అన్వేషించండి

Podharillu Serial Today April 30th:కన్నాకు తన పుట్టుక గురించి తెలిసిపోయిందా...? నిజం తెలిసిన కన్నా ఏం చేశాడు..?

Podharillu Serial Today Episode April 30th:కన్నాకు తన పుట్టుక గురించి తెలిసిపోయిందా...? నిజం తెలిసిన కన్నా ఏం చేశాడు..?

Podharillu Serial Today Episode: గ్యాస్‌ ప్రాబ్లం  రావడంతో కన్నాతో కలిసి మహాలక్ష్మీ బయటకు వెళ్లి ఇండక్షన్‌ స్టవ్ కొనుక్కొని వస్తుంది. ఇప్పుడు దానిపైనే పుట్టగొడుగులకూర వండుతానని చెప్పడంతో అందరూ పారిపోవాలని చూస్తారు. కానీ అందరినీ ఆపి నేను చేయడంలేదని...మనం అందరం సాయంచేస్తే పెద్ది వంట చేస్తాడని చెప్పడంతో ఊపిరిపీల్చుకుంటారు. అయితే మాధవ్‌ దగ్గర ఉండి మహాలక్ష్మీతో కూర చేయిస్తాడు. అందరూ కలిసి  అన్నం తినబోతూ.....ముందుగా చక్రిని తినమని ఒత్తిడి చేస్తారు. మీ అందరూ ఉండగా నామీద ప్రయోగాలు ఏంటని అన్నా సరే అందరూ కలిసి బలవంతంగా  మహాలక్ష్మీ వండిన కూర చక్రితో తినిపిస్తారు. అతను తిని చాలాబాగుందని చెప్పడంతో మిగిలిన వాళ్లు కూడా వేసుకుని తింటారు. అయితే చక్రి మాత్రం కూర చాలా బాగుందంటూ మొత్తం వేసుకుని అన్నం కలుపుకుని తింటుంటే పై నుంచి పెచ్చుఊడిపడి అతని పల్లెంలో పడుతుంది.ఇంకా నయం నిద్రపోతున్నప్పుడు తలమీదపడి ఉంటే చచ్చి ఊరుకునేవాళ్లమని అంటాడు.

మహాలక్ష్మీ ఈ ఇంటిని ఎందుకు బాగుచేయించడం లేదని అడగ్గా....ఈ ఇంటిపై మా అత్తయ్య, పెదనాన్న కలిసి కోర్టులో దావా వేశారని అందుకే ఈ ఇంటిని అమ్మడం గానీ, బాగుచేయించడం గానీ కుదరదని చెబుతాడు.మా తాతయ్య అందరికీ సమానంగా వాటాలు పంచి ఇచ్చినా.....వాళ్ల వాటా ఎప్పుడో అమ్ముకున్నారని మళ్లీ మా వాటా కోసం కావాలనే కోర్టులో కేసు వేశారని చెబుతాడు. అయితే మీ ఇంటి కాగితాలు ఎక్కడ ఉన్నాయో చూసి మీరే కోర్టులో కేసు గెలవచ్చు కదా అని మహాలక్ష్మీ అంటుంది. నిజమేగానీ..ఈ ఇంటి కాగితాలు ఎక్కడ ఉన్నాయో మానాన్న చెప్పడం లేదని అంటాడు. అప్పుడే  అక్కడికి వచ్చిన నారాయణను ఇంటి కాగితాలు గురించి అడగ్గా....ఏమో నాకేం తెలుసని వెళ్లిపోతాడు. అటకమీద ఉండి ఉంటాయని....ఆయనకు చూడటం బద్ధకమై కోర్టుకే వెళ్తున్నాడు తప్ప పట్టించుకోవడం లేదని మాధవ్ అంటాడు. అయితే మనమే వెతుకుదాం అని మహాలక్ష్మీ అంటుంది.

Also Read: మీనా-చింతామణి మధ్య యుద్ధం మొదలు, విల్లాకు బయలుదేరిన సత్యం ఫ్యామిలీ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 30 ఎపిసోడ్

అటకమీద ఉన్న పాతసామాన్లు,పెట్టలన్నీ కిందకు దింపి ఇంటి  కాగితాల కోసం వెతకడం ప్రారంభిస్తారు. కేశవ్‌, చక్రి చిన్నప్పటి వస్తువులన్నీ బయటపడుతుంటాయి. వాళ్ల అమ్మతో వాళ్లు దిగిన ఫొటోలు కనిపిస్తాయి.అందులో ముగ్గురు మాత్రమే ఉండటంతో కన్నాకు అనుమానం వచ్చి నేను ఎక్కడె అని అడుగుతాడు. దీంతో మాధవ్‌ ఇదేదే తేడాకొట్టేలా ఉందని వెంటనే ఆపెట్టెలు మూసివేయమని కోప్పడతాడు. అప్పటికీ నువ్వు పుట్టలేదురా అందుకే మేం  ముగ్గురమే ఉన్నామని మాధవ్‌ వాడికి సర్ధిచెబుతాడు. అయినా సరే కన్నా వినకుండా పెట్టేలో ఉన్న మిగిలిన ఫొటోలు వెతుకుతుంటాడు.అప్పుడు ఒకావిడ కన్నాను ఎత్తుకుని ఉండటంతో ఈమె ఎవరని అడగ్గా....తను మనకు పిన్ని అవుతుందని అబద్ధం చెబుతారు. ఇంతలో మహాలక్ష్మీ ఆ ఫొటో చూసి ఆమె నార్త్‌ఇండియన్‌లా ఉందికదా అని అడుగుతుంది.

Also Read: చిన్ని సీరియల్: చిన్నికి దెయ్యం పట్టిందా! ఇద్దరు భార్యల్లో దేవాని చంపేదెవరు? ఆత్మ ఎందుకు అలా చెప్పింది?

అప్పుడే లోపలికి వచ్చిన నారాయణ ఈ పెట్టెలు ఎవరు తెరవమన్నారని అందరిమీద కోప్పడతాడు. దీంతో కన్నా తనను ఎత్తుకున్న ఆవిడ ఎవరని నారాయణను నిలదీస్తాడు.మా అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు ఇంకో ఆవిడను తీసుకొచ్చావని ఊర్లో అందరూ అంటున్నారని...ఆవిడ మధ్యలోనే వెళ్లిపోయిందని చెబుతున్నారని అడుగుతాడు. ఆవిడే ఈవిడ అని నిలదీస్తాడు. అలాంటి బజారు మనిషి నన్ను ఎందుకు  ఎత్తుకుందని గళ్లా పట్టుకుని ప్రశ్నిస్తాడు. దీంతో నారాయణకు కోపం వచ్చి ఆవిడ మీ అమ్మరా అని చెబుతాడు. మాధవ్‌తోపాటు చక్రి మిగిలిన అందరూ తండ్రిమీద అరుస్తారు.ఇప్పుడు వాడికి ఇవన్నీ చెప్పడం అవసరమా అని మండిపడతారు. వాడు వాళ్ల అమ్మ గురించే తప్పుగా మాట్లాడుతుంటే ఏం చేయమంటారని నారాయణ అంటాడు.దీంతో కన్నా నేను మీ సొంత తమ్ముడిని కాదా అని బాధపడతాడు.మిగిలిన అందరూ మేం ఎప్పుడైనా నిన్ను  అలా చూశామా అని ఓదార్చుతారు. అయితే ఈ ఇల్లు ఇలా కావడానికి మాఅమ్మ, నేనే కారణమని....నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయని కన్నా అనుకుంటాడు. అందరూ నిద్రపోయిన  తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget