంది, ఆర్యను నాన్న అని పిలిచి నాకు అన్నం  తినిపించవా అని అడగడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఆనంది నేను నాన్న అని పిలిచానని నువ్వు కూడా అలా పిలవకూడదు అంటుంది అఖి. నువ్వు మీ నాన్నను మాత్రమే నాన్న అని పిలవాలి అని చెప్పడంతో..

అను: అఖి తనేదో పొరపాటున పిలిచిందిలే నువ్వు తిను.

కేశవ్‌: ఏం పాప నీకు కలుపుకోవడం రాదా అమ్మా..

అని అడగ్గానే చేతికి కట్టు చూపిస్తుంది. దీంతో ఆర్య, ఆనందికి అన్నం తినిపిస్తాడు.  అఖి, అభయ్‌ లు వింతగా చూస్తుంటారు. ఆర్య లక్ష్మీని పిలిచి ఆనందిని పైన పడుకోబెట్టమని చెప్తాడు.

శారదా దేవి: ఏంటి నాన్నా ఆ పాప నిన్ను నాన్నా అంటోంది.

ఆర్య: అదేం లేదమ్మా యాక్సిడెంట్‌ వల్ల తను మెంటల్‌గా డిస్టర్బ్‌ అయ్యుండొచ్చని డాక్టర్‌ అన్నారు.

కేశవ్‌: మేము ఎవ్వరం పలకరించినా ఏం రెస్పాన్స్‌ అవ్వదు ఆర్య. నీతో మాత్రం బాగుంటుంది.

ఆర్య: జెండే సృహ వచ్చిన తర్వాత తను ఫస్ట్‌ నన్నే చూసింది. తను భయపడుతున్నట్లు కనిపిస్తే నేనే దగ్గరుండి ధైర్యం చెప్పాను. అందుకే చిన్న కనెక్షన్‌.

అను: తను ఎందుకో ఏ డీటెయిల్స్‌ అడిగినా చెప్పడం లేదండి. ఎవ్వరూ కూడా తన కోసం వెతుకుతున్నట్లు లేదు.

అంటూ అందరూ ఆనంది గురించి ఆలోచిస్తుంటారు. మరోవైపు చాయా టెన్షన్‌ పడుతుంది. తమ ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదని కోపంగా అటూ ఇటూ తిరుగుతుంది. మాన్షి కూడా కోపంగా ఆర్యను తిడుతుంది.

జలంధర్‌: కొన్నిసార్టు మంచి జరిగినట్లు అనిపిస్తుంది. కానీ అది మంచి కాదు. కొన్ని సార్లు బ్యాడ్‌ జరుగుతుంది. అదంతా బ్యాడ్‌ కాదు కదా? మంచేదో చెడేదో మనమే తెలుసుకోవాలి.

మాన్షి: అదే ఎలా ఎం చేయగలం మనం

చాయా: ఫ్యామిలీతో సహా బంగలాకు చేరుకున్నారు కదా అక్కడ సిచ్యుయేషన్‌ ఏంటో కనుక్కో

మాన్షి: కనుక్కోవడానిక ఏం ఉంది. ఆ బంగళాలో పండుగ వాతారవణం ఉంటుంది.

అని మాన్షి ఇంటిలో పనిమనిషికి ఫోన్‌ చేసి అక్కడ ఏం జరుగుందో చెప్పు అని అడగడంతో ఇళ్లంతా పండుగ వాతావరణం నెలకొందని చెప్తుంది. అలాగే ఆనందిని తీసుకొచ్చిన విషయం చెప్పగానే చాయా, జలంధర్‌, మాన్షి షాక్‌ అవుతారు. ఆనంది ఆర్యను నాన్నా అని పిలిచింది అనగానే హ్యాపీగా ఆ పాప ఫోటో పంపించమని చెప్తారు. పనిమనిషి ఆనంది ఫోటో పంపిచగానే చూసి ఎవరా పాప అని ఆలోచిస్తారు. మరోవైపు ఆర్య  పాప గురించి తన ఫోటో పాప దగ్గర ఉన్న విషయం కేశవ్‌కు చెప్తాడు.

కేశవ్‌: వాట్‌ పాప దగ్గర నీ ఫోటో ఉండటం ఏంటి ఆర్య.

ఆర్య: నాకు అదే అర్థం అవ్వడం లేదు. తను నన్ను నాన్నా అని పిలవడం. తన దగ్గర నా ఫోటో ఉండటం నాకే షాకింగ్‌ గా అనిపిస్తుంది.

కేశవ్‌: నువ్వు చెప్పిందంతా వింటుంటే ఏదో అనుమానం వస్తుంది.

అని ఈ విషయం ఎవ్వరితో చెప్పొద్దని ఒక క్లారిటీ వచ్చే వరకు ఎవ్వరికీ చెప్పొద్దని కేశవ్‌ చెప్తాడు. ముందు తను ఎవరు? ఎంటి? అనే విషయం తెలుసుకోవాలని పోలీస్‌ స్టేషన్‌లో ఎంక్వైరీ చేయమని ఆర్య కేశవ్‌కు చెప్తాడు. కేశవ్‌ వెళ్లాక ఆర్యకు ఎవరో స్పీడుగా వెళ్లినట్లు షాడో కనిపిస్తుంది. ఇంతలో వీణ వాయిస్తున్న సౌండ్‌ విని అటు వెళ్తాడు ఆర్య.  అక్కడ ఆనంది వీణ వాయిస్తూ ఉంటుంది. ఇంతలో ఆర్యకు పాత జ్ఞాపకాలు గుర్తుకు  వస్తాయి. ఆర్యను చూసిన ఆనంది నాన్నా అంటూ పరుగెత్తుకొచ్చి హగ్‌ చేసుకుంటుంది.

ఆర్య: నీకు ఆ వీణ వాయించడం వచ్చా అమ్మా ఎక్కడ నేర్చుకున్నావు

ఆనంది: ఏమో తెలియదు.

ఆర్య: మరి తెలియకుండా..

 ఆనంది: ఏ నాన్నా నీకు నచ్చలేదా? సరిగ్గా ప్లే చేయలేదా?

ఆర్య: అది కాదమ్మా బాగా ప్లే చేశావు.

అని మెచ్చుకుని  ఇప్పటికే చాలా లేట్‌ అయ్యింది. వెళ్లి పడుకో అని చెప్పగానే ఆనంది వెళ్లిపోతుంది. మళ్లీ ఆర్య  పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. తర్వాత అను రూంలో తాళాలు వెతుకుతూ కింద పడబోతుంటే ఆర్య వచ్చి పట్టుకుంటాడు. నా ప్రేమలో ఎప్పుడో పడిపోయావు మళ్లీ మళ్లీ ఎందుకు పడతావంటూ రొమాంటిక్‌గా మాట్లాడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: ఆయనతో విలన్ క్యారెక్టర్ చేస్తే తంతారు - మెగా హీరోతో మల్టీ స్టారర్‌పై వరుణ్ వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?
Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Embed widget