Prema Entha Madhuram Serial Today february 19th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: సొంతింటికి వచ్చిన ఆర్య, అను – అంతా హ్యాపీ అనుకున్నటైంలో పాప మిస్
Prema Entha Madhuram Today Episode: ఆర్య, అను సొంతింటికి రావడంలో అందరూ హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇంతలో హాస్పిటల్ నుంచి పాప పారిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: ఆర్యవర్థన్, అను తమ పిల్లలతో కలిసి సొంత ఇంటికి వస్తారు. ఇంట్లో వాళ్లందరూ చాలా హ్యపీగా ఫీలవుతారు. ఆర్య వాళ్ల అమ్మా వచ్చి మీరంతా ప్రెష్ అవ్వండి పూజ చేద్దురు అంటుంది. దీంతో అను తమ బెడ్ రూంలోకి వెళ్తుంది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆను ఎమోషనల్‌గా ఫీలవుతుంది. ఇంతలో ఆర్యవర్ధన్ అక్కడకు వస్తాడు.
ఆర్య: అను ఏమైంది? మన జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయా?
అను: అవును సార్
ఆర్య: ఈ గదిలో మనకెన్నో తీపి జ్ఞాపకాలున్నాయి. అంతే కాదు నువ్వు దూరమైన బాధని నేనంతగా అనుభవించానో ఈ గదికి బాగా తెలుసు అను
అంటూ ఆర్య కూడా ఎమోషన్ అవ్వగానే అను ఏడుస్తూ ఆర్యను హగ్ చేసుకుంటుంది.
ఆర్య: ఈ క్షణం వస్తుందన్న నమ్మకంతోనే ఇన్ని రోజులు గడిపాను.
అను: సారీ సార్
ఆర్య: అను జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇకపై మన మధ్య ఎటువంటి గ్యాప్ రాకూడదు.
అను: రానివ్వను సార్ ఎప్పటికీ రానివ్వను ( ఏడుస్తుంది.)
ఆర్య: అను ఊరుకో..
అను: నా వల్లే నావల్లే ఇదంతా జరిగింది.
ఆర్య: అందుకే పెళ్లైనప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. బ్రెయిన్ ఉంటే సరిపోదు. అప్పుడప్పుడు యూజ్ చేయాలని.. మరి లేకపోతే ఎంటి? ఆవిడెవరో ప్రమాదం ఉందని చెప్పిందట.. ఈవిడగారేమో పిల్లలను తీసుకుని వెళ్లిపోయిందట.
అను: ఆ టైంలో నా భయం అలా చేయించింది మరి.
అనుకుంటూ ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు హాస్పిటల్ నుంచి పారిపోయిన పాపను వెతుక్కుంటూ కిరణ్ రోడ్లన్నీ తిరుగుతుంటాడు. పాప ఆర్యవర్ధన్ కోసం వెతుకుతూ వెళ్తుంది. ఆర్య ఫోటో చూపించి ఇతన్ని ఎక్కడైనా చూశారా అని అడుగుతుంది. ఒకరు ఆర్య అడ్రస్ చెప్పగానే అక్కడకు వెళ్తుంది పాప. మరోవైపు పూజకు అంతా సిద్దం అవ్వగానే ఆర్య, అను పిల్లలతో కలిసి కిందకు వస్తారు. వారిని నీరజ్ ఫోటోలు తీస్తాడు. పిల్లలతోనూ నీరజ్ సెల్ఫీలు దిగుతాడు. తర్వాత హోమం ప్రారంభిస్తారు ఆర్య, అను. ఇంతలో పాపను వెతుకుతున్న కిరణ్ , ఆర్యకు ఫోన్ చేసి మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన పాప కనిపించడం లేదని చెప్తాడు.
ఆర్య: హాస్పిటల్ చుట్టుపక్కల అంతా చూశారా?
కిరణ్: మొత్తం చూశాము సార్ ఎక్కడ కనిపిండం లేదు. అందుకే మీకు కాల్ చేశాను సార్.
ఆర్య: ఓకే.. యూ కీప్ ఆన్ సర్చింగ్ నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను.
కిరణ్: త్వరగా రండి సార్ ఫ్లీజ్
అని చెప్పగానే ఆర్య హోమం మధ్యలోంచి లేచి వెళ్లబోతుంటే... వాళ్ల ఆమ్మ ఆపి మధ్యలో వెళ్లొద్దని చెప్తుంది.
ఆర్య: అర్జెంట్ వర్క్ ఉంది అమ్మా నేను వెళ్లి వస్తాను.
అను: హాస్పిటల్, వెతకటం అంటున్నారు ఏమైంది సార్.
ఆర్య: టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు అను. వేరే చిన్న విషయం వచ్చాక చెప్తాను. నువ్వు పిల్లలతో హోమం కంటిన్యూ చెయ్
నీరజ్: దాదా ఏమైనా వర్క్ ఉంటే నేను వెళ్లి చూసుకుంటాను చెప్పండి.
అనగానే నువ్వు ఇక్కడే ఉండు ఏమైనా అవసరం అనుకుంటే నేను కాల్ చేస్తాను అని చెప్పి ఆర్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అను హోమం కంటిన్యూ చేస్తుంది. మరోవైపు పాప ఆర్య కోసం వెతుకుతుంది. ఇంతలో ఆర్య కారులో వెళ్తూ పాపను చూసి కారు ఆపి పిలుస్తాడు. పాప ఆర్యను చూసి పరుగెత్తుకొస్తుంది. ఎందుకు హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావని ఆర్య పాపను అడుగుతాడు. నన్ను అక్కడి నుంచి వేరే చోటికి పంపిస్తారేమోనని వచ్చానని పాప చెప్తుంది. అయితే మీ అమ్మా నాన్న ఎవరు? ఎక్కడుంటారు చెప్పు అంటూ ఆర్య పాప అడుగుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ఫిదా తర్వాత బ్రేక్ ఇచ్చింది ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’: నటి శరణ్య