అన్వేషించండి

Oorvasivo Rakshasivo Serial Today February 12th: ఊర్వశివో రాక్షసివో సీరియల్: విజయేంద్ర మీద రక్షితకు అనుమానం.. ధీరుని హెచ్చరించిన గురువుగారు!

Oorvasi Vo Rakshasi Vo Serial Today Episode వైష్ణవి మీద ప్రేమతో విజయేంద్ర తమ మీద పగ పట్టాడని రక్షిత అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Oorvasi Vo Rakshasi Vo Today Episode: పవిత్రను రక్షిత ఎక్కడ చూసేస్తుందో అని దుర్గ చాలా టెన్షన్ పడుతుంది. రక్షత పవిత్ర దగ్గరకు వచ్చి చూసే టైంలో పవిత్ర ముఖం మీద క్లాత్ వేసేస్తారు. ఇక రక్షిత ఎవరు ఆ అమ్మాయి అని అడిగితే నాకు తెలిసిన అమ్మాయి అని దుర్గ చెప్తుంది. దీంతో రక్షిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

జయ: విజయేంద్ర ఫొటో పట్టుకొని.. విజయేంద్ర నిన్ను కళ్లారా చూసి రెండేళ్లు అయింది. ఈ రెండేళ్లలో ఈ అమ్మని చూడటానికి ఈరోజు వస్తావ్.. రేపు వస్తావ్ అని నీరాక కోసం ఎదురు చూస్తున్నానురా.. ఈ అమ్మ బాధని ఎప్పుడు తెలుసుకుంటావ్ రా. ఎప్పుడు వస్తావ్ రా.. అంటూ ఫొటో పట్టుకొని ఏడుస్తుంది.
విజయేంద్ర: అమ్మా.. అమ్మా ఏడవకు అమ్మా.. 
జయ: కన్నీళ్లు ఆగడం లేదురా.. అసలు ఏమైందిరా నీకు. రెండేళ్లు అయిందిరా. నీకు ఏమైందో అని ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని నరకం చూశానురా..
విజయేంద్ర: ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టాను అమ్మా. కానీ ఎవరో నామీద కుట్ర చేసి చేయని నేరానికి అరెస్ట్ చేయించారు. జైలుకి వెళ్లాను. నేను నిర్దోషిని అని ఫ్రూవ్ చేసుకొని ఇండియాకు తిరిగి రావడానికి నాకు రెండేళ్లు పట్టింది. ఈ రెండేళ్లలో నేను ఎవరినీ కాంటాక్ట్ చేయలేకపోయాను. మా ఫ్రెండ్ హెల్ప్‌తో ఇక్కడికి రాగలిగాను. ఈ రెండేళ్లలో నువ్వు నా కోసం ఎంత బాధ పడుంటావో నాకు తెలుసమ్మా.. నేను అర్థం చేసుకోగలను. సారీ అమ్మ. అమ్మా నేను ఒక నిజం తెలుసుకోవాలి అమ్మా. ఉన్నది ఉన్నట్లు చెప్తావు అనుకుంటున్నాను. పవిత్ర వైష్ణవిలకు ఏమైంది అమ్మా. నేను యూఎస్ వెళ్లాక వైష్ణవి నిన్ను కలిసిందా నా గురించి ఏమైనా అడిగిందా.. బయట రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ అదంతా అబద్దం అని నా మనసు చెప్తుంది అమ్మా. పోలీస్‌ స్టేషన్‌కు కూడా వెళ్లాను అమ్మా. అసలు వాళ్లు వైష్ణవి వాళ్ల కోసం ఏం చెప్పలేదు. వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఏదో దాస్తున్నారు అనిపించింది. నీకేం నిజం తెలుసో చెప్పమ్మ. నీకు తెలుసు కదా వైష్ణవి అంటే నాకు ఎంత ఇష్టమో.. 
జయ: మనసులో.. నాకు తెలిసింది చెప్పినా ఏదో ఒకటి ఊహించుకొని విజయేంద్ర ఆవేశపడతాడు. నిజం తెలుసుకొనే ప్రాసెస్‌లో వీడికి ఏమైనా అయితే కోపంలో ఎవరిమీదైనా చేయి చేసుకుంటే ఇప్పటికే చేయని తప్పునకు రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. వైష్ణవి గురించి నాకు ఏం తెలీదు అని చెప్పాలి. నేను వైష్ణవి గురించి నలుగురూ అంటుంటే విన్నాను. నువ్వు వెళ్లాక వైష్ణవి నన్ను కలవలేదు. 
విజయేంద్ర: వాళ్లు ఏం తప్పు చేయలేదు అని నా మనసు చెప్తోంది. వాళ్ల మీద ఎవరో నింద వేశారు. తప్పు చేసింది ఎవరో కనిపెడతా.. ఎవరైనా వాళ్లని వదిలిపెట్టను. 

రక్షిత: గురువుగారితో.. గురూజీ పురుషోత్తం, ధీరులు ఎంత ప్రాబ్లమ్‌ని అయినా ఈజీగా తీసుకుంటారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్య నేను ఏమైనా రివర్స్‌లో జరుగుతుంది. ముఖ్యంగా ధీరు విషయంలో నెగిటివ్‌గానే జరుగుతుంది. అది నాకు భయంగా ఉంది.
పురుషోత్తం: గురువుగారు రెండేళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్‌ని రక్షిత ఆలోచిస్తుంది అందుకే.. 
రక్షిత: ఏదేమైనా ఈ ఇంట్లో ఇంతకు ముందులా ప్రశాంతత లేదు. మీరే ఏదైనా చేయాలి. ధీరుకి ఎలాంటి ఆపద రాకూడదు. ధీరు నా ప్రాణం.
గురువుగారు: మీ మాటల్లో భయం నాకు అర్థమైంది. ఒకసారి ధీరేంద్ర జాతకాన్ని తీసుకురండి. జాతకం చూసి.. ధీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. శత్రువు అదును చూసి దెబ్బకొట్టాలి అని ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొన్ని రోజుల వరకు ధీరేంద్ర జాగ్రత్తగా ఉండాలి. శత్రువు వేసే అడుగులు మీకు నిద్ర లేకుండా చేస్తాయి. అమ్మవారిని శాంతిపజేసేలా ఒక హోమం చేయాలి. అమ్మవారి అనుగ్రహం ఉన్నంత వరకు ఏమీ కాదు. ఇక మీరు హోమం ఏర్పాట్లలో ఉండండి..  

రక్షిత: మన శత్రువులు ఎవరా అని ఆలోచిస్తున్నాను. అసలు ధీరు విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది. ఆ పవిత్ర ఇంట్లో వాళ్లు ఎవరైనా బతికే ఉన్నారా.  మరి ఇంకెవరికి అనుమానం ఉంటుంది.  విజయేంద్ర.. 
ధీరు: వాట్ విజయేంద్ర..ఏంటి మామ్..
పురుషోత్తం: అంటే ఇందంతా విజయేంద్ర చేస్తున్నాడు అంటున్నావా.. 
ధీరు: మామ్ వాడికి అంత సీన్ లేదు. నువ్వు అనవసరంగా వాడికి ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావ్.
రక్షిత: లేదు ధీరు నేను కరెక్ట్‌గానే ఆలోచిస్తున్నా. ఇకపై విజయేంద్ర వేసే ప్రతీ అడుగు మనకు తెలియాలి. అంటే విజయేంద్ర మన కళ్లముందే ఉండాలి. చనిపోయింది ఎవరు విజయేంద్ర లవ్ చేసిన అమ్మాయి. వైష్ణవి మీద ప్రేమతో విజయేంద్రనే ఇదంతా చేస్తున్నాడు అనిపిస్తుంది. రేపు హోమానికి విజయేంద్రని జయని ఇంటికి పిలిచి వాళ్లు శాశ్వతంగా ఇక్కడే ఉండేలా చేయబోతున్నాను.
ధీరు: మామ్ మన ఇంట్లోనా.. నోవే..
పురుషోత్తం: ధీరు ఈ విషయంలో మీ అమ్మకు ఎదురు చెప్పకు. 
రక్షిత: ధీరు కొన్ని రోజుల వరకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు. రక్షిత జయకు ఫోన్ చేసి పిలుస్తుంది. విజయేంద్ర వచ్చినట్లు జయరాజ చెప్తే తెలీనట్లు మాట్లాడుతుంది. 

మరోవైపు దుర్గ తన తండ్రి మాటలు ఆలోచిస్తూ ఉంటే ధీరు వస్తాడు. దీంతో ఈ టైంలో ఎందుకు వచ్చావని దుర్గ అడుగుతుంది. ఇక రేపు తమ ఇంట్లో పూజ, హోమం జరుగుతున్నాయని రమ్మని పిలుస్తాడు. దుర్గ రాను అంటే ధీరు ఒప్పిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

'నాగ పంచమి' సీరియల్ ఫిబ్రవరి 12th: పంచమి నిర్ణయంతో ఫుల్ ఖుషీలో మోక్ష.. రగిలిపోతున్న వైదేహి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Manchu Family Issue: కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
ICC Punishment: సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Embed widget