అన్వేషించండి

Podharillu Serial Today April 14th: గాయత్రిని తలచుకుని బాధపడుతున్న మాధవ్‌ను ఓదార్చడానికి తండ్రి ఇచ్చిన మందు ఏంటి...? గుండెలపై ఉన్న భారాన్ని మాధవ్‌ ఎలా దింపేసుకున్నాడు.

Podharillu Serial Today Episode April 14th:గాయత్రిని తలచుకుని బాధపడుతున్న మాధవ్‌ను ఓదార్చడానికి తండ్రి ఇచ్చిన మందు ఏంటి...? గుండెలపై ఉన్న భారాన్ని మాధవ్‌ ఎలా దింపేసుకున్నాడు.

Podharillu Serial Today Episode: గాయత్రితో పెళ్లి చెడిపోవడంతో మాధవ్‌ చాలా బాధపడుతుంటాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటాడు. అన్నం,కూరలు కూడా సరిగా చేయలేకపోతుంటాడు. ఇదంతా చూసిన చక్రి మాధవ్‌ను బయటకు తీసుకెళ్తాడు. సరదాగా రోడ్డుపై నడుచుకుంట వెళ్తుండగా.. గాయత్రి  ఎంగేజ్‌మెంట్ కోసం వాళ్ల మామయ్య,పెదనాన్న కలిసి ఏర్పాట్లు చేస్తుండగా చక్రి చూసి వెళ్లి చెడగొడదామని అంటాడు. వాళ్ల జోలికి మనం వెళ్లొద్దని మాధవ్‌ ఆపుతాడు. ఇంతలోనే మేడపై నుంచి గాయత్రి మాధవ్‌ను చూస్తుంది. మాధవ్‌ కూడా గాయత్రిని చూసి మరింతగా  బాధపడి ఇంటికి వెళ్లిపోతాడు. అందరూ కలిసి  అన్నం తింటుండగా....కన్నా కూరలో  ఉప్పు ఎక్కువ వేశావేంటని మాధవ్‌ను అడుగుతాడు.చూసుకోకుండా  పడిపోయిందిలేరా అని మాధవ్ సర్దిచెప్పగా...మహా అందిరపైనా గుడ్లు ఉరిమిచూస్తుంది. ఒక్కరోజు వంటసరిగా లేకపోతే తినలేరా అని మండిపడుతుంది. దీంతో అందరూ నోరుమూసుకుని  అన్నం తింటుంటారు. మాధవ్‌ మాత్రం నోటి దగ్గర ముద్ద పెట్టుకోగానే....గాయత్రి గుర్తుకు వచ్చి లేచి వెళ్లిపోతాడు.                 

మాధవ్ బాధ చూడలేకపోయిన తండ్రి నారాయణ....కొడుకుని పిలిచి మందుతాగమని అడుగుతాడు.బాధలన్నీ మర్చిపోవడానికి ఇదే సరైన మందని చెబుతాడు. తనకు తాగుడు అలవాటు లేదని చెప్పినా వినకుండా నారాయణ బలవంతంగా మాధవ్‌కు మందు తాగిస్తాడు. ముందు కొంచెం మందు తాగిన మాధవ్‌...ఆ తర్వాత ఇంకా కావాలంటూ అడిగి మరీ తాగుతాడు. తాను గాయత్రిని ఎంతలా ప్రేమించింంది చెప్పి బాధపడుతుంటాడు.  ఇంతలో పెద్ది కనిపించకపోవడంతో మహా ఇంట్లో వెతుకుతూ కన్నాను అడుగుతుంది.

కొంపదీసి మీనాన్నతో కలిసి మందు తాగడం లేదు కదా అని అంటుంది. మా అన్నయ్యకు అసలు మందు వాసన అంటేనే పడదని....ఎట్టిపరిస్థితుల్లోనూ మందు తాగడని చెబుతాడు. అలా వెతుక్కుంటూ వెళ్లగా....తండ్రితో కలిసి మందు తాగుతున్న  పెద్దిని చూసి మహా మండిపడుతుంది. కొడుకుకు దగ్గర ఉండి  తాగిస్తున్న నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.బాధపడేనాళ్లంతా మందుకు అలవాటుపడితే....ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరూ తాగుబోతులే అవుతారని కోప్పడుతుంది. కన్నా వాళ్ల అన్నయ్యను తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు.
                             

బయటకు వెళ్లిన చక్రి, కేశవ్‌కు మహా ఫోన్‌చేసి విషయం చెప్పడంతో వారు పరుగున ఇంటికి వస్తారు. మీ నాన్న మాధవ్‌ అన్నయ్యకు మందు తాగించారని చెప్పడంతో కోపంతో మాధవ్‌ దగ్గరకు వెళ్తారు.  అప్పటికే నిషా బాగా ఎక్కేసిన మాధవ్‌..గాయత్రి గురించి చెప్పుకుంటూ బాధపడుతుంటాడు. గాయత్రి అంటే తనకు ఎంత ఇష్టమో...చిన్నప్పటి నుంచి తనను ఎలా ప్రేమించాడో చెబుతాడు.అలాగే ఎలాంటి కల్మషంలేని గాయత్రి ప్రేమ అన్నా...తన మాటలు అన్నా అంతే ఇష్టమని చెబుతాడు. చిన్నప్పటి నుంచి గాయత్రి తనను ఎంతలా  ప్రేమించిందో గుర్తుచేసుకుంటాడు. తను పెరటి గుమ్మం నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందోనని  ఎదురుచూసినట్లు చెబుతాడు.

ఏదీఏమైనా ఈ గొడవలన్నీ సర్దుకుని గాయత్రిని తనకే ఇచ్చి పెళ్లిచేస్తారని అనుకున్నానని...కానీ మా దుబాయ్‌ మామయ్య ఇలా చేస్తాడని అనుకోలేదని అంటాడు. గాయత్రి పెళ్లి సంబంధం కుదిరినప్పటి నుంచి ఎన్నోరోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని గాయత్రి మీద తనకు ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆ మాటలు విన్న ముగ్గురు అన్నదమ్ములు మాధవ్‌ను పట్టుకుని ఏడుస్తారు.ఇదంతా చూసిన మహాలక్ష్మీ ఎంతో బాధపడుతుంది. అన్నదమ్ములు మాధవ్‌ను ఓదార్చి...ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెడతారు.
                                       

మహాలక్ష్మీ బయట ఉండి బాధపడుతుంటే....చక్రి ఆమె దగ్గరకు వచ్చి ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందని చెబుతాడు. అతని మాటలు పూర్తికాకుండానే  మహా పిచ్చితిట్లు తిడుతుంది. మీ  అన్నయ్య తాగితే నీకు ఆనందంగా ఉందా అని నిలదీస్తుంది. పైగా డ్యాన్స్ చేయాలని ఉందా అని అంటుంది.అసలు నీకు మెదడులేదని అర్థమవుతుందని తిట్టిపోస్తుంది. ఏదీ ఏమైనా చిన్నప్పటి నుంచి మా అన్నయ్య గుండెల్లో దాచుకున్న బాధ మొత్తం ఇవాళ బయటకు కక్కేశాడని అంటాడు. మా అందరితో చెప్పుకుని తన గుండెలపై ఉన్న భారం దించేసుకున్నాడని అంటాడు. అందుకే నాకు సంతోషంతో డ్యాన్స్ చేయాలని ఉందని అంటాడు. నువ్వు కూడా  ఇలా ఆలోచిస్తావని అనుకోలేదంటూ చక్రిని మహా మెచ్చుకుంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget