Prema Entha Madhuram Today August 8th Episode: అక్కీ టాస్క్‌లను శంకర్, గౌరీ ఎలా పూర్తి చేశారు? ప్రేమ ఎంత మధురంలో ఇవాళ్టి సూపర్ ఎపిసోడ్
Prema Entha Madhuram Serial Today August 8th Episode: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గతజన్మను గుర్తు చేసుకున్న గౌరి, శంకర్ - అకితో గొడవపడ్డ అభయ్
Prema Entha Madhuram Serial Today August 8th Episode: బెస్ట్ కఫుల్ ఈవెంట్‌లో ఆకాంక్ష పెట్టే టాస్కులు తెలుసుకునేందుకు అక్కడ పనిచేసే మేనేజర్‌ను బుట్టలో వేసుకుని ఫోన్ చేస్తాడు రాకేశ్(Rakesh). ఆకాంక్ష ఏం టాస్క్ పెడుతుందో తెలుసుకుని వెళ్లి మనవాళ్లకు చెప్పమని పురమాయిస్తాడు. అప్పుడే ఆకాంక్ష( Akanksha) రాగానే మేనేజర్ తన ఫోన్‌ను జేబులో పెట్టుకుంటాడు. అప్పుడు ఆకాంక్ష ఈ పోటీలో పాల్గొనే జంటల రూమ్‌లకు ఒకే ఒక కాఫీ పంపించమని చెబుతుంది. ఇదే ఈ పోటీలో మొదటి టాస్క్ అని చెబుతుంది. ఇది అర్థం కాని మేనేజర్...రూమ్‌లో ఇద్దరు ఉంటే ఒక కాఫీ పంపితే ఎలా అని అడుగుతాడు. రెండోది కావాలంటే ఏం చేయాలి మేడం అని అంటాడు. దీనికి బదులిచ్చిన ఆకాంక్ష ఆ రెండో కాఫీ అడిగిన జంట తొలి రౌండ్‌లో ఓడిపోయినట్లేనని చెబుతుంది. ఎందుకంటే నిజమైన జంట ఉన్నదాంట్లో సర్ధుకుని తమకు వచ్చిన కాఫీని షేర్ చేసుకుంటుంది. వారి జీవితం కూడా అలాగే ఉన్నదాంట్లో హాయిగా సర్దుకుని ఆనందంగా ఉంటుందని చెబుతుంది. ఇక రెండో కాఫీ అడిగిన వాళ్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటారని చెబుుతుంది.
ఆకాంక్ష చెప్పే టాస్క్ గురించి మొత్తం ఫోన్‌లో విన్న రాకేశ్...ఆకాంక్ష తెలివితేటలను మెచ్చుకుంటాడు. అయితే తాను తనకన్నా తెలివైన వాడినని అందుకే తన మనుషులను అక్కడ పెట్టానని అంటాడు. కానీ ఆ తర్వాత ఆకాంక్ష చెప్పే మాటలు విని షాక్ తింటాడు.
ఆకాంక్ష మేనేజర్(Manager)ను పిలిచి మీ ఫోన్లు అన్నీ సైలెంట్ మోడ్‌లో పెట్టి రిసెప్షన్‌లో ఇవ్వాలని ఆదేశిస్తుంది. ఈ పోటీలో ఎలాంటి చీటింగ్ లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుున్నామని చెప్పడంతో అటు మేనేజర్‌తోపాటు రాకేశ్‌కు కూడా అవాక్కవుతారు. మేనేజర్ తన ఒక్కడి వద్దయినా ఫోన్ ఉంచుకుంటానని చెప్పినా...ఆకాంక్ష ఒప్పుకోదు. అందరి ఫోన్‌లు తీసుకుని డెస్క్‌లో అప్పగిస్తుంది. అలాగే రూమ్‌ల్లోనూ జామర్లు ఏర్పాటు చేశానని..బయటి నుంచి వచ్చే ఏ ఫోన్లు పనిచేయవని చెబుతుంది. రూమ్స్ బయట సీసీ కెమెరాలు(C.C. Camera) ఏర్పాటు చేయించానని ఎవరైనా అనవసరంగా రూమ్‌ల దగ్గరకు వెళితే సహించేది లేదని హెచ్చరిస్తుంది. దీంతో రాకేశ్‌కు అన్నిదారులు మూసుకుపోతాయి.
ఆకాంక్ష చెప్పినట్లుగానే రూమ్ సర్వీస్ బాయ్స్ అందరి గదుల్లోకి ఒక్కో కాఫీ మాత్రమే తీసుకెళ్తారు. శంకర్, గౌరీ ఉంటున్న గది తలుపు కొట్టగానే...గౌరీ శంకర్‌ను లేపుతుంది. కింద నేలపై పడుకున్న శంకర్(Shankar)కు అనుమానం వస్తుంది. ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వకుండానే రూమ్ సర్వీస్ రాడవడంపై అనుమానం బలపతుంది. కింద ఉన్న పక్కబట్టలు మంచంపై వేసి దానిపై పడుకుంటాడు. ఇప్పుు వెళ్లి రూమ్ తలుపు తీయమని గౌరీకి చెప్తాడు. ఆమె రూమ్ తలుపు తీయగానే కాఫీ కప్పు టేబుల్‌పై పెట్టి అక్కడే పనిచేస్తున్నట్లు నటిస్తూ రూమ్ సర్వీస్ బాయ్ వీరినే గమనిస్తాడు. ఏదో టాస్క్ పెట్టారని ఊహించిన శంకర్...ఆ కాఫీని సాసర్‌లోకి తీసుకుని ఇద్దరూ తాగుదామని గౌరీకి సైగ చేసి చెబుతాడు. దీంతో వాళ్లిద్దరూ ఆ కాఫీని షేర్ చేసుకుంటారు.
రూమ్ సర్వీస్ బాయ్స్...అన్ని రూమ్‌ల్లో జరిగిన విషయాన్ని ఆకాంక్షకు చెబుతారు. అన్ని రూమ్‌ల్లో రెండో కాఫీ కావాలని ఆర్డర్ వేశారని...శంకర్, గౌరీ మాత్రమే ఒక కాఫీని షేర్ చేసుకుని తాగారని చెబుతాడు. దీంతో వారిపై ఆకాంక్షు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
అటు శంకర్, గౌరీలు ఒక్కటైపోవడంపై శంకర్ తమ్ముళ్లు, గౌరీ చెల్లెళ్లకు అనుమానం వస్తుంది. కొట్టుకుని విడిపోయేదాక వచ్చిన వాళ్లు ఏదో ఫోన్‌కాల్ రావడంతో ఒక్కటైనట్లు గుర్తిస్తారు. ఆ ఫోన్ కాల్ ఏంటో తెలుసుకోవాలని ఆరాటపడతారు.అప్పుడే వారికి మేడ్‌ఫర్ ఈచ్‌అదర్ కాంటెస్ట్ పాసులు వచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. వాటి ద్వారా అక్కడికి వెళ్లి చూసి వద్దామనుకుంటారు. ఆడవాళ్లు, మగవాళ్లు ఒకరికొకరు అబద్దాలు చెప్పుకుని ఇంట్లోనుంచి బయటపడతారు.
మేనేజర్ రాకేశ్‌కు ఫోన్ చేసి తొలిరౌండ్‌లో మనవాళ్లు ఓడిపోయారని చెబుతాడు. దీంతో మేనేజర్‌పై రాకేశ్ మండిపడతాడు. టాస్క్ గురించి ముందే ఎందుకు తెలుసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే ఆకాంక్ష మేడం ఈ విషయం ముందే లీక్ చేయలేదని చెబుతాడు. ఎలాగైనా ఆమెను మచ్చిక చేసుకుని ఆ రెండో టాస్క్ గురించి తెలుసుకుని తనకు చెబితే తాను...మనవాళ్లకు చెబుతానని చెబుతాడు. దీంతో ఈ రోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.