అన్వేషించండి

chinni serial today April 14th: చిన్ని సీరియల్: దేవాని వణికించేసి పరుగులు పెట్టించిన కావేరి ఆత్మ! ఆ ఆల్బమ్‌తో మహికి ఏం తెలిసింది?

chinni serial today episode April 14th బాలరాజుని చంపాలని ప్రయత్నించిన దేవాని కావేరి ఆత్మ ముప్పుతిప్పలు పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి మనసు మార్చేయాలని కావేరి ఆత్మ అనుకుంటుంది. అందుకు మహి కళ్ల ముందు ఓ ఫొటోల ఆల్బమ్ పడేలా చేస్తుంది. అందులో కావేరి, పార్వతిలు సంతోషంగా ఉన్న ఫొటోలు ఉంటాయి. మ్యాడీ అవి చూస్తున్నప్పుడే ఓ ఫొటో మీద పార్వతిని కావేరి చంపలేదు అని కనిపిస్తుంది. మ్యాడీ షాక్ అయిపోతాడు. తర్వాత చూస్తే ఆ అక్షరాలు ఉండవు ఇందేంటి అని అనుకుంటాడు. 

చిన్ని మ్యాడీ దగ్గరకు వచ్చి మీ అమ్మ మా అమ్మ అంత క్లోజ్‌గా ఉన్నారు.. మరి మీ అమ్మ చావుకి మా అమ్మ కారణం ఎలా అవుతుంది ఒక సారి ఆలోచించు అని అంటుంది. మ్యాడీ ఏం మాట్లాడకుండా ఫొటోలు అక్కడే పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాడు. రాత్రి లోహిత పడుకోకుండా నాగవల్లి ఫ్రెండ్స్ తాగిన కాఫీ కారంగా ఉండటం.. మ్యాడీ, వరుణ్ తాగిన కాఫీ నార్మల్గా ఉండటం ఏంటి అని ఆలోచిస్తుంది. వరుణ్ వచ్చి ఏమైంది అంటే విషయం చెప్తుంది. నువ్వు దెయ్యాల సినిమాలు చూస్తావు కదా అందుకే నీకు అలా అనిపించిందని అంటాడు. ఇంతలో లోహితకు ఎక్కిళ్లు వచ్చి వాటర్ కోసం చూస్తే టేబుల్ మీద వాటర్ వచ్చి ఎవరో పెట్టినట్లు అవుతాయి. అవి చూసి వరుణ్ అక్కడున్నాయి కదా అంటే ఇందాక లేవు కదా ఇప్పుడు ఎలా వచ్చాయ్ అని లోహిత అంటే గాలికి ఎగురుకుంటూ వచ్చుంటాయి అని లోహితకు నీళ్లు ఇస్తాడు. లోహిత నీళ్లు తాగుతూ ఉంటే కావేరి ఆత్మ ఎంట్రీ ఇచ్చి నీటిని రక్తంలా మార్చేస్తుంది. అది చూసి లోహిత బిత్తరపోతుంది. రక్తం రక్తం అని అరుస్తుంది. వరుణ్ చూసి మంచి నీళ్లు పట్టుకొని రక్తం అంటావేంటి అని కేకలేస్తాడు. 

వరుణ్ వెళ్లిపోయిన తర్వాత లోహితకు గ్లాస్‌లో రక్తం కనిపిస్తుంది.. ఏంటి నేను రక్తం తాగేశానా అని లోహిత వాంతులు చేసుకుంటుంది. కావేరి ఆత్మ వచ్చి ఏంటి కక్కేశావు అని అంటుంది. దాంతో లోహిత పరుగులు పెడుతుంది. తర్వాత పడుకుంటే లోహిత గొంతు నలిపేస్తుంది. మరోవైపు దేవా కావేరి చావుని తలచుకొని కావేరి చావుతో చిన్ని, బాలరాజు సమస్యగా మారారు,, చిన్ని బాలరాజు చావుతో తప్ప ప్రస్తుత సమస్య తప్పిపోదు అని అనుకుంటూ బెడ్ మీద పడుకుంటాడు. పార్వతిని నువ్వు చంపి నేను చంపానని అందరినీ నమ్మించావ్.. నీ నేర చరిత్ర బయట పెడతాను అని నన్ను చంపావ్.,. ఇప్పుడు నా కూతురు అల్లుడిని దూరం చేయాలని చూస్తున్నావ్.. దానికి తగిన మూల్యం చెల్లించక తప్పుదు అని దేవాకి కావేరి మాటలు వినిపిస్తాయి. దాంతో దేవా కంగారుగా లేచి ఎవరు ఎవరు ఇప్పుడు నాతో మాట్లాడింది అని అరుస్తాడు. 

నాగవల్లి వచ్చి ఏమైందని అడుగుతుంది. ఏసీ రూంలో చెమటలు ఏంటి అని అడుగుతుంది. ఏదో పీడ కల వచ్చిందని దేవా అంటాడు. ఇంట్లో దెయ్యం ఎఫెక్ట్ వచ్చిందని అంటున్నారు కదా.. అది బావ వరకు వచ్చిందా అని నాగవల్లి మనసులో అనుకుంటుంది. కావేరి మాటలు నాకు వినిపించడం ఏంటి ఇదేమైనా చిన్ని ప్లాన్‌లో భాగమా అని దేవా అనుకుంటాడు. ఇంతలో బాలరాజు అడ్రస్ దొరికిందని దేవాకి తన మనిషి ఫోన్ చేస్తాడు. వెంటనే దేవా గన్ తీసుకొని అక్కడికి బయల్దేరుతాడు. చిన్ని జీవితం ఏమైపోతుందో.. గడువు దగ్గరకు వచ్చేస్తుందని బాలరాజు ఆఫ్ టికెట్‌తో చెప్తుంటే భయపడకు బాలరాజు అంటూ దేవా ఎంట్రీ ఇస్తాడు.

దేవాని చూసి బాలరాజు, ఆఫ్ టికెట్ ఇద్దరూ కంగారు పడతారు. మీరేంటి అంత షాక్ అవుతున్నారు.. నేను వస్తున్నా అని ఊహించలేదు కదా.. నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తా అని గన్ గురి పెడతాడు. బాలరాజు అన్నని ఏం చేయొద్దని ఆఫ్ టికెట్ వేడుకొని కాళ్లు పట్టుకుంటాడు. దాంతో దేవా ఆఫ్ టికెట్‌ని తోసేస్తే గోడకి తల తగిలి కళ్లు తిరిగి పడిపోతాడు. దేవా బాలరాజుని కొడతాడు. అప్పుడే కావేరి ఆత్మ గాలిలో వస్తూ.. మొత్తం గది అంతా పొగ అల్లుకునేలా చేస్తుంది. దేవా ట్రిగర్ నొక్కకుండా అడ్డుకుంటుంది. దాంతో దేవా గన్ పేల్చలేక గజ గజ వణికిపోతాడు. చేతి నుంచి గన్ కింద పడిపోతుంది.

చుట్టూ పొగ పెద్ద గాలి చూసి కంగారు పడతాడు. ఇక ఓ బెడ్ షీట్ దేవాని కప్పేసి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నా భర్తని చంపడం నీ వల్ల కాదురా.. నీ వల్ల కాదు.. చంపాలని చూస్తే నువ్వే చస్తావ్ అని కావేరి మాట్లాడుతుంది. కావేరి నువ్వు గాలి ఆట మొదలు పెట్టావు కదా నీ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు నీ ఆట నేను కట్టిస్తా అని దేవా వెళ్లిపోతాడు. బాలరాజు లేచి ఆఫ్ టికెట్‌ని లేపి పెద్ద గాలి వచ్చింది వాడు కొట్టుకుపోయాడని చెప్తాడు. ఇక దేవా వచ్చాడని చిన్నికి తెలీకూడదు అని అంటాడు. ఇంతలో చిన్ని కాల్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
Podarillu Serial Today August 6th:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget